గొడవర్రు (కంకిపాడు మండలం)
గొడవర్రు (కంకిపాడు మండలం) | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా |
మండలం | కంకిపాడు |
ప్రభుత్వము | |
- సర్పంచి | శ్రీ కోనేరు భాను ప్రసాద్ |
జనాభా (2011) | |
- మొత్తం | 3,457 |
- పురుషులు | 1,671 |
- స్త్రీలు | 1,786 |
- గృహాల సంఖ్య | 1,008 |
పిన్ కోడ్ | 521151 |
ఎస్.టి.డి కోడ్ | 08676 |
గొడవర్రు కృష్ణా జిల్లా, కంకిపాడు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 151., యస్.టీ.డీ. కోడ్ = 0866.
గ్రామ చరిత్ర[మార్చు]
గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]
గ్రామ భౌగోళికం[మార్చు]
[1] సముద్రమట్టానికి 24 మీ. ఎత్తు Time zone: IST (UTC+5:30
సమీప గ్రామాలు[మార్చు]
ఈ గ్రామానికి సమీపంలో గొల్లగూడెం, గోసాల, ప్రొద్దుటూరు, చినపులిపాక, రొయ్యూరు గ్రామాలు ఉన్నాయి.
సమీప మండలాలు[మార్చు]
పెనమలూరు, తోట్లవల్లూరు, వుయ్యూరు, గన్నవరం,విజయవాడ
గ్రామ పంచాయతీ[మార్చు]
2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ కోనేరు భాను ప్రసాద్ సర్పంచిగా గెలుపొందారు. [2]
గ్రామంలోని విద్యా సౌకర్యాలు[మార్చు]
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల[మార్చు]
ఈ పాఠశాలలో 1989-90 లో పదవ తరగతి చదివిన విద్యార్థులు, 2016,మే-8వ తేదీ ఆదివారం నాడు, కుటుంబాలతో సహా, పాఠశాల ఆవరణలో కలుసుకొని తమ చిన్ననాటి అనుభవాలను నెమరువేసుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థుల ఉపయోగార్ధం, 24 బెంచీలనూ, రెండు బీరువాలను వితరణగా అందజేసినారు. [7]
ఆర్.సి.ఎం.పాఠశాల[మార్చు]
వైద్య సౌకర్యాలు[మార్చు]
ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]
ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]
గ్రామానికి రవాణా సౌకర్యం[మార్చు]
కంకిపాడు, మానికొండ, పెనమలూరు నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 20 కి.మీ
గ్రామంలోని మౌలిక సదుపాయాలు[మార్చు]
శుద్ధజల కేంద్రం[మార్చు]
గొడవర్రుకు చెందిన శ్రీ వెల్లంకి రవిబాబు (ఆదర్శ రైతు), రాణీ విజయలక్ష్మి దంపతులు కర్నాటక రాష్ట్రంలో వ్యవసాయదారులుగా స్థిరపడినారు. అయినా తన స్వగ్రామంపై మక్కువతో, ఈ గ్రామాభివృద్ధి కోసం, 5.20 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. మిగతా 2.3 లక్షలు గ్రామస్థుల వాటాగా అందించగా, మొత్తం ఏడున్నర లక్షల రూపాయలతో, గ్రామంలో శుద్ధజల కేంద్రం ఏర్పాటుకు, 2017,ఫిబ్రవరి-18న శంకుస్థాపన నిర్వహించారు. ఈ శుద్ధజల కేంద్రాన్ని దాత శ్రీ రవిబాబు అమ్మమ్మ కీ.శే. యలమంచిలి రత్తమ్మ, తాత కీ.శే. కోటయ్యల స్మారక చిహ్నంగా నిర్మించుచున్నారు. [8]
అంగన వాడీ కేంద్రం[మార్చు]
ఈ గ్రామంలో 2 అంగన వాడీ కేంద్రాలు ఉన్నాయి.
గ్రామానికి సాగు/త్రాగు నీటి సౌకర్యం[మార్చు]
గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]
వరి, అపరాలు, కూరగాయలు
గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]
గ్రామంలోని ప్రముఖులు (నాడు/నేడు)[మార్చు]
రాష్ట్ర నాయకులు, లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకుడు శ్రీ జయప్రకాశ్ నారాయణ గారిది ఈ ప్రాంతమే.
