కామారెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కామారెడ్డి
కామారెడ్డి is located in Telangana
కామారెడ్డి
కామారెడ్డి
తెలంగాణ పటంలో కామారెడ్డి స్థానం
కామారెడ్డి is located in India
కామారెడ్డి
కామారెడ్డి
కామారెడ్డి (India)
నిర్దేశాంకాలు: 18°19′23″N 78°20′06″E / 18.323°N 78.335°E / 18.323; 78.335Coordinates: 18°19′23″N 78°20′06″E / 18.323°N 78.335°E / 18.323; 78.335
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాకామారెడ్డి
ప్రభుత్వం
 • ప్రభుత్వ రకంస్థానిక స్వపరిపాలన సంస్థ
 • నిర్వహణపురపాలకసంఘం
విస్తీర్ణం
 • మొత్తం14.10 కి.మీ2 (5.44 చ. మై)
సముద్రమట్టం నుండి ఎత్తు
495 మీ (1,624 అ.)
జనాభా
(2011)[2]
 • మొత్తం80,378
 • సాంద్రత5,700/కి.మీ2 (15,000/చ. మై.)
భాషలు
 • అధికారకతెలుగు
కాలమానంUTC+5:30 (IST)
పిన్‌కోడ్
503111 & 503112
ప్రాంతీయ ఫోన్‌కోడ్08468
వాహనాల నమోదు కోడ్TS 17
జాలస్థలిkamareddymunicipality.telangana.gov.in

కామారెడ్డి, తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డి జిల్లా, కామారెడ్డి మండలానికి చెందిన పట్టణం.[3]

ఈ పట్టణం 7 వ నెంబరు జాతీయ రహదారిపై ఉంది. హైదరాబాదు నుంచి ఈ పట్టణం 110 కి.మీ. దూరంలో ఉత్తరం వైపు ఉంది.వ్యాపార పరంగా ఈ పట్టణం మంచి అభివృద్ధిలో ఉంది. చక్కెర, బెల్లం, వరి, పసుపు ఇక్కడి ప్రధాన ఉత్పత్తులు.

గ్రామ చరిత్ర[మార్చు]

సా. శ. 1600 నుండి 1640 మధ్య కాలంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన దోమకొండ కోట రాజు చిన్న కామిరెడ్డి పాలకుడుతో జిల్లాకు కామారెడ్డి అనే పేరు వచ్చింది. ఈ ప్రదేశం మునపటి పేరు కొడూరు. 1830లో కామారెడ్డి ప్రాంతాన్ని సందర్శించిన యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య ఆనాటి కామారెడ్డిని వర్ణించారు. భిక్నూరు మొదలుకొని కామారెడ్డి చేరేవరకూ రేగడినేల ఉండేదని, వర్షాకాలం కావడంతో అడుసులోకి ప్రయాణిస్తున్న తమ కాళ్ళు దిగబడి ప్రయాణం యాతన అయిందని రాసారు. ఆనాటికి గ్రామం వసతిగా ఉండేదని, అంగళ్ళు గ్రామంలో ఉండేవని రాసారు. గ్రామానికి మంచినీటి చెరువు వసతి కూడా ఉందని ప్రస్తావించారు. దీనిని కామారెడ్డి పెద్దచెరువు పిలుస్తారు.[4] హరిజన్వాడ ప్రాంతంలో కొడూరు హన్మండ్ల గుడి అనే ఆలయం ఉండేది. ఈ ఆలయం కామారెడ్డి చరిత్రలో పురాతనమైంది. ఈ ఆలయం కాకుండా మరో (3) ఆలయాలు కామారెడ్డికి రుజువులు, అంటే 1.కిష్టమ్మగుడి, 2. వేణుపాల స్వామి గుడి, 3. విఠేలేశ్వర అలయం. కాకతీయ రాజవంశంలో ఈ స్థలాన్ని కాకార్య గుండనా పాలించింది, దీనికి రుజువు మాచారెడ్డి మండల బండ రామేశ్వర్ పల్లి గ్రామంలోని శ్రీ రాజా రాజేశ్వర స్వామి ఆలయంలో లభిస్తుంది.

