ఆసిఫ్‌నగర్ మండలం (హైదరాబాదు జిల్లా)
Jump to navigation
Jump to search
ఆసిఫ్‌నగర్ మండలం, తెలంగాణ రాష్ట్రం హైదరాబాదు జిల్లాకు చెందిన మండలం.[1][2]
ఆసిఫ్‌నగర్ | |
---|---|
మండలం | |
నిర్దేశాంకాలు: 17°23′22″N 78°27′10″E / 17.3894°N 78.4527°E | |
దేశం | ![]() |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాద్ |
మెట్రో | హైదరాబాద్ |
ప్రభుత్వం | |
• నిర్వహణ | హైదరాబాద్ మహానగర పాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
కాలమానం | UTC+5:30 (IST) |
పిన్‌కోడ్ | 500028 |
భారత వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లు | టిఎస్ 11 |
లోకసభ నియోజకవర్గం | సికింద్రాబాదు లోకసభ నియోజకవర్గం |
ఇది పాతబస్తీలో భాగం. ఈ మండలం మొత్తం ప్రాంతం హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలోకి వస్తుంది. [3].ఇది హైదరాబాదు రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది. 2011 భారత జనగణన ప్రకారం, ఆసిఫ్‌నగర్ మండల విస్తీర్ణం 13.19 చ.కి.మీ., జనాభా 442229.
చరిత్ర[మార్చు]
1724లో మొఘలుల నుండి నిజాం గోల్కొండను స్వాధీనం చేసుకున్న తరువాత, నిజాం ఒక గ్రామంలోని కోట సమీపంలో నివసించాడు. తరువాత అది ఆసిఫ్‌నగర్ పేరుగా మార్చబడింది.
ప్రసిద్ధి[మార్చు]
ఆసిఫ్‌నగర్ ఫర్నీచర్ శిల్పాలకు ప్రసిద్దిగాంచింది. ఈ ప్రాంతంలో తయారుచేసిన ఫర్నీచర్ ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేయబడుతుంది.
రవాణా వ్యవస్థ[మార్చు]
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆసిఫ్‌నగర్ నుండి నగరంలోని వివిధ ప్రాంతాలకు బస్సులను నడుపుతుంది. ఇక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలో నాంపల్లి రైల్వే స్టేషను ఉంది.
మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]
పరిసరప్రాంతాలు[మార్చు]
- ఆఘాపురా
- బజార్ ఘాట్
- ధూల్‌పేట్
- గోషామహల్
- హుమయూన్ నగర్
- జియాగూడ
- కార్వాన్
- మంగళ్ హాట్
- మెహిదీపట్నం
- మాసాబ్ ట్యాంక్
- మురద్ నగర్
- నాంపల్లి
- సీతారాం బాగ్
- తాళ్ళగడ్డ
- విజయనగర్ కాలనీ[4]
- శాంతినగర్
మూలాలు[మార్చు]
- ↑ "Mandals & Villages list of Hyderabad District". Archived from the original on 2019-01-10. Retrieved 2019-01-18.
- ↑ "హైదరాబాద్ జిల్లాలోని మండలాలు.రెవెన్యూ డివిజన్లు".
- ↑ "Reorganised list of District,Mandal,Villages of GHMC". Archived from the original on 2019-02-24. Retrieved 2019-01-18.
- ↑ ఆంధ్రభూమి, హైదరాబాదు (28 August 2018). "సాయంత్రం 5గంటల వరకు 'కంటివెలుగు'". Archived from the original on 29 September 2018. Retrieved 29 September 2018.