పాల్వంచ మండలం (కామారెడ్డి)
పాల్వంచ మండలం, తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డి జిల్లాకు చెందిన మండలం. 2016లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో ఉన్న పాల్వంచ గ్రామాన్ని 2023లో మండలంగా ప్రకటించింది. ఈ మండలం కామారెడ్డి రెవెన్యూ డివిజనులో 10 గ్రామాలతో పాల్వంచ మండలంగా కొత్తగా ఏర్పడింది.[1][2]
మండలం ఏర్పాటు ప్రక్రియ[మార్చు]
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని పాల్వంచ గ్రామాన్ని నూతన మండలంగా ఏర్పాటు చేస్తూ చీఫ్ సెక్రటరీ సోమేశ్‌కుమార్ ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ను 2022 ఆగష్టు 27న విడుదల చేయగా దీనిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే 15 రోజుల్లో తెలపాలని సూచించాడు.[3] మాచారెడ్డి మండలం నుంచి 9 గ్రామాలను, రామారెడ్డి మండలం నుంచి మరో గ్రామాన్ని కలిపి జీవో 38 ద్వారా పల్వంచను మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తూ 2023 ఏప్రిల్ 19న రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్‌మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశాడు.[4]
మండలం లోని గ్రామాలు[మార్చు]
రెవెన్యూ గ్రామాలు[మార్చు]
- పాల్వంచ
- ఎల్పుగొండ
- వాడి
- ఫరీద్‌పేట
- బండ రామేశ్వర్ పల్లి
- భవానీపేట
- ఇసాయిపేట్
- దేవన్‌పల్లె
- పోతారం
- సింగరాయిపల్లె
మూలాలు[మార్చు]
- ↑ V6 Velugu (19 April 2023). "కామారెడ్డి జిల్లాలో మరో కొత్త మండలం". Archived from the original on 10 June 2023. Retrieved 10 June 2023.
- ↑ Sakshi (19 April 2023). "ఇక పాల్వంచ మండలం". Archived from the original on 10 June 2023. Retrieved 10 June 2023.
- ↑ Namasthe Telangana (27 August 2022). "పాల్వంచ మండల కేంద్రంగా ఏర్పాటు". Archived from the original on 10 June 2023. Retrieved 10 June 2023.
- ↑ Andhra Jyothy (19 April 2023). "జిల్లాలో మరో మండలంగా పల్వంచ". Archived from the original on 10 June 2023. Retrieved 10 June 2023.