రాజంపేట్ మండలం (కామారెడ్డి జిల్లా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రాజంపేట్ మండలం, తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డి జిల్లాకు చెందిన మండలం.[1] ఇది సమీప పట్టణమైన కామారెడ్డి నుండి 8 కి. మీ. దూరంలో, తలమడ్ల రైల్వేస్టేషను నుండి ఒక కిలోమీటరు దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు. [2] ఇందులో 8 గ్రామాలున్నాయి. దానికి ముందు ఈ మండలం నిజామాబాదు జిల్లా లో ఉండేది. [3] ప్రస్తుతం ఈ మండలం కామారెడ్డి రెవిన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో  8  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు

కొత్త మండల కేంద్రంగా గుర్తింపు[మార్చు]

లోగడ రాజంపేట  గ్రామం మహబూబ్ నగర్ జిల్లా కామారెడ్డి రెవెన్యూ డివిజను పరిధిలోని బిక్నూర్ మండల పరిధిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా రాజంపేట గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా కొత్తగా ఏర్పడిన కామారెడ్డి జిల్లా, కామారెడ్డి రెవెన్యూ డివిజను పరిధి క్రింద 1+7 (ఎనిమిది) గ్రామాలుతో నూతన మండలంగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[1]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. రాజంపేట్
  2. పొందుర్తి
  3. తలమడ్ల
  4. పెద్దపల్లి
  5. అర్గొండ
  6. కొండాపూర్
  7. గుండారం
  8. సిద్దాపూర్

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-10-22. Retrieved 2019-02-07.
  2. "కామారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
  3. "కామారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.

వెలుపలి లంకెలు[మార్చు]