యెండెల లక్ష్మీనారాయణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

యెండెల లక్ష్మీనారాయణ నిజామాబాదు జిల్లాకు చెందిన భారతీయ జనతా పార్టీ రాజకీయ నాయకుడు.

లక్ష్మీనారాయణ మార్చి 1, 1963న నిజామాబాదులో జన్మించారు. వీరి తండ్రి 3 సార్లు పురపాలక సంఘం కౌన్సిలర్‌గా పనిచేశారు. డిగ్రీ చదివే రోజుల్లో కళాశాల ఎన్నికలలో విజయం సాధించారు. ప్రారంభంలో భారతీయ జనతా యువమోర్చాలో పనిచేసి తర్వాత భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులుగా నియమించబడ్డారు. 2009లో నిజామాబాదు (పట్టణ) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున పోటీచేసి ప్రదేశ్ కాంగ్రేస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ పై సంచలన విజయం సాధించారు. తెలంగాణకు మద్దతుగా శాసన సభ్యులు పదవికి రాజీనామా చేసి మళ్ళీ అదేస్థానం నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున మరోసారి ధర్మపురి శ్రీనివాస్ పై గెలుపొందినారు. భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యాడు.

2014లో నిజామాబాదు లోక్సభ నియోజకర్గం నుండి పార్లమెంటుకు పోటీ చేసి ఓడిపోయాడు.

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]