Jump to content

సదాశివనగర్ మండలం (కామారెడ్డి జిల్లా)

అక్షాంశ రేఖాంశాలు: 18°26′54″N 78°16′04″E / 18.448347°N 78.267746°E / 18.448347; 78.267746
వికీపీడియా నుండి

సదాశివనగర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డి జిల్లాకు చెందిన మండలం.[1]

సదాశివనగర్‌
—  మండలం  —
తెలంగాణ పటంలో కామారెడ్డి జిల్లా, సదాశివనగర్‌ స్థానాలు
తెలంగాణ పటంలో కామారెడ్డి జిల్లా, సదాశివనగర్‌ స్థానాలు
తెలంగాణ పటంలో కామారెడ్డి జిల్లా, సదాశివనగర్‌ స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°26′54″N 78°16′04″E / 18.448347°N 78.267746°E / 18.448347; 78.267746
రాష్ట్రం తెలంగాణ
జిల్లా కామారెడ్డి జిల్లా
మండల కేంద్రం సదాశివనగర్ (కామారెడ్డి జిల్లా)
గ్రామాలు 20
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 196 km² (75.7 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 56,005
 - పురుషులు 27,362
 - స్త్రీలు 28,643
అక్షరాస్యత (2011)
 - మొత్తం 45.37%
 - పురుషులు 61.29%
 - స్త్రీలు 29.75%
పిన్‌కోడ్ 503145

ఇది సమీప పట్టణమైన కామారెడ్డి నుండి 13 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం నిజామాబాదు జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం కామారెడ్డి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 22   రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో 2  నిర్జన గ్రామాలు. మండల కేంద్రం సదాశివనగర్.

గణాంకాలు

[మార్చు]
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త నిజామాబాదు జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా- మొత్తం:56,005 - పురుషులు:27,362 - స్త్రీలు:28,643; అక్షరాస్యత - మొత్తం 45.37% - పురుషులు:61.29% - స్త్రీలు:29.75%

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 196 చ.కి.మీ. కాగా, జనాభా 41,551. జనాభాలో పురుషులు 20,209 కాగా, స్త్రీల సంఖ్య 21,342. మండలంలో 10,162 గృహాలున్నాయి.[3]

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. భూంపల్లె
  2. పద్మాజీవాడి
  3. తుక్కోజీవాడి
  4. తిమ్మోజీవాడి
  5. దగ్గి
  6. కల్వరాల్
  7. సదాశివనగర్‌
  8. తిర్మన్‌పల్లె
  9. మర్కల్
  10. మోడెగాం
  11. లింగంపల్లె
  12. ముద్దోజీవాడి
  13. జనగావ్
  14. ధర్మారావుపేట
  15. అమర్లబండ
  16. కుప్రియాల్
  17. అడ్లూర్ యెల్లారెడ్డి
  18. వజ్జెపల్లె (ఖుర్దు)
  19. ఉట్నూర్
  20. యాచారం   

గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-10-22. Retrieved 2019-02-07.
  2. "కామారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు

[మార్చు]