సుచిత్ర సెంటర్
సుచిత్ర సెంటర్ | |
---|---|
నివాస ప్రాంతం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాదు |
మెట్రో | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం |
వార్డు | 130 |
Government | |
• Body | జిహెచ్ఎంసీ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
పిన్ కోడ్ | 500 067 |
Vehicle registration | టిఎస్ |
లోక్‌సభ నియోజకవర్గం | మల్కాజ్ గిరి |
శాసనసభ నియోజకవర్గం | కుత్బుల్లాపూర్ |
పట్టణ ప్రణాళికా సంస్థ | హెచ్ఎండిఏ |
పౌర సంస్థ | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
సుచిత్ర సెంటర్ (సుచిత్ర జంక్షన్ లేదా సుచిత్ర క్రాస్ రోడ్స్) అనేది తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు శివారు ప్రాంతం.[1] ఇది బోయిన్‌పల్లి-మేడ్చల్ రోడ్డులో ఉంది. హైదరాబాదు మహానగరపాలక సంస్థలోని 130వ వార్డు పరిధిలో ఉంది.
చరిత్ర
[మార్చు]ఈ ప్రాంతంలో 1981 నుండి 2000 వరకు సుచిత్ర ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ పేరుతో ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ యూనిట్ ఉండేది. ఈ కంపెనీని కృష్ణంరాజు ప్రమోట్ చేశారు. ఈ ప్రాంతానికి బస్సు సౌకర్యం కూడా లేని సమయంలోనే ఇక్కడ 1500 మందికి పైగా ఉద్యోగులు పనిచేసేవారు. ఆ రోజుల్లో ఇది ఒక ప్రధానమైన కంపనీ. అందుకే ఈ ప్రాంతానికి సుచిత్ర సెంటర్ అని పేరు వచ్చింది. అదే ప్రాంగణంలో సుచిత్ర అకాడమీ (సిబిఎస్ఈ స్కూల్) ఏర్పాటు చేయబడింది.
సుచిత్ర సెంటర్‌లోని కాలనీలు
[మార్చు]సుచిత్ర సెంటర్ ప్రాంతంలో బీహెచ్‌ఈఎల్ అవేమాక్స్, బౌద్ధానగర్ కాలనీ, ప్రాగా టూల్స్ కాలనీ, సుభాష్ నగర్, శ్రీదుర్గా ఎస్టేట్స్, రాఘవేంద్ర కాలనీ, గాయత్రీ నగర్, బ్యాంక్ కాలనీ, ఎంఎన్ రెడ్డి నగర్, రామరాజ్ నగర్, జయరామ్ నగర్, వెంకటేశ్వర కాలనీ, న్యూ మాణిక్యనగర్, భాగ్యలక్ష్మి హోమ్స్, భాగ్యలక్ష్మి కాలనీ, శాటిలైట్ టౌన్‌షిప్, లక్ష్మీ గంగా ఎన్‌క్లేవ్, స్ప్రింగ్ ఫీల్డ్స్ కాలనీ, శ్రీ నిలయ ఎన్‌క్లేవ్ మొదలైన కాలనీలు ఉన్నాయి.
సౌకర్యాలు
[మార్చు]ఈ ప్రాంతంలో పాఠశాలలు, బ్యాంకులు, ఆసుపత్రులు, సూపర్‌మార్కెట్లు, మై ఫ్రెండ్ సర్కిల్, బొమ్మరిల్లు, కృతుంగ, స్వాగత్ గ్రాండ్, సురభి ప్రైడ్, సబ్‌వే, కె.ఎఫ్.సి., పిజ్జా హట్, మెక్ డొనాల్డ్స్, కెఎల్ఎం షాపింగ్ మాల్, ఆర్ఎస్ బ్రదర్స్, రిలయన్స్ డిజిటల్, సామ్‌సంగ్, మాక్స్, యెస్‌మార్ట్, బజాజ్ ఎలక్ట్రానిక్స్, మెట్రో సూపర్ మార్కెట్, చెన్నై షాపింగ్ మాల్, పాయ్ ఇంటర్నేషనల్, టిఎన్ఆర్ నార్త్ సిటీ మాల్ వంటి సంస్థల బ్రాంచీలు ఉన్నాయి.[2]
మూలాలు
[మార్చు]బాహ్య లింకులు
[మార్చు]- [1] వికీమాపియాలో NH7లో సుచిత్ర-జంక్షన్ (సెంటర్).