కె.పి. వివేకానంద గౌడ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కె.పి. వివేకానంద గౌడ్
కె.పి. వివేకానంద గౌడ్


పదవీ కాలం
  2014 - 2018, 2018- ప్రస్తుతం
ముందు  కూన శ్రీశైలం గౌడ్
నియోజకవర్గం కుత్బుల్లాపూర్ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం అక్టోబర్ 21, 1977
కుతుబుల్లాపూర్, కుత్బుల్లాపూర్‌ మండలం, మేడ్చల్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం,
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు పాండు, శ్యామల
జీవిత భాగస్వామి సౌజన్య
సంతానం ఒక కుమారుడు, ఒక కుమార్తె
నివాసం కుత్బుల్లాపూర్, తెలంగాణ

కె.పి. వివేకానంద గౌడ్, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి పార్టీ తరపున కుత్బుల్లాపూర్ శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[2][3]

జననం, విద్య[మార్చు]

వివేకానండ గౌడ్ 1977, అక్టోబర్ 21 న కెఎం పాండు, శ్యామల దంపతులకు తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, కుత్బుల్లాపూర్‌ మండలంలోని కుతుబుల్లాపూర్ లో జన్మించాడు. తండ్రి పాండు రెండుసార్లు సర్పంచ్‌గా పనిచేశాడు. కుత్బుల్లాపూర్ మునిసిపాలిటీకి మొదటి చైర్మన్ గా ఎన్నికయ్యాడు. చింతల్ సమీపంలోని హెచ్ఎంటి ఉన్నత పాఠశాలలో 1994లో తన పాఠశాల విద్యను పూర్తిచేసిన వివేకానంద, 1996లో హైదరాబాదు పంజాగుట్టలోని చాణక్య జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. ఆ తరువాత ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న ముఫాఖమ్ జా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ కళాశాల నుండి 2001లో తన ఇంజనీరింగ్ పూర్తి చేశాడు.[4]

వివాహం[మార్చు]

వివేకానండ గౌడ్ కు సౌజన్యతో వివాహం జరిగింది. ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.

రాజకీయ విశేషాలు[మార్చు]

వివేకానంద గౌడ్ ఇంజనీరింగ్ పూర్తిచేసిన తర్వాత శక్తి యువ సేవా సమితిని ప్రారంభించిన వివేకానంద 2000 సంవత్సరంలో క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చాడు. 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో టిడిపి నుంచి పోటీచేసి స్వతంత్ర అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ చేతిలో ఓడిపోయాడు. 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీచేసి సమీప తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి కె. హనుమంత్ రెడ్డిపై 39,021 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[5]వివేకానంద గౌడ్ 10 ఫిబ్రవరి 2016న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు.[6] 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిగా పోటీచేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ పై 41,500 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[7][8]

హోదాలు[మార్చు]

 1. తెలంగాణ శాసనసభ రూల్స్ కమిటీ సభ్యుడు

ఇతర వివరాలు[మార్చు]

 1. యుఎస్‌లో జరిగిన యుఎస్ యంగ్ లీడర్స్ పొలిటికల్ ప్రోగ్రామ్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన ఐదుగురిలో తెలంగాణ రాష్ట్రం నుండి వివేకానంద ఒకరు మాత్రమే.
 2. హాంకాంగ్, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మొదలైన దేశాలు సందర్శించాడు.
 3. 2014లో పుణె భారతీయ ఛత్ర సంసద్ నుండి ఉత్తరాఖండ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చేతులమీదుగా 2014 సంవత్సరానికి ఆదర్శ్ యువ విద్యార్థి పురస్కారం అందుకున్నాడు.

మూలాలు[మార్చు]

 1. "Member's Profile - Telangana-Legislature". www.telanganalegislature.org.in. Archived from the original on 2021-05-27. Retrieved 2021-09-13.
 2. https://www.thenewsminute.com/article/change-colors-qutbullapur-mla-k-p-vivekananda-goud-joins-trs-38740%3famp[permanent dead link]
 3. Members of the Legislative Assembly, Telangana State Portal
 4. "KP Vivekananda | MLA | TRS | Qutubullapur | Medchal-Malkajgiri | Telangana". the Leaders Page (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-04-17. Retrieved 2021-09-13.
 5. https://telanganatoday.com/ts-election-results-kp-vivekanand-retains-qutbullapur/amp
 6. Sakshi (10 February 2016). "టీడీపీకి మరో షాక్..కారెక్కిన వివేక్". Archived from the original on 19 జనవరి 2022. Retrieved 19 January 2022.
 7. http://myneta.info/telangana2014/candidate.php?candidate_id=1702
 8. Statistical Report on General Election 2014, Election Commission of India.