చెక్కు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2006లో కెనడాలోని చెక్ నమూనా

చెక్కు (ఆంగ్లం: Cheque) అంటే నిర్ధిష్ట బ్యాంకులో నిర్ధిష్ట వ్యక్తికి నిర్ణీతమొత్తం చెల్లించాలని కోరుతూ బేషరతుగా ఇచ్చిన లిఖిత పూర్వక ఆర్డరు. నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ చట్టం సెక్షన్‌ 6 ప్రకారం బ్యాంకు పేరిట రాసి ఇచ్చిన బిల్‌ ఆఫ్‌ ఎక్స్ఛేంజ్‌. చెక్కు గ్రహీతకు బ్యాంకు వారు చెక్కు రాసి ఇచ్చిన వ్యక్తి ఖాతాలో సరిపడ డబ్బు ఉన్నప్పుడు దానిని స్వీక రించి డబ్బు చెల్లిస్తారు. చెక్కును ఎండార్స్‌ మెంట్‌ ద్వారాగాని స్వాధీనం చేయడం ద్వారా గాని బదిలీ చేయవచ్చు.

చెక్కుకర్త తాను ఇచ్చిన చెక్కుకు చెల్లింపు ఆపమని చెల్లింపు జరుగడానికి ముందు ఎప్పుడైనా ఆదేశించవచ్చు. బ్యాంకు అధికారులు చెక్కును తిరస్కరిస్తూ దానిపై చెక్కు కర్త సొమ్ము చెల్లింపు ఆపినాడు అని రిమార్కు వ్రాస్తే చెక్కు బౌన్స్‌ అయి నట్లు కాదు. ఇలాంటి సందర్భాలలో చెక్కు కర్త వ్రాత పూర్వకంగా తిరిగి ఆదేశించే వరకు అధికారులు చెల్లింపును నిరాకరిస్తారు. ఈ ఆదేశాలు తిరిగి చెక్కుకర్త రద్దుచేసేవరకు లేదా ఆరు నెలలు వరకు అమలులో ఉంటాయి. చెక్కు ఇచ్చిన తరువాత చెల్లింపుకు వెళ్ళవద్దని చెక్కు గ్రహీతకు చెక్కుకర్త నోటీసు ఇచ్చినా చెక్కు గ్రహీత బ్యాంకులో చెక్కును దాఖలు చేసినట్లయిన జరిగే పరిణామాలకు చెక్కుకర్త బాధ్యత వహించడు. కాని ఆ తరువాత వచ్చే నోటీసుకు చెక్కుకర్త బాధ్యుడు.చెక్కు ఇచ్చిన తరువాత చెక్కుకర్త చనిపోతే బ్యాంకు అధికారులు ఆ చెక్కు చెల్లింపుని నిలిపి వేయవచ్చు. చెక్కును ఎవరైనా ఏజెంట్‌ జారీచేస్తే ప్రిన్సిపల్‌ చనిపోయినప్పటికీ ఆ చెక్కు చెల్లుతుంది. డబ్బు చెల్లింపు కోసం చెక్కును బ్యాంకులో దాఖలు చేసినప్పుడు డబ్బులు లేక చెక్కు రిటన్‌ అయినప్పుడు చెక్కు కర్త అభ్యర్ధన మేరకు కొద్ది రోజులు తర్వాత మరల ఆ చెక్కును దాఖలు చేయవచ్చును. ఇలా ఎన్నిసార్లు అయినా 6 నెలలలోపు బ్యాంకులో చెక్కును దాఖలు చేయవచ్చు.1988కి ముందు చెక్కు నిరాకరించబడితే అదినేరం కాదు. చెక్కును కలిగిఉన్న వ్యక్తి క్రిమినల్‌ కేసు వేసే అవకాశం లేదు. 1-4-89 నుంచి తిరస్కరించబడిన చెక్కును కలిగిఉన్న వ్యక్తి సివిల్‌, క్రిమినల్‌ కేసులు రెండు దాఖలు చేయవచ్చు. క్రిమినల్‌ కేసు దాఖలు చేయుటకు ఎలాంటి ఫీజు చెల్లించనవసరం లేదు. చెక్కులకు సంబంధించి క్రిమినల్‌ కేసుల్లో రాజీలకు సంబంధించి సుప్రీంకోర్టు మార్గదర్శక సూత్రాలు:

