తెలంగాణ జిల్లాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలున్నాయి.

చరిత్ర[మార్చు]

భారత స్వాతంత్ర్యం తరువాత 1948లో భారతదేశంలోని డొమినియన్‌లో చేర్చబడినప్పుడు హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ వంటి 8 జిల్లాలు ఉన్నాయి.[1] 1953, అక్టోబరు 1న వరంగల్ జిల్లా నుండి ఖమ్మం జిల్లా ఏర్పాటుచేయబడింది.[2] 1956, నవంబరు 1న హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతాన్ని, ఆంధ్ర రాష్ట్రాన్ని విలీనం చేయడం ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. మెరుగైన పరిపాలన కోసం భద్రాచలం డివిజన్, అశ్వారావుపేట తాలూకా భాగాలను గోదావరి జిల్లాల నుండి ఖమ్మం జిల్లాలో కలుపబడ్డాయి.[2] 1978, ఆగస్టు 15న హైదరాబాద్ జిల్లాను హైదరాబాద్ అర్బన్ జిల్లా, హైదరాబాద్ రూరల్ జిల్లాగా విభజించారు. హైదరాబాద్ అర్బన్ జిల్లాను చార్మినార్, గోల్కొండ, ముషీరాబాద్, సికింద్రాబాద్ తాలూకాలు అనే 4 తాలూకాలుగా ఉన్నాయి. వీటిలో ఎంసిహెచ్ ప్రాంతం, సికింద్రాబాద్ కంటోన్మెంట్, ఉస్మానియా విశ్వవిద్యాలయం మాత్రమే ఉన్నాయి. తర్వాత హైదరాబాద్ రూరల్ జిల్లాను రంగారెడ్డి జిల్లాగా మార్చారు.[3]

ఆంధ్రప్రదేశ్ నుండి 10 జిల్లాలతో తెలంగాణ ఏర్పడింది. భద్రాచలం డివిజన్‌లోని ఏడు మండలాలను తిరిగి తూర్పుగోదావరి జిల్లాకు ఇచ్చారు.[4][5] 2016, అక్టోబరు 11న 21 కొత్త జిల్లాలు సృష్టించబడ్డాయి. దాంతో తెలంగాణలో జిల్లాల సంఖ్య 31కి పెరిగింది. హైదరాబాద్ జిల్లా మినహా అన్ని జిల్లాలు కనిష్టంగా 2 నుండి గరిష్టంగా 5 జిల్లాలుగా విభజించబడ్డాయి.[6] 2019, ఫిబ్రవరి 17న 9 మండలాలతో ములుగు, 11 మండలాలతో నారాయణపేట కొత్త జిల్లాలుగా ఏర్పడ్డాయి. అప్పుడు మొత్తం జిల్లాల సంఖ్య 33కి చేరుకుంది.[7]

2016లో వరంగల్ జిల్లాను వరంగల్ పట్టణ జిల్లాగా, వరంగల్ గ్రామీణ జిల్లాగా విభజించారు. ఆ తరువాత 2021 ఆగస్టు 12న వరంగల్ రూరల్ జిల్లా పేరును వరంగల్ జిల్లాగా, వరంగల్‌ అర్బన్‌ జిల్లాను హన్మకొండ జిల్లాగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[8][9][10]

గణాంకాలు[మార్చు]

Location of Telangana in India

భద్రాద్రి జిల్లా 8,062 కి.మీ2 (3,113 చ. మై.) వైశాల్యంతో అతిపెద్ద జిల్లా కాగా, 2,019 కి.మీ2 (780 చ. మై.) వైశాల్యం కలిగిన రాజన్నసిరిసిల్ల అతి చిన్న జిల్లా. హైదరాబాద్, 35,269,257 మందితో అత్యధిక జనాభా కలిగి ఉన్న జిల్లా.[11]

తెలంగాణ జిల్లాల పటం[మార్చు]

తెలంగాణ జిల్లాలు (రంగు పూయబడిన)

జాబితా[మార్చు]

