నసురుల్లాబాద్ మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నసురుల్లాబాద్
—  మండలం  —
తెలంగాణ పటంలో కామారెడ్డి జిల్లా, నసురుల్లాబాద్ స్థానాలు
తెలంగాణ పటంలో కామారెడ్డి జిల్లా, నసురుల్లాబాద్ స్థానాలు
తెలంగాణ పటంలో కామారెడ్డి జిల్లా, నసురుల్లాబాద్ స్థానాలు
రాష్ట్రం తెలంగాణ
జిల్లా కామారెడ్డి జిల్లా
మండల కేంద్రం నసురుల్లాబాద్ (కామారెడ్డి జిల్లా )
గ్రామాలు 13
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 103 km² (39.8 sq mi)
జనాభా (2016)
 - మొత్తం 26,839
 - పురుషులు 13,013
 - స్త్రీలు 13,826
పిన్‌కోడ్ {{{pincode}}}


నసురుల్లాబాద్ మండలం , తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డి జిల్లాకు చెెందిన మండలం.[1]ఇది సమీప పట్టణమైన బోధన్ నుండి 30 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు. [2] ఇందులో 13 గ్రామాలున్నాయి. దానికి ముందు ఈ మండలం నిజామాబాదు జిల్లా లో ఉండేది. [3] ప్రస్తుతం ఈ మండలం బాన్సువాడ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది కామారెడ్డి డివిజనులో ఉండేది.ఈ మండలంలో  16  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో 3  నిర్జన గ్రామాలు.మండల కేంద్రం నసురుల్లాబాద్

గణాంకాలు[మార్చు]

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 103 చ.కి.మీ. కాగా, జనాభా 26,839. జనాభాలో పురుషులు 13,013 కాగా, స్త్రీల సంఖ్య 13,826. మండలంలో 6,426 గృహాలున్నాయి.[4]

2016 ఏర్పడిన కొత్త మండలం[మార్చు]

లోగడ నసురుల్లాబాద్  గ్రామం,నిజామాబాదు జిల్లా కామారెడ్డి రెవెన్యూ డివిజను పరిధిలోని బిర్కూర్ మండల పరిధిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా నసురుల్లాబాద్ గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా కొత్తగా ఏర్పడిన కామారెడ్డి జిల్లా, కామారెడ్డి రెవెన్యూ డివిజను పరిధి క్రింద 1+15 (పదహారు) గ్రామాలుతో నూతన మండలంగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[1]

మండలం లోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. నసురుల్లాబాద్
  2. మైలారం
  3. బొప్పాస్‌పల్లె
  4. నమ్లి
  5. నచ్‌పల్లె
  6. బొమ్మనదేవ్‌పల్లె
  7. సంగం
  8. అంకోల్
  9. దుర్కి
  10. కమ్షేత్‌పల్లె
  11. హాజీపూర్
  12. బసవాయిపల్లె
  13. మిర్జాపూర్

గమనిక:నిర్జన గ్రామాలు 3 పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-10-22. Retrieved 2019-02-06.
  2. "కామారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-20 suggested (help)
  3. "కామారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-20 suggested (help)
  4. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు[మార్చు]