జిల్లా విభజన[మార్చు]

ఈ జిల్లా నిజామాబాద్ జిల్లా నుండి విభజించబడి, 11-10-2016 అక్టోబరు 11 నుండి (3) కామారెడ్డి, బాన్స్వాడ, యెల్లారెడ్డి అనే 3 రెవెన్యూ డివిజన్లుతో, 22 మండలాలు, కామారెడ్డి మునిసిపాలిటీతో కామారెడ్డి జిల్లాగా ఏర్పడింది. రాజంపేట, బీబీపేట, రామారెడ్డి, పెద్దకోడపగల్, నస్రుల్లాబాద్‌, రాజంపేట మండలాలు ప్రస్తుత (17) మండలాలతో పాటు కొత్త మండలాలుగా ఏర్పడ్డాయి.

కామారెడ్డి జిల్లా ఉత్తరాన నిజామాబాద్ జిల్లా, తూర్పున రాజన్న సిరిసిల్లా జిల్లా, సిద్దిపేట జిల్లా, దక్షిణాన మెదక్ జిల్లా పశ్చిమాన మహారాష్ట్ర రాష్ట్రంలోని నాందేడ్ జిల్లా, కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లా ఉన్నాయి.

ఈ జిల్లా భౌగోళిక ప్రాంతం 3,652 చ. కి.మీ.. జిల్లా 18 - 19'- 07 - 78 -20'-37 అక్షాంశం రేఖాంశాల మధ్య ఉంది.

రవాణా[మార్చు]

రైలు రవాణా[మార్చు]

కామారెడ్డి దక్షిణ మధ్య రైల్వే మండలపు, హైదరాబాద్ విభాగపు, కాచిగూడ-మన్మాడ్ మార్గంలో ఉంది. దీని స్టేషన్ కోడ్: KMC

దర్శనీయ ప్రదేశాలు[మార్చు]

కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపెట మండలంలోని చినూర్ గ్రామంలో సంతాన వేణుగోపాల్ స్వామి ఆలయం ఉంది.700 సంవత్సరాల క్రితం నిజాం రాజుల పాలనలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజు గారి కలలో, దేవుడి రూపంలో ఉన్న ఒక వ్యక్తి గ్రామం చివరలో ఉన్న కొలనులో వేణుగోపాల్ స్వామి విగ్రహం రూపంలో కనిపించి చెప్పాడు.అతను దానిని కనుగొని ఆలయాన్ని నిర్మించటానికి, మరుసటి రోజు రాజు తన సైన్యంతో కొలను సందర్శించి అక్కడ శోధించమని ఆదేశించాడు. చాలా ప్రయత్నం తరువాత వారు తమ రుక్మిణి, సత్యభామలతో ఒక అందమైన రెండున్నర అడుగుల వేణు గోపాల స్వామి విగ్రహాన్ని కనుగొన్నారు. స్థానిక పురాణాల ప్రకారం, స్వామి విగ్రహాలతో పాటు శ్రీ సుదర్శన్ పెరుమాల్, శ్రీమన్నారాయణ విగ్రహాలు కనుగొనబడ్డాయి. రాజు అద్భుతమైన ఆలయాన్ని నిర్మించి, స్వామి విగ్రహాలను, నమ్మల్వార్, భగవద్ రామానుజ విగ్రహాలతో పాటు నిర్మించాడు. ఆగమ శాస్త్రాల ప్రకారం, స్వామి ఆరాధన, ప్రత్యేక పండుగలలో కార్యకలాపాలు చాలా అందంగా కళ్ళ పండుగగా ఉంటాయి.ఈ ఆలయంలో ఎవరైతే స్వామిని ఆరాధిస్తారో వారికి మంచి సంతానం ఇస్తుందని భక్తులు నమ్ముతారు.స్వామి వివాహ వేడుకలో పాల్గొనే వారి కోరికలు నెరవేరుతాయని భక్తులు భావిస్తుంటారు.

మూలాలు[మార్చు]

  1. "Urban Local Body Information" (PDF). Directorate of Town and Country Planning. Government of Telangana. Archived from the original (PDF) on 15 June 2016. Retrieved 28 June 2016.
  2. "Basic Information". Kamareddy municipality.
  3. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-10-22. Retrieved 2018-08-09.
  4. వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014.

వెలుపలి లంకెలు[మార్చు]