మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలంగాణ లోని 17 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. భారతదేశంలో మాల్కాజిగిరి అతిపెద్ద లోక్‌సభ నియోజకవర్గంగా ఉంది.[1]


2002లో ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజన అమలు చేసిన తర్వాత ఈ నియోజకవర్గం 2009లో మల్కాజిగిరి లోక్‌సభ స్థానం ఏర్పడింది.[2]


మల్కాజిగిరి లోక్‌సభ స్థానం ఓటర్ల పరంగా దేశంలోనే అతిపెద్ద లోక్‌సభ స్థానంగా గుర్తింపు పొందింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుండి మల్కాజిగిరి 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. 1965కు ముందు మల్కాజిగిరి గ్రామ పంచాయతీగా ఉండేది. 1985లో మున్సిపల్ కార్పొరేషన్‌గా అవతరించింది. నగర విస్తీర్ణం పెరుగుతూ పోవడంతో 2007లో మళ్లీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేశారు.

దేశ రక్షణ రంగానికి చెందిన ఎయిర్ ఫోర్స్, ఆర్మీ స్థావరాలతోపాటు పారిశ్రామిక, విద్యా రంగాలకు సంబంధించిన ప్రతిష్ఠాత్మక యూనిర్శిటీలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి.

దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గములు

[మార్చు]

ఈ నియోజకవర్గంలో మేడ్చల్ జిల్లాలోని ఉప్పల్, కూకట్ పల్లి, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, మేడ్చల్ ఐదు నియోజకవర్గాలు… రంగారెడ్డి జిల్లాలోని ఎల్బీనగర్, హైదరాబాద్ జిల్లాలోని కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానాలను కలిపి 2009లో మల్కాజిగిరి లోక్‌ సభ స్థానాన్ని ఏర్పాటు చేశారు.

నం పేరు జిల్లా సభ్యుడు పార్టీ 2018లో గెలిచిన పార్టీ
43 మేడ్చల్ మేడ్చల్-మల్కాజిగిరి మల్లా రెడ్డి బీఆర్ఎస్ టీఆర్ఎస్
44 మల్కాజ్‌గిరి మర్రి రాజశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ ఐఎన్‌సీ
45 కుత్బుల్లాపుర్ కేపీ వివేకానంద్ గౌడ్ బీఆర్ఎస్ టీఆర్ఎస్
46 కూకట్‌పల్లి మాధవరం కృష్ణారావు బీఆర్ఎస్ టీఆర్ఎస్
47 ఉప్పల్ బండారి లక్ష్మా రెడ్డి బీఆర్ఎస్ ఐఎన్‌సీ
49 ఎల్బీనగర్ రంగా రెడ్డి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి బీఆర్ఎస్ ఐఎన్‌సీ
71 సికింద్రాబాద్ కంటోన్మెంట్ హైదరాబాద్ ఖాళీగా టీఆర్ఎస్

లోక్‌సభ సభ్యులు

[మార్చు]

ఈ పార్లమెంట్ స్థానానికి 2009, 2014, 2019లో ఎన్నికలు జరగ్గా సర్వే సత్యనారాయణ, చామకూర మల్లారెడ్డి, రేవంత్ రెడ్డి గెలిచారు.

లోక్‌సభ సంవత్సరం పదవీకాలం సభ్యుడు పార్టీ మెజారిటీ
15వ 2009[3] 2009–2014 సర్వే సత్యనారాయణ భారత జాతీయ కాంగ్రెస్ 93,226
16వ 2014[4] 2014–2018 మల్లా రెడ్డి తెలుగు దేశం పార్టీ 28,371
17వ 2019 [5] 2019 - 2023 డిసెంబరు 08[6] రేవంత్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ 10,919
18వ 2024[7][8] 4 జూన్ 2024 - ప్రస్తుతం ఈటెల రాజేందర్ భారతీయ జనతా పార్టీ 3,91,475

ఎన్నికల ఫలితాలు

[మార్చు]

సాధారణ ఎన్నికలు 2019

[మార్చు]

2019 నాటికి, ఓటర్ల సంఖ్య 3,150,303[9]

2019 భారత సార్వత్రిక ఎన్నికలు : మల్కాజ్‌గిరి
Party Candidate Votes % ±%
భారత జాతీయ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి 6,03,748 38.63 +24.21
తెలంగాణ రాష్ట్ర సమితి మర్రి రాజశేఖర్‌రెడ్డి 5,92,829 37.93 +7.39
భారతీయ జనతా పార్టీ రాంచందర్ రావు నారపరాజు 3,04,282 19.47 +19.47
జనసేన పార్టీ మహేందర్ రెడ్డి బొంగునూరి 28,420 1.82
నోటా పైవేవీ కాదు 17,895 1.14
మెజారిటీ 10,919
మొత్తం పోలైన ఓట్లు 15,63,646 49.63
భారత జాతీయ కాంగ్రెస్ gain from తెలుగు దేశం పార్టీ Swing

