కామారెడ్డి జిల్లా
Kamareddy district | |
---|---|
Country | India |
State | Telangana |
Headquarters | Kamareddy |
Mandalas | 23 |
Government | |
• District Collector | Shri Jithesh V Patil IAS |
• Parliament constituencies | 1 |
విస్తీర్ణం | |
• Total | 3,652 కి.మీ2 (1,410 చ. మై) |
జనాభా (2015) | |
• Total | 10,04,259 |
• జనసాంద్రత | 277.2/కి.మీ2 (718/చ. మై.) |
Demographics | |
• Literacy | 56.51 |
• Sex ratio | 1033 |
Time zone | UTC+05:30 (IST) |
Vehicle registration | TS–17[1] |
కామారెడ్డి జిల్లా, తెలంగాణలోని 33 జిల్లాలలో ఒకటి.[2] కామారెడ్డి అనే పేరు సా.శ. 1600 నుండి 1640 కాలంలో దోమకొండ కోటను పరిపాలించిన “చిన్న కామిరెడ్డి” నుండి ఈ పేరు వచ్చింది. ఈ ప్రదేశం పూర్వె కోడూరుగా పిలువబడేది. ప్రస్తుతం కిష్టమ్మ గుడి దగ్గర ఈ గ్రామం ఉంది. 2016 అక్టోబరు 11న కొత్తగా అవతరించిన ఈ జిల్లాలో కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి అనే 3 రెవెన్యూ డివిజన్లు, 22 మండలాలు, 450 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[2] 44వ నెంబరు జాతీయ రహదారిపై ఉన్న కామారెడ్డి పట్టణం ఈ జిల్లా పరిపాలన కేంద్రంగా మారింది. ఇందులోని అన్ని మండలాలు మునుపటి నిజామాబాదు జిల్లాలోనివే.
జిల్లా గణాంకాలు
[మార్చు]కామారెడ్డి జిల్లా విస్తీర్ణం: 3,667 చ.కి.మీ., జనాభా: 9,74,227, అక్షరాస్యత: 48.49 శాతంగా ఉన్నాయి.
భౌగోళికం
[మార్చు]జిల్లా 3,652.00 చదరపు కిలోమీటర్లు (1,410.05 చ. మై.) విస్తీర్ణంతో రాష్ట్రంలో 15వ అతిపెద్ద జిల్లాగా నిలిచింది.[3] కామారెడ్డికి ఉత్తరాన నిజామాబాద్ జిల్లా, తూర్పున రాజన్న సిరిసిల్ల, సిద్ధిపేట జిల్లాలు, దక్షిణాన సంగారెడ్డి, మెదక్ జిల్లాలు, పశ్చిమ-నైరుతిలో వరుసగా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన నాందేడ్ జిల్లా, బీదర్ జిల్లాలు సరిహద్దులగా ఉన్నాయి.
జనాభా
[మార్చు]2011 భారత జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 974,227 మంది ఉన్నారు. జనాభాలో రాష్ట్రంలోని జిల్లాల్లో 15వ స్థానంలో ఉంది.[4][5] మొత్తం జనాభాలో షెడ్యూల్డ్ కులాలు 15.77%, షెడ్యూల్డ్ తెగలు 8.41% ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 72.87% జనాభా తెలుగు, 9.73% ఉర్దూ, 8.57% లంబాడీ, 3.89% మరాఠీ, 3.23% కన్నడ వారి మొదటి భాషగా మాట్లాడేవారు ఉన్నారు.[6]
జిల్లాలోని మండలాలు
[మార్చు]తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 230 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016 ప్రకారం ఈ విభాగంలలో 22 (ఇరవై రెండు రెవెన్యూ మండలాలు ఉన్నాయి.
- కామారెడ్డి మండలం
- బిక్నూర్ మండలం
- తాడ్వాయి మండలం
- దోమకొండ మండలం
- మాచారెడ్డి మండలం
- సదాశివనగర్ మండలం
- బాన్స్వాడ మండలం
- బీర్కూర్ మండలం
- బిచ్కుంద మండలం
- జుక్కల్ మండలం
- పిట్లం మండలం
- మద్నూరు మండలం
- నిజాంసాగర్ మండలం
- యెల్లారెడ్డి మండలం
- నాగిరెడ్డిపేట మండలం
- లింగంపేట్ మండలం
- గాంధారి మండలం
- రాజంపేట్ మండలం*
- బీబీపేట మండలం*
- రామారెడ్డి మండలం*
- నసురుల్లాబాద్ మండలం*
- పెద్ద కొడపగల్ మండలం
- డోంగ్లి మండలం*
- పాల్వంచ మండలం*
- మొహమ్మద్ నగర్ మండలం*
గమనిక:* పునర్య్వస్థీకరణలో భాగంగా జిల్లాలో కొత్తగా ఏర్పడిన మండలాలు (6)
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Telangana New Districts Names 2016 Pdf TS 31 Districts List". Timesalert.com. 11 October 2016. Retrieved 11 October 2016.
- ↑ 2.0 2.1 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 230 Revenue (DA-CMRF) Department, Dt: 11-10-2016
- ↑ "New districts". Andhra Jyothy.com. 8 October 2016. Archived from the original on 25 డిసెంబరు 2018. Retrieved 8 October 2016.
- ↑ District census 2011: Nizamabadby mandals
- ↑ "Archived copy". Archived from the original on 8 July 2017. Retrieved 16 January 2017.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ 2011 Census of India, Population By Mother Tongue
వెలుపలి లంకెలు
[మార్చు]- క్లుప్త వివరణ ఉన్న articles
- Pages using infobox settlement with bad settlement type
- Pages using infobox settlement with image map1 but not image map
- Pages using infobox settlement with no coordinates
- తెలంగాణ జిల్లాలు
- కామారెడ్డి జిల్లా
- వ్యక్తుల పేరుతో ఉన్న తెలంగాణ జిల్లాలు
- వ్యక్తుల పేరుతో ఉన్న జిల్లాలు
- Pages using the Kartographer extension