అక్షాంశ రేఖాంశాలు: 17°26′N 78°32′E / 17.433°N 78.533°E / 17.433; 78.533

లాలాగూడ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లాలాగూడ
సమీపప్రాంతం
లాలాగూడ is located in Telangana
లాలాగూడ
లాలాగూడ
భారతదేశంలోని తెలంగాణలో ప్రాంతం ఉనికి
Coordinates: 17°26′N 78°32′E / 17.433°N 78.533°E / 17.433; 78.533
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
మండలంమారేడుపల్లి మండలం
జిల్లాహైదరాబాదు
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
Government
 • Bodyహైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
500 017
లోక్‌సభ నియోజకవర్గంసికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంసికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ

లాలాగూడ, తెలంగాణలోని సికింద్రాబాదు శివారు ప్రాంతం.[1] హైదరాబాదు నగరం మధ్యలోనుండి మల్కాజ్ గిరికి వెళ్ళే మార్గంలో 7 కి.మీ.ల దూరంలో ఆ ప్రాంతం ఉంది.

మౌలిక సదుపాయాలు

[మార్చు]

లాలాగూడలోని ఇళ్ళలో రైల్వే ఉద్యోగులకోసం రైల్వేశాఖ నిర్మించిన ఇళ్ళే ఎక్కువగా ఉన్నాయి. యొక్క పెద్ద భాగాలు. రైల్వే ఉద్యోగుల కోసం ఇక్కడ పెద్ద ఆసుపత్రిని కూడా ఉంది. దేశంలోని అతిపెద్ద రైల్వే రిపేరు,[2] సేవా కేంద్రాలలో ఇదీ ఒకటి. రైల్వే ఉద్యోగుల శిక్షణ కోసం ఇక్కడ అనేక క్యాంపస్‌లు ఉన్నాయి.

భారత రైల్వే చేత నిర్వహించబడుతున్న రైల్వే సౌకర్యాలకు ఈ ప్రాంతం పేరొందింది. ఈ ప్రాంతం మీదుగా అనేక బ్రాడ్ గేజ్ రైలు మార్గాలు వెళుతున్నాయి. ఈ రైలు మార్గాలు ఉత్తర, దక్షిణ లాలాగూడగా విభజిస్తున్నాయి.

సమీప ప్రాంతాలు

[మార్చు]

వెంకటేశ్వర నగర్, జ్యోతి నగర్, సుభాష్ నగర్, తుకారామ్‌గేట్, ప్రియా కాలనీ ఫేజ్ 1, లాలాగుడ సౌత్, లాలాగూడ రైల్వే కాలనీ, న్యూ మెట్టుగూడ ఇక్కడికి సమీపంలో ఉన్నాయి.[3]

రవాణా

[మార్చు]

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో లాలాగూడ నుండి నగరంలోని ఇతర ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడ లాలగూడ రైల్వే స్టేషను ఉంది. సికింద్రాబాదు నుంచి ఫలక్ నుమా మార్గంలోని ఉన్న సీతాఫల్‌మండి ప్రాంతంలో ఎం.ఎం.టి.ఎస్. రైలు స్టేషను ఉంది.[3]

అండర్‌పాస్‌ రోడ్డు

[మార్చు]

లాలాగూడ రైల్వే స్టేషన్‌ వద్ద రూ. 72 కోట్ల వ్యయంతో నిర్మించిన తుకారాంగేట్ ఆర్‌యూబీ అండర్‌పాస్‌ రోడ్డును 2022 మార్చి 4న తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి మ‌హ‌ముద్ అలీ, డిప్యూటీ స్పీక‌ర్ టి. ప‌ద్మారావు గౌడ్, ఐటీ-పురపాలక శాఖామంత్రి కేటీఆర్, పశుసంవర్థక-మత్స్య‌-పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ తదితరులు క‌లిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాదు నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతరెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[4][5][6]

ఇతర వివరాలు

[మార్చు]

భారతీయ రైల్వేలో వర్క్‌షాప్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (వైజ్) సౌకర్యాన్ని అమలు చేసిన మొదటి వర్క్‌షాప్ ఇది.[7]

మూలాలు

[మార్చు]
  1. Lallaguda Police Station Archived 22 మార్చి 2014 at the Wayback Machine
  2. "South Central Railway". scr.indianrailways.gov.in. Retrieved 2021-01-18.
  3. 3.0 3.1 "Lalaguda, Mettuguda, Secunderabad Locality". www.onefivenine.com. Retrieved 2021-01-18.
  4. Namasthe Telangana (4 March 2022). "అవ‌స‌ర‌మైన చోట ఆర్‌యూబీలు, ఆర్వోబీలు నిర్మిస్తాం : మంత్రి కేటీఆర్". Namasthe Telangana. Archived from the original on 5 March 2022. Retrieved 5 March 2022.
  5. Velugu, V6 (2022-03-04). "దశాబ్దాలుగా పెండింగ్‎లో ఉన్న పనులను కూడా పూర్తి చేస్తున్నం". V6 Velugu (in ఇంగ్లీష్). Archived from the original on 2022-03-05. Retrieved 2022-03-05.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  6. "Tukaram Gate RUB launched". The Hindu (in Indian English). Special Correspondent. 2022-03-05. ISSN 0971-751X. Archived from the original on 2022-03-05. Retrieved 2022-03-05.{{cite news}}: CS1 maint: others (link)
  7. Krishnamoorthy, Suresh (2016-02-22). "Lallaguda Carriage Workshop - a unique unit of Railways". The Hindu. ISSN 0971-751X. Retrieved 2021-01-18.
"https://te.wikipedia.org/w/index.php?title=లాలాగూడ&oldid=4149850" నుండి వెలికితీశారు