జగద్గిరిగుట్ట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దస్త్రం:AP-Village-jagadgirigutta-1.jpg
జగద్గిరిగుట్ట జాతర.

జగద్గిరిగుట్ట,తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, కుత్బుల్లాపూర్‌ మండలానికి చెందిన పట్టణ ప్రాంతం. ఇది పట్టణ ప్రాంతం హైదరాబాదులోని కూకట్ పల్లి నుండి ఐదు కి.మీ. దూరంలో ఉంది.

రవాణా సౌకర్యాలు

[మార్చు]
దస్త్రం:AP-Village-jagadgirigutta-2.jpg
జగద్గిరి గుట్ట శివాలయము

ఇక్కడికి హైదరాబాదు నుండి సికింద్రాబాదు నుండి ప్రతి 10 నిమి.లకు "సిటీ బస్సులు" ఉన్నాయి. అవే కాక ఇక్కడి నుండి యాదగిరిగుట్ట రాజపేట, రఘునాథపురం, జనగాం, ఆలేరు, హన్మకొండ,[తొర్రూరు, మొత్కూర్, సిద్దిపేట, హుస్నాబాద్, హుజురాబాద్ తదితర ప్రాంతాలకు జిల్లా బస్సులు ఉన్నాయి.

వేంకటేశ్వరస్వామి దేవాలయం

[మార్చు]
దస్త్రం:AP-Village-jagadgirigutta-3.jpg
బస్టాండ్ సెంటర్. జగద్గిరి గుట్ట

జగద్గిరిగుట్ట కొండ మీద ప్రసిద్ధిచెందిన ప్రసన్నశ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం ఉంది. ఈ దేవాలయ స్థల పురాణం ప్రకారం యోగానందస్వామి అనే మహార్షికి శ్రీవారు కలలో కనిపించి ఇక్కడ ఆలయం నిర్మించమని కోరారట.

స్వామి చెప్పిన ప్రకారం 1975లో జారుడు బండ"గా వ్యవహరించే చిత్రమైన రాతి ప్రదేశంలో ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ నిర్వహించే జగత్ కళ్యాణానికి నిదర్శనంగా అప్పట్లో ఈ ప్రాంతానికి 'జగత్ గిరి గుట్ట' గా నామకరణం చేశారు.

కాలక్రమంలో అది జగద్గిరిగుట్టగా మారింది. శ్రీవారికి ప్రతి సంవత్సరం మాఘశుద్ధ వసంత పంచమి నుంచి 3 రోజుల పాట కల్యానోత్సవం, జాతర" నిర్వహిస్తారు.

జగద్గిరిగుట్టపైన ప్రకృతి సౌందర్యాన్ని తిలకించేందుకు భక్తులు ఆసక్తి చూపుతున్నారు. శ్రీవారి దేవాలయం గర్భగుడిలో ప్రతిష్ఠించబడిన స్వామి నల్లని శిలా విగ్రహం నాలుగున్నర అడుగుల ఎత్తులో మంత్రముగ్ధుల్ని చేస్తుంది.

స్వామివారికి ఎడమవైపున పద్మావతి అమ్మవారు, కుడివైపున ఆల్వార్ అమ్మవారు ఉన్నారు.

ఇతర ఆలయాలు

[మార్చు]
దస్త్రం:AP-Village-jagadgirigutta-4.jpg
జగద్గిరి గుట్ట శ్రీవెంకటేశ్వర స్వామివారి దేవాలయము

వెంకటేశ్వరస్వామి వారి ఆలయము కల కొండపై దాని ప్రక్కగా మరికొన్ని ఆలయాలు ఉన్నాయి.అవి

  • శివాలయం
  • పరశురామాలయం
  • హనుమాన్ మందిరం
  • సాయిబాబా విగ్రహం
  • గ్రామదేవత ఆలయము
  • మల్లీకార్జున స్వామి ఆలయం

మూలాలు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]