సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు అనేది సికింద్రాబాద్ సైనికనివాస ప్రాంతానికి చెందిన పౌర పరిపాలనా సంస్థ.[1]ఇది భౌగోళికంగా హైదరాబాద్ - సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలో ఉంది. భారతదేశంలో మొదటి అతిపెద్ద బతిండా సైనిక నివాసప్రాంత మండలి తరువాత సికింద్రాబాద్ సైనికనివాస ప్రాంతమండలి రెండవ అతిపెద్దదిగా గుర్తించబడింది. [2] [3].[4] సికింద్రాబాద్ సైనికనివాస ప్రాంతమండలి పరిధిలో నాలుగు లక్షల జనాభాతో, ఎనిమిది పౌర వార్డులును కలిగిఉంది.[5] ప్రధానంగా సైనిక ప్రాంతం కావడంతో, సికింద్రాబాద్ సైనికనివాస ప్రాంతమండలి భారత ప్రభుత్వ కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చింది. ఇది 40.1 కి.మీ2 (15.5 చ. మై.) విస్తీర్ణంపై పరిపాలనను పర్యవేక్షిస్తోంది. [6] ఇక్కడ అనేక సైనిక శిబిరాలు ఉన్నాయి. [7] [8]
జనాభా
[మార్చు]2011 భారత జనాభా గణన ప్రకారం ఇది 2,17,910 మంది జనాభాతో,22.81చ.కి.మీ (8.81చ.మైళ్లు) విస్తీర్నంలో 50,333 కుటుంబాలు కలిగిన ఇండ్లను కలిగిఉంది.[9] సైనికశిబిర పౌర ప్రాంతాల మౌలిక సదుపాయాల నిర్వహణను సైనికశిబిర పౌర పరిపాలన మండలి చూసుకుంటుంది. 2006 సైనికశిబిర పౌర ప్రాంతాల చట్టం ప్రకారం, ఇది మొదటి తరగతి సైనికశిబిర పౌర ప్రాంతంగా వర్గీకరించబడింది.భారత సైన్యం తెలంగాణ, ఆంధ్ర ఉప ప్రాంతాల సేనాధిపతి (జిఓసి) లేదా ఉప జిఓసి అధ్యక్షతన సైనికశిబిర పౌర ప్రాంతాల మండలి పనిచేస్తుంది.కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ నియమించిన భారత సైనికదళాల ప్రాంత అధికారికి (సిఇఒ) మండలి కార్యనిర్వాహక అధికారాలును కలిగి ఉన్నాయి.మండలి సార్వత్రిక ఎన్నికలలో కంటోన్మెంట్ ప్రాంతంలో నివసిస్తున్న పౌర జనాభా ద్వారా సగం మంది సభ్యులు ఎన్నుకోబడతారు. మిగిలిన సగంమంది సభ్యులు హైదరాబాద్ జిల్లా కలెక్టరు, కంటోన్మెంట్ ప్రాంతం మండలి అధ్యక్షుడు, సిఇఒ, ఈ ముగ్గురు నియమించిన ఇతర సైనిక అధికారులు ఉంటారు. బోర్డులో సభ్యులు కాకపోయినప్పటికీ, కంటోన్మెంట్ చట్టం ప్రకారం స్థానిక ఎంపి, ఎమ్మెల్యేలను మండలి సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితులుగా పరిగణిస్తారు.
కంటోన్మెంట్ పరిధిలోని ప్రాంతాలు
[మార్చు]- తిరుమలగిరి
- మారేడ్‌పల్లి
- అమ్ముగూడ
- హకీంపేట
- జవహర్ నగర్
- కార్ఖాన
- బోయిన్పల్లి
- కౌకూర్
- బొల్లారం
చరిత్ర
[మార్చు]1800 ల ప్రారంభంలో బ్రిటిష్ రాజ్ కాలం నాటి మిలటరీ గణనీయమైన ఉనికిని సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతం తెలుపుతుంది. బ్రిటిష్ అధికారులు సాధించిన పురోగతిని గౌరవించటానికి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ వద్ద బ్రిటిష్ ప్రభుత్వం 1860 ఆ ప్రాంతంలో 10 ఎకరాల (4 హెక్టారులు) విస్తీర్నంలో క్లాక్ టవర్ నిర్మాణంనకు భూమివసతిని కల్పించింది. [10]
బ్రిటిష్ ప్రభుత్వం, హైదరాబాద్ నిజాం మధ్య 1948 లో భారత స్వాతంత్ర్యం పోలీసు చర్యకు ముందు, కుదిరిన ఒప్పందం ప్రకారం, కంటోన్మెంట్ బ్రిటిష్ వారి ఆధీనంలోకి వచ్చింది. ఇది తరువాత, భారీ సైనిక ఉనికి కారణంగా, ఈ ప్రాంతం భారత రక్షణ మంత్రిత్వ శాఖ నియంత్రణలోకి వచ్చింది. బ్రిటిష్ ప్రధాన మంత్రి సర్ విన్స్టన్ చర్చిల్, తన ప్రారంభ రోజులలో (1896) బ్రిటిష్ సైన్యంను రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో తిరుమలగిరి ప్రాంతంలోని సికింద్రాబాదు కంటోన్మెంట్ ప్రాంతంలో ఉంచాడు.