  • సమన్లు అందగానే నిందితుడు నేరాన్ని అంగీకరించి రాజీ కోరితే ఎలాంటి ఖర్చులు వెయ్యరాదు. అలా అని సమన్లలో పొందుపర్చాలి. తర్వాత అంటే ఒకటి, రెండు వాయిదాల తర్వాత రాజీ కోసం అర్జీ పెట్టుకుంటే, చెక్కు సొమ్ములో పది శాతాన్ని న్యాయ సేవాధికార సంస్థకు కట్టేలా షరతు విధించాలి.
  • నేరం రుజువై శిక్ష పడిన తర్వాత అప్పీలులోనో, హైకోర్టులోనే రాజీ కొస్తే చెక్కు సొమ్ములో 15 శాతాన్ని ఖర్చులు విధించాలి.
  • అదే సుప్రీంకోర్టులో రాజీ కోరితే నిందితునిపై ఖర్చులు చెక్కు సొమ్ములో 20 శాతం న్యాయసేవాధికార సంస్థకు జమ చెయ్యాలి.
  • ఫిర్యాదీదారు కేసు ఉపసంహరించుకుంటే కోర్టు తీర్పు వర్తించదు.
  • ఫిర్యాదుల్లో లావాదేవీ గురించి మరెక్కడా, మరే ఫిర్యాదు దాఖలు చెయ్యలేదని విధిగా ప్రకటించాలి.పలు కేసులున్నాయని రుజువైతే, కేసులన్నింటినీ మొదటి కేసున్న కోర్టుకే బదిలీ చేయాలి.ఫిర్యాదుదారుపై ఖర్చులు వడ్డించాలి.
  • జరిమానాలో నుంచే ఖర్చులు, పరిహారం ఫిర్యాదీకి ఇప్పించాలి.

చెక్కులు రెండు రకాలు[మార్చు]

  • ఆర్డర్‌ చెక్కులు: చెక్కుపై ఎవరి పేరు ఉందో వారి సంతకాన్ని చెక్కు ఇచ్చేవారు, చెక్కు వెనుక భాగాన ధృవీకరించి ఇస్తారు. బ్యాంకు వారు సంతకాన్ని పోల్చి చూసుకొని డబ్బు చెల్లిస్తారు. మూడవ వ్యక్తికి డబ్బులు చెల్లించరు.
  • బేరరు చెక్కులు: బ్యాంకుకు తీసుకువెళ్ళిన వ్యక్తికి డబ్బు చెల్లిస్తారు.

చెక్కు కాలపరిమితి 3 నెలలు మాత్రమే. చెక్కు తీసుకున్న 3 నెలల తరువాత బ్యాంకులో వేస్తే ఆ చెక్కు చెల్లదు. చెక్కు ఇచ్చిన వ్యక్తికి ఎటువంటి క్రిమినల్‌ బాధ్యత ఉండదు. పోస్ట్‌ డేటెడ్‌ చెక్కు అయితే దాని మీద ఉన్న తారీకు నుంచి 3 నెలల లోపు దాఖలు చేయాలి.బ్యాంకు నుంచి చెక్కు తిరస్కరించ బడిన నెలరోజుల లోపు చెక్కు ఇచ్చిన వ్యక్తికి డిమాండ్‌ నోటీసు పంపాలి. డిమాండ్‌ నోటీసు పంపించిన 15 రోజుల వరకు చెక్కు ఇచ్చిన వ్యక్తికి డబ్బు చెల్లించడానికి గడువు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ 15 రోజులలో కూడా డబ్బు చెల్లించకుంటే సెక్షన్‌ 138 ప్రకారం నేరస్థునికి రెండు సంవత్సరాల వరకు జైలుశిక్ష, జరిమానా విధించవచ్చు.

"https://te.wikipedia.org/w/index.php?title=చెక్కు&oldid=3278129" నుండి వెలికితీశారు