నాగభైరవ జయప్రకాశ్‌ నారాయణ్‌

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నాగభైరవ జయప్రకాశ్‌ నారాయణ్‌
నాగభైరవ జయప్రకాశ్‌ నారాయణ్‌

నాగభైరవ జయప్రకాశ్‌ నారాయణ్‌


వ్యవస్థాపక అధ్యక్షులు, లోక్‌సత్తా పార్టీ

పదవీ కాలము
2009 - 2014
నియోజకవర్గం కూకట్‌పల్లి, హైదరాబాద్

వ్యక్తిగత వివరాలు

జననం (1956-01-14) 1956 జనవరి 14 (వయస్సు: 63  సంవత్సరాలు)/ జనవరి 14 1956
నాగభిర్, మహారాష్ట్ర
రాజకీయ పార్టీ లోక్‌సత్తా పార్టీ
పూర్వ విద్యార్థి ఎం.బి.బి.ఎస్
ఉస్మానియా మెడికల్ కాలేజీ
వెబ్‌సైటు www.kukatpallynow.com
జనవరి 1, 2013నాటికి

నాగభైరవ జయప్రకాశ్ నారాయణ్‌ లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు. కృష్ణాజిల్లా గొడవర్రులో పెరిగాడు. ఎమ్‌.బి.బి.ఎస్‌ పట్టా పొందిన పిదప భారత పరిపాలనా సేవలో (I.A.S) చేరాడు.

ప్రస్థానం[మార్చు]

1980లో ఐఎఎస్‌ అధికారిగా గుంటూరు లో అడుగుపెట్టారు. తర్వాత విశాఖ లో జాయింట్‌ కలెక్టర్‌గా, 1986లోప్రకాశం జిల్లాలో, తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో కలెక్టర్‌గా చేశారు. తర్వాత యాగ్రో ఇండస్ట్రీస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అధినేతగా, గవర్నర్‌ కార్యదర్శిగా, ముఖ్యమంత్రి కార్యదర్శిగా పలు పదవులు నిర్వహించారు.

సామాజిక జీవితం[మార్చు]

లోక్‌సత్తా అనే స్వచ్ఛంద సంస్థను 1996లో ఏర్పాటు చేశారు. ఓటర్ల జాబితాను సవరించే చట్టాన్ని, నేరచరిత్రను తిరగేసి సరైన వారికే అధికారం కట్టబెట్టే చట్టాన్ని, పార్టీనిధులను సమీకరించే చట్టాన్ని, మంత్రి వర్గాల సవరణ చట్టాన్ని, పార్టీ ఫిరాయింపులను నిషేధించే చట్టం, గ్రామీణ న్యాయవాదం, జాతీయ ఆరోగ్య మిషన్‌, సమాచార హక్కు, సహకార సంఘాలకు స్వయంప్రతిపత్తి ఇలా అనేక చట్టాలను లోక్‌సత్తా సేవా సంస్థ ద్వారాప్రజల్లోకి తీసుకురాగలిగారు.1996 లో ఐఎఎస్‌ పదవిని వదలి లోక్‌సత్తాను రాజకీయ పార్టీగా మార్చారు. బుద్ధుడన్నా, బుద్ధుని బోధలన్నా చాల ప్రియం. 2009 లో కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి శాసనసభకు గెలుపొందారు. 2014 లో మల్కజ్ గిరి నుంచి లోకసభకు పోటిచేసి ఓడిపోయారు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

ఒక తెలుగు మాట్లాడే కుటుంబంలో మహారాష్ట్రలోని నాగభిర్‌లో 14 జనవరి 1956 న జన్మించారు. మూడవ యేట నుండి 7 సంవత్సరాల వయస్సు వరకు విజయవాడ సమీపం లోని గొడవర్రు అనే గ్రామంలో పెరిగారు. ఇక్కడే తెలుగు మీడియంలో చదువు కొనసాగింది. 7 సంవత్సరాల వయస్సులో తన తల్లిదండ్రులతో కృష్ణా జిల్లా ఇందుపల్లి సమీపంలోని వేమండ గ్రామానికి మారారు. 1969 లో ఆంధ్ర లయోలా కళాశాలలో ఇంటర్మీడియట్ కోసం చేరారు. తదనంతరం వైద్యపట్టా పొందారు. భార్య రాధ, అమ్మాయి స్నిగ్ధ, అబ్బాయి సిద్ధార్ధ.

డా. జయప్రకాష్ నారాయణ్ మరియు ఆయన సతీమణి రాధ, హైదరాబాదులోని శంశాబాదు అంతర్జాతీయ విమానాశ్రయంలో

ఇవీ చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]