వ.సంఖ్య జిల్లా జిల్లా ప్రధాన

కార్యాలయం

రెవెన్యూ

డివిజన్లు సంఖ్య

మండలాలు సంఖ్య మొత్తం రెవెన్యూ గ్రామాలు అందులో నిర్జన గ్రామాలు నిర్జన గ్రామాలు పోగా మిగిలిన రెవెన్యూ గ్రామాలు సంఖ్య జనాభా (2011) వైశాల్యం (చ.కి) జిల్లా పటాలు
1 ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ 2 18 505 31 474 7,08,952 4,185.97 Adilabad District Revenue divisions map.png
2 కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ 2 15 419 17 402 5,15,835 4,300.16 Komaram Bheem District Revenue divisions.png
3 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం 2 23 377 32 345 13,04,811 8,951.00 Bhadradri District Revenue divisions map.png
4 జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి 1 11 223 23 200 7,12,257 6,361.70 Jayashankar District Revenue divisions.png
5 జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల్ 1 12 196 0 196 6,64,971 2,928.00 Jogulamba District Revenue division.png
6 హైదరాబాద్ జిల్లా హైదరాబాద్ 2 16 34,41,992 4,325.29
7 జగిత్యాల జిల్లా జగిత్యాల 3 18 286 4 282 9,83,414 3,043.23 Jagityal District Revenue divisions.png
8 జనగామ జిల్లా జనగామ 2 12 176 1 175 5,82,457 2,187.50 Jangaon District Revenue divisions.png
9 కామారెడ్డి జిల్లా కామారెడ్డి 3 22 473 32 441 9,72,625 3,651.00 Kamareddy District Revenue divisions.png
10 కరీంనగర్ జిల్లా కరీంనగర్ 2 16 210 5 205 10,16,063 2,379.07 Karimnagar District Revenue divisions.png
11 ఖమ్మం జిల్లా ఖమ్మం 2 21 380 10 370 14,01,639 4,453.00 Khammam District Revenue divisions.png
12 మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ 2 16 287 15 272 7,70,170 2,876.70 Mahbubabad District Revenue divisions.png
13 మహబూబ్ నగర్ జిల్లా మహబూబ్ నగర్ 1 16 310 2 308 13,18,110 4,037.00 Mahbubnagar District Revenue divisions.png
14 మంచిర్యాల జిల్లా మంచిర్యాల 2 18 362 18 344 807,037 4,056.36 Mancherial District Revenue divisions.png
15 మెదక్ జిల్లా మెదక్ 3 21 381 8 373 767,428 2,740.89 Medak District Revenue divisions.png
16 మేడ్చెల్ మల్కాజ్‌గిరి జిల్లా మేడ్చల్ 2 15 163 7 156 2,542,203 5,005.98 Malkajgiri District Revenue divisions.png
17 నల్గొండ జిల్లా నల్గొండ 3 31 566 15 551 1,631,399 2,449.79 Nalgonda District Revenue divisions.png
18 నాగర్ కర్నూల్ జిల్లా నాగర్ కర్నూల్ 4 20 349 9 340 893,308 6,545.00 Nagarkurnool District Revenue divisions.png
19 నిర్మల జిల్లా నిర్మల 2 19 429 32 397 709,415 3,562.51 Nirmal District Revenue divisions.png
20 నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ 3 29 450 33 417 1,534,428 4,153.00 Nizamabad District Revenue divisions.png
21 రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి 5 27 604 32 572 2,551,731 1,038.00 Rangareddy District Revenue divisions.png
22 పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి 2 14 215 8 207 795,332 4,614.74 Peddapalli District Revenue divisions.png
23 సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి 4 27 600 16 584 1,527,628 4,464.87 Sangareddy District Revenue divisions.png
24 సిద్దిపేట జిల్లా సిద్దిపేట 3 24 381 6 375 993,376 3,425.19 Siddipet District Revenue divisions.png
25 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల 2 13 171 4 167 546,121 2,030.89 Sircilla District Revenue division.png
26 సూర్యాపేట జిల్లా సూర్యాపేట 2 23 279 9 270 1,099,560 1,415.68 Suryapet District Revenue divisions.png
27 వికారాబాదు జిల్లా వికారాబాద్ 2 19 503 19 484 881,250 3,385.00 Vikarabad District Revenue divisions.png
28 వనపర్తి జిల్లా వనపర్తి 1 14 216 1 215 751,553 2,938.00 Wanaparthy District Revenue division.png
29 హన్మకొండ జిల్లా వరంగల్ 2 14 163 1,135,707 1,304.50 Warangal (urban) Revenue division.png
30 వరంగల్ జిల్లా వరంగల్ 2 13 192 716,457 2,175.50 Warangal (rural) District Revenue divisions.png
31 యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి 2 17 321 3 318 726,465 3,091.48 Yadadri District Revenue divisions.png
32 ములుగు జిల్లా [12] ములుగు 1 9 336 109 277 2,94,000
33 నారాయణపేట జిల్లా[12] నారాయణపేట 1 11 252 2 250 5,04,000
మొత్తం 73 594 35,003,694 112,077.00

మూలం: తెలంగాణ జిల్లాలు [13]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Yazdani, Ghulam (1937). "Hyderabad State". Atlantic Publishers & Distri – via Google Books.
  2. 2.0 2.1 "Know Your Corporation".
  3. Law, Gwillim (2011-09-25). "Districts of India". Statoids. Retrieved 2021-10-31.
  4. "The Andhra Pradesh Reorganisation (Amendment) Bill, 2014" Accessed 13 July 2014
  5. "Protests against Centre, Andhra Pradesh in Khammam over Polavaram Bill". Deccan Chronicle, 12 July 2014. Accessed 2021-10-31.
  6. "New districts". Andhra Jyothy.com. 8 October 2016. Archived from the original on 2018-12-25. Retrieved 2021-10-31.
  7. "Telangana gets two new districts: Narayanpet and Mulugu". The New Indian Express. Archived from the original on 2021-11-04. Retrieved 2021-10-31.
  8. Namasthe Telangana (12 July 2021). "అర్బన్‌.. హన్మకొండ రూరల్‌.. వరంగల్‌". Namasthe Telangana. Archived from the original on 13 July 2021. Retrieved 2021-10-31.
  9. "Hanamkonda Reorganization: State Government issues final notice". Deccan News. 2021-08-12. Archived from the original on 2021-10-31. Retrieved 2021-10-31.
  10. "Hanamkonda, Warangal in Telangana to be new districts now- The New Indian Express". web.archive.org. 2021-10-27. Archived from the original on 2021-10-27. Retrieved 2021-10-31.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  11. "Telangana gets 31 districts to spruce up adminstration". Deccan Chronicle. 11 October 2016. Retrieved 11 October 2016.
  12. 12.0 12.1 "మరో 2 కొత్త జిల్లాలు". ఈనాడు. Archived from the original on 17 ఫిబ్రవరి 2019. Retrieved 17 ఫిబ్రవరి 2019.
  13. "New districts". Andhra Jyothy.com. 8 October 2016. Archived from the original on 25 డిసెంబరు 2018. Retrieved 8 October 2016.

వెలుపలి లంకెలు[మార్చు]