సాధారణ ఎన్నికలు 2014

[మార్చు]
2014 భారత సార్వత్రిక ఎన్నికలు: మల్కాజ్‌గిరి [10][11]
Party Candidate Votes % ±%
తెలుగు దేశం పార్టీ మల్లారెడ్డి 5,23,336 32.30 +7.83
తెలంగాణ రాష్ట్ర సమితి మైనంపల్లి హన్మంతరావు 4,94,965 30.54 N/A
భారత జాతీయ కాంగ్రెస్ సర్వే సత్యనారాయణ 2,33,711 14.42 -17.79
లోక్_సత్తా_పార్టీ నాగభైరవ జయప్రకాశ్ నారాయణ్ 1,58,243 9.77 +0.73
యువజన_శ్రామిక_రైతు_కాంగ్రెస్_పార్టీ వి.దినేశ్ రెడ్డి 1,15,710 7.14 N/A
ఆల్_ఇండియా_మజ్లిస్_ఎ_ఇత్తెహాదుల్_ముస్లిమీన్ ధరణికోట దివాకర్ సుధాకర్ 18,543 1.14 N/A
IND. కె.నాగేశ్వర్ 13,236 0.82 N/A
విజయంలో తేడా
మొత్తం పోలైన ఓట్లు 16,20,397 50.90 -0.56
తెలుగు దేశం పార్టీ gain from భారత జాతీయ కాంగ్రెస్ Swing

సాధారణ ఎన్నికలు 2009

[మార్చు]

2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున ఇంద్రసేనారెడ్డి, ప్రజారాజ్యం పార్టీ తరఫున మాజీ మంత్రి నవతెలంగాణ పార్టీ స్థాపించి ప్రజారాజ్యంలో విలీనం చేసిన నాయకుడు తూళ్ళ దేవేందర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నుండి సర్వే సత్యనారాయణ పోటీ చేశారు. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణ గెలిచాడు.[12]

2009 భారత సార్వత్రిక ఎన్నికలు: మల్కాజ్‌గిరి [13]
Party Candidate Votes % ±%
భారత జాతీయ కాంగ్రెస్ సర్వే సత్యనారాయణ 3,88,368 32.21 N/A
తెలుగు దేశం పార్టీ టి.భీంసేన్ 2,95,042 24.47 N/A
ప్రజా రాజ్యం పార్టీ తూళ్ళ దేవేందర్ గౌడ్ 2,38,886 19.81 N/A
భారతీయ జనతా పార్టీ నల్లు ఇంద్రసేనారెడ్డి 1,30,206 10.80 N/A
లోక్_సత్తా_పార్టీ విజ్ఞాన్ లావు రత్తయ్య 1,09,036 9.04 N/A
విజయంలో తేడా
మొత్తం పోలైన ఓట్లు 12,05,714 51.46 N/A
భారత జాతీయ కాంగ్రెస్ win (new seat)

2024 ఎన్నికలు

[మార్చు]

మల్కాజ్‌గిరి పార్లమెంటు స్థానానికి 114 మంది అభ్యర్థులు 177 నామినేషన్లు దాఖలు చేశారు. పరిశీలనలో 77 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించారు. 37 మంది అభ్యర్థుల నామినేషన్లను జిల్లా ఎన్నికల అధికారి గౌతమ్‌ ఆమోదించారు. నామినేషన్ల ఉపసంహరణ చివరిరోజు 15 మంది అభ్యర్థులు తమ నామినే షన్లను ఉపసంహరించుకోగా 22 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.[14][15]

మూలాలు

[మార్చు]
  1. HMTV (17 June 2021). "Malkajgiri: అతిపెద్ద నియోజకవర్గం మల్కాజిగిరి". Archived from the original on 12 జనవరి 2022. Retrieved 12 January 2022.
  2. EENADU (29 April 2024). "మల్కాజిగిరి". Archived from the original on 8 May 2024. Retrieved 8 May 2024.
  3. "Constituency Wise Detailed Results" (PDF). Election Commission of India. p. 196. Archived from the original (PDF) on 11 August 2014. Retrieved 30 April 2014.
  4. "Constituencywise-All Candidates". Election Commission of India. Archived from the original on 17 May 2014.
  5. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  6. Andhrajyothy (8 December 2023). "మల్కాజ్‌గిరి ప్రజలకు సీఎం రేవంత్ బహిరంగ లేఖ.. ఏమన్నారంటే..?". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  7. Andhrajyothy (5 June 2024). "మల్కాజిగిరిలో ఎప్పుడూ విభిన్నమైన తీర్పే..." Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
  8. Andhrajyothy (5 June 2024). "కమల 'వికాసం'". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
  9. Zee News (13 March 2024). "Indias Most Populous Lok Sabha Seat Has More Than 30 Lakh Voters" (in ఇంగ్లీష్). Archived from the original on 8 May 2024. Retrieved 8 May 2024.
  10. "Parliamentary Constituency wise Turnout for General Election - 2014". Election Commission of India. Archived from the original on 2 July 2014. Retrieved 31 July 2014.
  11. "Malkajgiri". Election Commission of India. Archived from the original on 2 June 2014.
  12. Eenadu (6 December 2023). "మల్కాజిగిరి సెంటిమెంట్‌.. మూడు ఎన్నికల్లో సంచలనాలు". Archived from the original on 21 December 2023. Retrieved 21 December 2023.
  13. "Constituency Wise Detailed Results" (PDF). Election Commission of India. pp. 2–3. Archived from the original (PDF) on 11 August 2014. Retrieved 30 April 2014.
  14. EENADU (30 April 2024). "4 స్థానాలు.. 140 మంది అభ్యర్థులు". Archived from the original on 30 April 2024. Retrieved 30 April 2024.
  15. Andhrajyothy (30 April 2024). "ముగిసిన నామినేషన్ల ఘట్టం". Archived from the original on 30 April 2024. Retrieved 30 April 2024.

వెలుపలి లంకెలు

[మార్చు]