Jump to content

మారేడుపల్లి మండలం (హైదరాబాదు జిల్లా)

అక్షాంశ రేఖాంశాలు: 17°26′52.03″N 78°30′31.44″E / 17.4477861°N 78.5087333°E / 17.4477861; 78.5087333
వికీపీడియా నుండి
మారేడుపల్లి
మారేడుపల్లి is located in Telangana
మారేడుపల్లి
మారేడుపల్లి
తెలంగాణలో ప్రాంతం ఉనికి
Coordinates: 17°26′52.03″N 78°30′31.44″E / 17.4477861°N 78.5087333°E / 17.4477861; 78.5087333
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాద్
మెట్రోహైదరాబాద్
Government
 • Bodyహైదరాబాద్ మహానగర పాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (IST)
పిన్ కోడ్
500026
Vehicle registrationటి.ఎస్
లోక్‌సభ నియోజకవర్గంసికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంసికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం
నగర ప్రణాళిక సంస్థహైదరాబాద్ మహానగర పాలక సంస్థ
2015, సెప్టెంబరు 20న హైదరాబాదులోని శిల్పకళా వేదికలో జరిగిన కేరళ భవన్ శంకుస్థాపన కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ తదితరులతో జ్యోతి ప్రకాశనం. మారేడుపల్లి మండలంలోని మహేంద్రహిల్స్‌లో ఎకరం భూమి కేటాయించి, దాని నిర్మాణానికి కోటి రూపాయల నిధులు ఇస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించాడు.

మారేడుపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, హైదరాబాదు జిల్లాకు చెందిన మండలం.[1] సికింద్రాబాదుకి సమీపంలో ఉన్న ఈ ప్రాంతం ఈస్ట్ మారేడుపల్లి, వెస్ట్ మారేడుపల్లిగా విభజించబడివుంది.[2][3] ఈ మండలంలో 3 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఇది సికింద్రాబాదు రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది. ఈ మండలం మొత్తం ప్రాంతం హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలోకి వస్తుంది.[4] 2011 భారత జనగణన ప్రకారం, మారేడ్‌పల్లి మండల విస్తీర్ణం 12.45 చ.కి.మీ., జనాభా 1,72,542.

రవాణా వ్యవస్థ

[మార్చు]

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన వాహనాలు హైదరాబాదు నగరంలోని అనేక ప్రాంతాలకు మారేడుపల్లిని కలుపుతున్నాయి. నగరంలో ప్రయాణించటానికి అందుబాటులో ఎం.ఎం.టి.యస్. రైలు స్టేషన్, సికింద్రాబాద్, దూర ప్రాంతాలకు ప్రయాణించటానికి సమీప రైల్వే స్టేషన్ సికింద్రాబాదులో ఉన్నాయి. దీనికి సమీపంలో పరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషను ఉంది. ఇది సికిందరాబాద్, హైదరాబాద్ జంట నగరాలను కలుపుతుంది.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

[మార్చు]

ఇతర వివరాలు

[మార్చు]

ఈ ప్రాంతంలో 43,837 మంది ఓటర్లు ఉన్నారు.[5]

డబల్ బెడ్రూమ్ ఇళ్ళు

[మార్చు]

పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ పథకంలో భాగంగా వెస్ట్‌ మారేడ్‌పల్లిలో 5.8 ఎకరాల విస్తీర్ణంలో రూ.36. 27 కోట్ల వ్యయంతో నిర్మించిన 468 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ళను 2022, మార్చి 3వ తేదీన తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర హోంమంత్రి మహ్మద్ మహమూద్ అలీ, ఐటీ-మున్సిపల్‌ శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు, పశుసంవర్థక-మత్స్య‌-పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌, కార్మిక శాఖామంత్రి సిహెచ్ మల్లారెడ్డి కలిసి ప్రారంభించారు.[6] 468 ఇండ్ల నిర్మాణం కోసం 37.76 కోట్లను ఖర్చు చేయగా, రూ. 3.51 కోట్ల వ్యయంతో రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్‌ సౌకర్యాలు కల్పిండంతో పాటు, మంచినీటి సౌకర్యం కోసం 50 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన నాలుగు సంపులను నిర్మించారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, హైదరాబాదు నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతరెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[7]

ప్రముఖులు

[మార్చు]
  1. గీతారెడ్డి, మాజీ రాష్ట్రమంత్రి[8]
  2. సర్వే సత్యనారాయణ, మాజీ రాష్ట్రమంత్రి
  3. ఎన్. కుమరప్ప, హైకోర్టు చీఫ్ జస్టిస్
  4. ముదిగొండ మార్కండేయ, విశ్రాంత జిల్లా జడ్జి

మూలాలు

[మార్చు]
  1. "Mandals & Villages list of Hyderabad District". Archived from the original on 2019-01-10. Retrieved 2019-01-15.
  2. West Marredpally road that cost Rs 32 lakh dug up again
  3. "Safilguda-East Marredpally Road Proposal Awaits CM's Approval". Archived from the original on 2016-04-26. Retrieved 2018-10-09.
  4. "Reorganised list of District,Mandal,Villages of GHMC". Archived from the original on 2019-02-24. Retrieved 2019-01-15.
  5. "Archived copy". Archived from the original on 21 జూలై 2011. Retrieved 14 ఆగస్టు 2020.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  6. telugu, NT News (2022-03-03). "మీ అంద‌ర్నీ కేసీఆర్ కోటీశ్వ‌ర్ల‌ను చేశారు : మంత్రి కేటీఆర్". Namasthe Telangana. Archived from the original on 2022-03-03. Retrieved 2022-03-03.
  7. telugu, NT News (2022-03-02). "ఓల్డ్‌ మారేడ్‌పల్లిలో 468 డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు సిద్ధం". Namasthe Telangana. Archived from the original on 2022-03-03. Retrieved 2022-03-03.
  8. "AP Government Portal - Official Andhra Pradesh State Govt. Portal". Archived from the original on 6 అక్టోబరు 2011. Retrieved 14 ఆగస్టు 2020.

వెలుపలి లంకెలు

[మార్చు]