సౌకర్యాలు
[మార్చు]సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో తాగునీరు, మురుగునీటి పారుదల, రోడ్లు, చెత్త తొలగింపు, ప్రజారోగ్యంలాంటి పౌర సౌకర్యాలును, పురపాలకక పన్నులు మొదలైన వాటికి కంటోన్మెంట్ బోర్డు బాధ్యత వహిస్తుంది. ప్రధాన కార్యాలయాలు కంటోన్మెంట్ అంచుకు సమీపంలో ఉన్న బ్రిటిష్ కాలం నాటి భవనంలో ఉన్నాయి. ఈ సముదాయంలో కోర్టు, హైదరాబాద్ నగర పోలీసుల జోనల్ డిసిపి కార్యాలయం ఉన్నాయి. కంటోన్మెంట్ నివాసితులకు ప్రతి రెండు లేదా మూడు రోజులకు ఒకసారి ప్రాంతం ఆధారంగా నిర్ణీత వేళలలో త్రాగునీరు సరఫరా చేయబడుతుంది.మురుగునీటి పారుదల మార్గాలను కొత్తగా ఏర్పాటు చేయడం, పని రోజులో కార్మికులు అడ్డుపడే మ్యాన్‌హోల్స్‌ను క్లియర్ చేయడాన్ని నిర్వహించడంలాంటి పనులను సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు తరచుగా నిర్వహిస్తుంది. ఏదైనా భవన నిర్మాణ కార్యకలాపాలు ప్రారంభించడానికి ముందు, అన్ని గృహ ప్రణాళికలను కంటోన్మెంట్ ఆమోదించాలి. కంటోన్మెంట్ నివాసితుల గృహలకు చెల్లించవలసిన పన్నులు వార్షిక ప్రాతిపదికన చెల్లించటానికి మొత్తాలతో బిల్లులను పంపుతుంది.వాటి ఆధారంగా కంటోన్మెంట్ ప్రధాన కార్యాలయంలో పన్నులు వసూలు చేయబడతాయి.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ https://www.census2011.co.in/data/town/802919-secunderabad-andhra-pradesh.html
- ↑ "Secunderabad, 2nd largest cantt, has no fire service department".
- ↑ "'Strict' Secunderabad Cantonment Board keeps coronavirus at bay".
- ↑ "Clean-up time: Secunderabad Cantonment Board hits bottom in Swachh League 2020 ranking".
- ↑ "Secunderabad Cantonment Board met just twice this year to discuss people issues".
- ↑ "Exploring urban growth management in three developing country cities" (PDF). World Bank. 15 June 2008. Archived (PDF) from the original on 5 June 2013. Retrieved 6 December 2012.
- ↑ "Survey of child labour in slums of Hyderabad: final report" (PDF). Center for Good Governance, Hyderabad. 17 December 2008. Archived from the original (PDF) on 29 June 2012. Retrieved 16 May 2012.
- ↑ "Information hand book under right to information act Secunderabad cantonment board" (PDF). Secunderabad Cantonment Board. p. 6. Archived from the original (PDF) on 10 November 2013. Retrieved 31 July 2013.
- ↑ "District Census Handbook – Guntur" (PDF). Census of India. The Registrar General & Census Commissioner. p. 28. Retrieved 12 June 2017.
- ↑ "Time stands still at Clock Tower". The Hindu. 13 February 2007. Archived from the original on 19 ఫిబ్రవరి 2007. Retrieved 7 November 2010.
వెలుపలి లంకెలు
[మార్చు]- సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు వెబ్సైట్ Archived 2016-03-29 at the Wayback Machine
- కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు - ది హిందూ Archived 2004-06-20 at the Wayback Machine
- చట్టవిరుద్ధ నిర్మాణాలు: కూల్చివేత డ్రైవ్ - ది హిందూ Archived 2011-07-02 at the Wayback Machine