Jump to content

పురానపూల్

వికీపీడియా నుండి
పురానపూల్
నిర్దేశాంకాలు17°22′03″N 78°27′30″E / 17.36755°N 78.458278°E / 17.36755; 78.458278
OS grid reference[1]
దీనిపై వెళ్ళే వాహనాలుపాదచారులు
దేనిపై ఉందిమూసీ నది
స్థలంహైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
లక్షణాలు
మొత్తం పొడవు600 ft
వెడల్పు35 ft
చరిత్ర
Inaugurated1578 CE
ప్రదేశం
పటం
1880లలో పురానాపూల్ దాటుతున్న ప్రజలు

పురానపూల్ కుతుబ్ షాహీలు నిర్మించిన అద్భుత కట్టడాల్లో ఇదీ ఒకటి. అంతేకాదు హైదరాబాద్‌ నగరంలో నిర్మించిన తొలి వంతెన కూడా ఇదే.[1] హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ (హుడా)చే వారసత్వ కట్టడంగా గుర్తించబడింది.

నిర్మాణ కాలం

[మార్చు]

ఈ వంతెన సా.శ.1578లో ఇబ్రహీం కులీ కుతుబ్ షా నిర్మించారు. గోల్కొండ కోట నుంచి కార్వన్ వెళ్లేందుకు వీలుగా ఈ బ్రిడ్జీని నిర్మించారు. మరో కథనం ప్రకారంగా సుల్తాన్ ముహమ్మద్ కులీ కుతుబ్ షా భార్య భాగమతితో ప్రేమలో ఉన్నప్పుడు ఆమెను క్రమం తప్పకుండా కలవడానికి పురానపూల్ నిర్మించాడు. ఆ తరువాత వివాహం చేసుకున్నాడు.

విశేషాలు

[మార్చు]

ఈ పూల్ నిర్మాణంలో 22 అర్చ్ లు ఉన్నాయి. ఎత్తు 54 అడుగులు, పొడవు 600 ఫీట్లు, వెడల్పు35 చదరపు అడుగులు.

యాత్రికులు

[మార్చు]

ఈ కట్టడాన్ని ఎంతోమంది విదేశీయాత్రికులు సందర్శించారు. అసఫ్ జాహీల కాలంలో హైదరాబాద్ సందర్శించిన ఫ్రెంచ్ బాటసారి టావెర్నియర్ పురానాపూల్ నిర్మాణ శైలికి ముగ్ధుడైనాడు. దీన్ని పారిస్ లోని పోంట్ న్యుఫ్ తో పోల్చాడు.

పునర్ నిర్మాణం

[మార్చు]

400 ఏళ్లనాటి ఈ కట్టడం ఇప్పటికీ చెక్కు చెదరలేదు. 1820లో కొద్దిగా దెబ్బతింది. దీంతో అప్పటి నవాబ్ సికిందర్ షా మరమ్మతులు చేయిపించాడు. ఆ తర్వాత 1908లో మూసి నది వరదల తర్వాత దెబ్బతిన్న కొద్దిబాగాన్ని మరమ్మతు చేశారు.

ఇతర వివరాలు

[మార్చు]

దీనికి సమీపంలో మియా మిష్క్ మసీదు ఉంది.

మూలాలు

[మార్చు]
  1. చరిత్ర-ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం, తెలుగు అకాడమి హైదరాబాద్ ముద్రణ, 2016, పేజీ నెం. 70.