బిక్నూర్ మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బిక్నూర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డి జిల్లా, బిక్నూర్ మండలానికి చెందిన గ్రామం.[1]

భిక్నూర్‌
—  మండలం  —
తెలంగాణ పటంలో కామారెడ్డి జిల్లా, భిక్నూర్‌ స్థానాలు
తెలంగాణ పటంలో కామారెడ్డి జిల్లా, భిక్నూర్‌ స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: అక్షాంశ రేఖాంశాలు: 18°12′54″N 78°26′12″E / 18.215003°N 78.436661°E / 18.215003; 78.436661
రాష్ట్రం తెలంగాణ
జిల్లా కామారెడ్డి జిల్లా
మండల కేంద్రం బిక్నూర్ (బిక్నూర్ మండలం)
గ్రామాలు 15
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 154 km² (59.5 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 59,656
 - పురుషులు 29,157
 - స్త్రీలు 30,499
అక్షరాస్యత (2011)
 - మొత్తం 53.02%
 - పురుషులు 68.85%
 - స్త్రీలు 37.10%
పిన్‌కోడ్ 503101

ఇది సమీప పట్టణమైన కామారెడ్డి నుండి 20 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం నిజామాబాదు జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం కామారెడ్డి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 15  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు. మండల కేంద్రం బిక్నూర్

గణాంకాలు[మార్చు]

2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త నిజామాబాదు జిల్లా పటంలో మండల స్థానం

2011 జనాభా లెక్కల ప్రకారం భిక్నూర్ మండలం మొత్తం జనాభా 59,656. వీరిలో 29,157 మంది పురుషులు కాగా, 30,499 మంది మహిళలు ఉన్నారు. భిక్నూర్ మండలంలో మొత్తం 14,732 కుటుంబాలు నివసిస్తున్నాయి. మండల సగటు లింగ నిష్పత్తి 1,046. మండల జనాభా అంతా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. పట్టణ ప్రాంతంలో సగటు అక్షరాస్యత రేటు 58.5%. మండల లింగ నిష్పత్తి 1,046. మండలంలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 5861, ఇది మొత్తం జనాభాలో 10%. 0-6 సంవత్సరాల మధ్య 2995 మంది మగ పిల్లలు, 2866 మంది ఆడ పిల్లలు ఉన్నారు. మండలంలోని బాలల లింగ నిష్పత్తి 957, ఇది మండలం సగటు లింగ నిష్పత్తి (1,046) కంటే తక్కువ.మొత్తం అక్షరాస్యత రేటు 58.47%. పురుషుల అక్షరాస్యత రేటు 63.18%, స్త్రీల అక్షరాస్యత రేటు 42.73%[3]

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 154 చ.కి.మీ. కాగా, జనాభా 47,766. జనాభాలో పురుషులు 23,314 కాగా, స్త్రీల సంఖ్య 24,452. మండలంలో 11,827 గృహాలున్నాయి.[4]

మండలం లోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. అంతంపల్లి
  2. బాగీర్థ్‌పల్లె
  3. బస్వాపూర్
  4. బిక్నూర్‌
  5. గుర్జకుంట
  6. ఇస్సానాపల్లె
  7. జంగంపల్లె
  8. కాచాపూర్
  9. కంచెర్ల
  10. లక్ష్మిదేవిపల్లె
  11. మల్లుపల్లె
  12. పెద్దమల్లారెడ్డి
  13. రామేష్వర్‌పల్లె
  14. ర్యాగట్లపల్లె
  15. తిప్పాపూర్

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-10-22. Retrieved 2019-02-07.
  2. "కామారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
  3. "Bhiknoor Mandal Population, Religion, Caste Nizamabad district, Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Retrieved 2022-07-26.
  4. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు[మార్చు]