మధురకవి, విద్వాన్ దేవరకొండ చిన్నికృష్ణ శర్మ[మార్చు]
వీరి శతజయంతి వేడుకలను పురస్కరించుకొని. 2020,అక్టోబరు-26న గ్రామములో 15 మంది పండితులు, లోక కళ్యాణార్ధం, వేదాలను పఠించినారు. ఈ క్రతువులో కుటుంబ సభ్యులు, పీఠం ప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా, వేద పండితులను సత్కరించినారు. [10]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]
శ్రీ గంగా పార్వతీ సమేత సోమేశ్వర స్వామి ఆలయం[మార్చు]
ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించెదరు. మరుసటి రోజు అన్నదానం నిర్వహించెదరు. [3]
శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం[మార్చు]
శ్రీ అంకమ్మ తల్లి దేవర ఆలయం:[మార్చు]
మాదువారి ఇలవేలుపు అయిన ఈ అమ్మవారి వార్షిక ఉత్సవాలు, 2015,మే నెల-22వ తేదీ శుక్రవారంనుండి, 24వ తేదీ ఆదివారం వరకు నిర్వహించెదరు. ఈ ఉత్సవాలలో గ్రామస్థులు, భక్తులు, మాదువారి కుటుంబీకులు, అధికసంఖ్యలో పాల్గొంటారు. తొలి రోజున అమ్మవారి విగ్రహాన్ని నదీపాయలోనికి తీసికొనివెళ్ళి, పుణ్యస్నానమాచరింపజేయుదురు. [5]
గ్రామ విశేషాలు[మార్చు]
- ఈ గ్రామానికి చెందిన రైతు శ్రీ వై.మధుసూదనరావు, గత సంవత్సరంలో అందరికంటే ఎక్కువగా ఎకరానికి 70.40 టన్నుల చెరకుపండించి, రికార్డు సృష్టించి, ఉయ్యూరు పంచదార కర్మాగారంవారి నుండి బంగారు పతకం అందుకున్నారు. [4]
- మదర్ థెరెస్సా స్వచ్ఛంద సేవా సంస్థ:- గొడవర్రు కేంద్రంగా సేవలందిస్తున్న ఈ సంస్థ కార్యదర్శి శ్రీ తాడితోటి నరసింహారావుకు రాష్ట్రస్థాయి పురస్కారం లభించింది. 2015,సెప్టెంబరు-8వ తెదీనాడు ప్రపంచ అక్షరాస్యతా దినోత్సవం సందర్భంగా తిరుపతిలో నిర్వహించిన దక్షిణభారతదేశ ప్రభుత్వేతర స్వచ్ఛందసేవాసంస్థల సమావేశంలో, వీరు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఆ సంఘ జాతీయ అధ్యక్షురాలు శ్రీమతి సాదినేని యామిని, ప్రధాన కార్యదర్శి శ్రీ బి.దాసు, తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ అధ్యక్షులు మణినాయుడు చేతుల మీదుగా వీరు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. [6]
- గొడవర్రు గ్రామానికి చెందిన శ్రీ వరికూటి రాకేష్అనిల్,చినఓగిరాల ప్రాధమిక ఆరోగ్యకేంద్రంలో విధులు నిర్వహించుచున్నారు. కరోనా కట్టడి,ఉత్తమ వైద్యసేవలకు గుర్తింపుగా ఇటీవల వీరికి జిల్లా కలెక్టర్ శ్రీ ఇంతియాజ్ నుండి పురస్కారం లభించినది. [9]
గణాంకాలు[మార్చు]
- జనాభా (2011) - మొత్తం 3,457 - పురుషుల సంఖ్య 1,671 - స్త్రీల సంఖ్య 1,786 - గృహాల సంఖ్య 1,008;
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3663.[2] ఇందులో పురుషుల సంఖ్య 1813, స్త్రీల సంఖ్య 1850, గ్రామంలో నివాస గృహాలు 958 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 964 హెక్టారులు.
మూలాలు[మార్చు]
- ↑ "http://www.onefivenine.com/india/villages/Krishna/Kankipadu/Godavarru". Retrieved 18 June 2016. External link in
|title=
(help) - ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-03.
వెలుపలి లింకులు[మార్చు]
[2] ఈనాడు విజయవాడ/పెనమలూరు;2013,ఆగస్టు-1. [3] ఈనాడు విజయవాడ/పెనమలూరు;2013,సెప్టెంబరు-9;1వపేజీ. [4] ఈనాడు విజయవాడ/పెనమలూరు;2013,అక్టోబరు-27;1వపేజీ. [5] ఈనాడు అమరావతి;2015,మే-23;22వపేజీ. [6] ఈనాడు అమరావతి;2015,సెప్టెంబరు-11;31వపేజీ. [7] ఈనాడు అమరావతి/పెనమలూరు;2016,మే-9;2వపేజీ. [8] ఈనాడు అమరావతి/పెనమలూరు;2017,ఫిబ్రవరి-18;1వపేజీ. [9] ఈనాడు అమరావతి;2020,అక్టోబరు-3,9వపేజీ. [10] ఈనాడు ఆంధ్రప్రదేశ్;2020,అక్టోబరు-27,9వపేజీ.