తుకారాంగేట్ ఆర్‌యూబీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తుకారాంగేట్ ఆర్‌యూబీ
Tukaramgate RUB 3.jpg
తుకారాంగేట్‌ రోడ్ అండ‌ర్ బ్రిడ్జి
Route information
Existed4 మార్చి 2022 నుండి–present
Location
Statesతెలంగాణ

తుకారాంగేట్‌ రోడ్ అండ‌ర్ బ్రిడ్జి(ఆర్‌యూబీ) సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలోని లాలాగూడ రైల్వే స్టేషన్‌ వద్ద రూ. 29 కోట్లతో తుకారాంగేట్‌లో రైల్వే శాఖ ద్వారా రూ.13.95 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం నుండి రూ.15.15 కోట్ల వ్యయంతో నిర్మించిన అండర్‌పాస్‌ రోడ్డు.[1]

నిర్మాణ వివరాలు[మార్చు]

తుకారాంగేట్ రోడ్డు అండర్‌ బ్రిడ్జి (ఆర్‌యూబీ) నిర్మాణం మొత్తం నాలుగు లేన్లతో 375 మీటర్ల పొడవు, 40 మీటర్ల బాక్స్‌ డ్రైనేజీ, 245 మీటర్ల అప్రోచ్‌ రోడ్డు అందులో 86 మీటర్ల ర్యాంపు రోడ్డు, మెట్టుగూడ వైపు మరో 159 మీటర్ల ర్యాంపు మారేడుపల్లి వైపు నిర్మాణం చేపట్టారు. 5.50 మీటర్ల వెడల్పు గల అప్రోచ్‌ రోడ్డు క్యారేజ్‌ మార్గం 150 వెడల్పు బాక్స్‌ పోర్షన్‌, మరో 150 మీటర్ల వెడల్పు అప్రోచ్‌ రోడ్డు ఏర్పాటు చేశారు.

రోడ్డు అండర్‌ బ్రిడ్జి (ఆర్‌యూబీ) మొత్తం రూ.72కోట్ల వ్యయంతో నిర్మించారు. ప్రాజెక్ట్‌ నిర్మాణానికి రూ.33కోట్లు, వంతెన నిర్మాణంతో నష్టపోయిన బాధితులకు రూ.39కోట్ల పరిహారం చెల్లించారు. ఆర్‌యూబీ అందుబాటులోకి రావడంతో సికింద్రాబాద్‌లోని తుకారాంగేట్‌ చౌరస్తా నుంచి మరాఠబస్తీ, శాస్త్రీనగర్‌, అడ్డగుట్ట ఏబీసీడీ సెక్షన్లు, కమ్యూనిటీ హాలు, సమోసా గార్డెన్‌ కంటోన్మెంట్‌ ప్రాంతాలకు సాఫీగా ప్రయాణం సాగనుంది.

ఈ అండర్‌ బ్రిడ్జితో తుకారాంగేట్ పరిసర ప్రాంతాలైన మల్కాజ్‌గిరి, మారేడ్‌పల్లి, మెట్టుగూడ, లాలాపేట్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ రద్దీ తగ్గుతుంది, దీనితోపాటు మౌలాలీ, మల్కాజ్‌గిరి, తార్నాక, సికింద్రాబాద్‌ వైపు వెళ్లేందుకు రోడ్డు కనెక్టివిటీ సౌకర్యం ఉంది.[2]

ప్రారంభం[మార్చు]

తుకారాంగేట్ ఆర్‌యూబీను రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు, స్థానిక శాసనసభ్యుడు & అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ టి. పద్మారావు గౌడ్ తో కలిసి 4 మార్చి 2022న ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ మోతె శ్రీలతశోభన్‌రెడ్డి, మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, స్థానిక కార్పొరేటర్లు సామల హేమ, కంది శైలజ, రాసూరి సునిత, ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌, జోనల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ రెడ్డి, జాయింట్‌ కమిషనర్‌ పల్లె మోహన్‌రెడ్డి, డీసీ దశరథ్‌, టిఆర్ఎస్ నాయకులు కిశోర్‌కుమార్‌, కిరణ్‌కుమార్‌ గౌడ్‌, రామేశ్వర్‌గౌడ్‌, జలంధర్‌రెడ్డి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.[3]

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Namasthe Telangana (3 March 2022). "సాఫీగా సాగిపో". Archived from the original on 5 March 2022. Retrieved 5 March 2022.
  2. Sakshi (14 March 2022). "హైదరాబాద్‌: ఫలించిన యాభై ఏళ్ల కల!". Archived from the original on 15 March 2022. Retrieved 15 March 2022.
  3. Namasthe Telangana (4 March 2022). "అవ‌స‌ర‌మైన చోట ఆర్‌యూబీలు, ఆర్వోబీలు నిర్మిస్తాం : మంత్రి కేటీఆర్". Namasthe Telangana. Archived from the original on 5 March 2022. Retrieved 4 March 2022.