మెహబూబ్ కి మెహందీ (హైదరాబాదు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మెహబూబ్ కి మెహందీ, తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని ఒక ప్రాంతం.[1] హైదరాబాద్ రాజ్యంలో నిజాం రాజుల పాలనలో ఉమ్మడి, సంగీతం, నృత్యంతో కూడిన ముజ్రా నాట్యాన్ని ప్రదర్శించే నాట్యకారిణిలు ఉన్న ప్రదేశం.

చరిత్ర[మార్చు]

ముజ్రాలుగా ప్రసిద్ధి చెందిన మహబూబ్ సుభానీ చిల్లా పేరు మీదుగా దీనికి ఈ పేరు వచ్చింది. ప్రముఖ నాట్యకారిణి మాహ్ లకా బాయి ఈ ప్రాంతంలోనే నివసించేది. ఔరంగజేబు పాలనకు ముందు హైదరాబాద్‌లో ప్రదర్శన కళాకారులు గౌరవప్రదమైన స్థానాన్ని కలిగి ఉండేవారు. 1687లో గోల్కొండ పతనం తరువాత, మొఘల్ సైన్యం హైదరాబాద్‌ను విధ్వంసం చేయడంతో ఆ హత్యాకాండ రక్తపాతం నుండి బయటపడిన కొద్దిమంది నివాసితులు మారుమూల ప్రాంతాలకు పారిపోయారు. దాంతో కళాకారులకు ఆదరణ దొరకలేదు. కుతుబ్ షాహీ రాజులు వారి కార్యకలాపాలను కొనసాగించడానికి విస్తృతమైన వ్యవస్థను ఏర్పాటుచేశారు. అందుకోసం 30,000 కంటే ఎక్కువమంది అమ్మాయిలు హైదరాబాద్‌లోని దరోగా (పోలీస్ చీఫ్) వద్ద నమోదు చేసుకున్నారు. వారందరికి పబ్లిక్ ఎంటర్‌టైనర్‌లుగా లైసెన్స్‌లను జారీ చేశారు. కళాపోషకులు లేకపోడంతో అనేకమంది కవులు, సంగీతకారులు, వివిధ కళాకారులు జీవనోపాధి కోసం దేశంలోని వివిధ ప్రాంతాలకు వలస వెళ్ళారు.

మొఘల్ దండయాత్ర నుండి సాంస్కృతికంగా నిద్రాణమైన హైదరాబాద్‌లో, 18వ శతాబ్దం మధ్యలో నిజాం అలీఖాన్ తన రాజధానిని నగరానికి మార్చిన వెంటనే జీవితం తిరిగి పుంజుకుంది. మొఘల్ సామ్రాజ్యం క్షీణించడం, ఢిల్లీ తన కళల పోషణను నిలబెట్టుకోలేకపోవడంతో, హైదరాబాద్ భారతదేశంలోని సంస్కృతికి ప్రధాన కేంద్రంగా మారింది. దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలు హైదరాబాదుకు వలస వచ్చారు. అందులో కొందరు వేశ్యలు కూడా ఉన్నారు. 1857 తర్వాత, గౌలిగూడ పరిసర ప్రాంతంలో వేశ్యల కొత్త స్థావరం ఏర్పడింది. కాలక్రమేణా జనాభా మార్పులతో నగర నివాసాల నుండి వేశ్యలు తరిమివేయబడ్డారు. అలా చాలామంది వేశ్యలు 20వ శతాబ్దం ప్రారంభంలో మెహబూబ్ కి మెహెందీలో ఉండేవారు.[2]

ప్రసుత్తం[మార్చు]

1980లలో ఇది రెడ్ లైట్ ఏరియాగా మారగా, 1996లో ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయించారు.[3][4] ప్రజ్వల అనే ఒక ఎన్జీవో ఇక్కడి చిన్నారులకు పునరావాసం కల్పించేందుకు కృషి చేస్తోంది.

మూలాలు[మార్చు]

  1. "The Hindu : The story of the name". www.hindu.com. Archived from the original on 21 May 2005. Retrieved 2022-09-23.
  2. Dec 23, Sajjad Shahid /; 2012; Ist, 01:33 (2012-12-23). "The courtesans of Hyderabad & Mehboob Ki Mehendi | Hyderabad News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 2022-07-05. Retrieved 2022-09-23. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)
  3. "Flesh trade thriving in Hyderabad old city lanes - Times of India". articles.timesofindia.indiatimes.com. Archived from the original on 30 July 2013. Retrieved 2022-09-23.
  4. "PostGrid - Offline Communication Platform & API - PostGrid™ - US & International - Post Grid". Archived from the original on 2012-12-31. Retrieved 2022-09-23.

బయటి లింకులు[మార్చు]