బాన్స్‌వాడ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బాన్స్‌వాడ
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం తెలంగాణ
జిల్లా కామారెడ్డి
మండలం బాన్స్‌వాడ
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 28,384
 - పురుషుల సంఖ్య 13,748
 - స్త్రీల సంఖ్య 14,636
 - గృహాల సంఖ్య 6,216
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

బాన్సువాడ, తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డి జిల్లా, బాన్స్‌వాడ మండలానికి చెందిన జనగణన పట్టణం.[1]ఈ పట్టణం కామారెడ్డి జిల్లా పశ్చిమ భాగంలో ఉంది.ఇది పురపాలక సంఘం హోదాకలిగిన పట్టణం.అంతకుముందు, బాన్స్‌వాడ 20 ఎన్నికల వార్డులతో కలిగిన నోటిఫైడ్ గ్రామ పంచాయతీగా ఉండేది.2018 జనవరి 11 న బాన్స్‌వాడను మునిసిపాలిటీ గ్రేడ్ 3 గా అప్‌గ్రేడ్ చేశారు.2019 జులైలో లో బాన్స్‌వాడ పురపాలక సంఘంను 19 ఎన్నికల వార్డులుగా విభజించారు.

భౌగోళిక స్థితి[మార్చు]

బాన్స్‌వాడ 18.3833°N 77.8833°E. సముద్రమట్టానికి 1220 అడుగుల ఎత్తులో ఉంది.[2]

గణాంకాలు[మార్చు]

2011 భారత జనాభా గణాంకాల నివేదిక ప్రకారం పట్టణ జనాభా 28,384, ఇందులో 13,748 మంది పురుషులు, 14,636 మంది మహిళలు ఉన్నారు.[3]

పట్టణంలో 0 - 6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 3351, ఇది బాన్సువాడ పట్టణ మొత్తం జనాభాలో 11.81%. బాలల లైంగిక నిష్పత్తి 947 గా ఉంది. బాన్స్‌వాడలో పురుషుల అక్షరాస్యత 82.36% కాగా, మహిళా అక్షరాస్యత 66.03%.బాన్సువాడ పట్టణ పరిధిలో మొత్తం 6,216 ఇళ్లకు పైగా పరిపాలనను కలిగి ఉంది. దీనికి నీరు, మురుగునీటి వంటి ప్రాథమిక సౌకర్యాలను బాన్సువాడ స్థానిక స్వపరిపాలన సంస్థ అందిస్తుంది. ఈ సంస్థకు సెన్సస్ టౌన్ పరిమితుల్లో రహదారులను నిర్మించడానికి, దాని పరిధిలోకి వచ్చే ఆస్తులపై పన్ను విధించడానికి కూడా అధికారం ఉంది.[3]

రవాణా సౌకర్యం[మార్చు]

బాన్స్‌వాడ హైదరాబాద్ - మెదక్- బోధన్ - భైంసా జాతీయ రహదారి నంబర్ 765 మార్గంలో ఉంది. సమీప రైల్వే స్టేషన్లు నిజామాబాద్, బోధన్, కామారెడ్డి వద్ద ఉన్నాయి. తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, బాన్స్‌వాడ నుండి అనేక నగరాలు పట్టణాలకు బస్సు సేవలను నిర్వహిస్తుంది.[4] బాన్స్‌వాడ (బిఎస్‌డబ్ల్యుడి) లో టిఎస్‌ఆర్‌టిసి డిపో ఉంది. ఇది 6 మార్చి 1993 న ప్రారంభమైంది.

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-10-22. Retrieved 2018-08-11.
  2. "Maps, Weather, and Airports for Banswada, India". www.fallingrain.com. Retrieved 2020-06-19.
  3. 3.0 3.1 "Banswada Census Town City Population Census 2011-2020 | Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2020-06-19.

వెలుపలి లంకెలు[మార్చు]