Coordinates: 16°25′59″N 80°47′43″E / 16.433058°N 80.795311°E / 16.433058; 80.795311

కోలవెన్ను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కోలవెన్ను
—  రెవెన్యూ గ్రామం  —
కోలవెన్ను is located in Andhra Pradesh
కోలవెన్ను
కోలవెన్ను
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°25′59″N 80°47′43″E / 16.433058°N 80.795311°E / 16.433058; 80.795311
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం కంకిపాడు
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీ తుమ్మల చంద్రశేఖరరావు
జనాభా (2011)
 - మొత్తం 5,076
 - పురుషులు 2,503
 - స్త్రీలు 2,573
 - గృహాల సంఖ్య 1,499
పిన్ కోడ్ 521
151
ఎస్.టి.డి కోడ్ 0866

కోలవెన్ను కృష్ణా జిల్లా, కంకిపాడు మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన కంకిపాడు నుండి 5 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన విజయవాడ నుండి 21 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1499 ఇళ్లతో, 5076 జనాభాతో 1230 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2503, ఆడవారి సంఖ్య 2573. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2160 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 52. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 589493[1].పిన్ కోడ్: 521151.సముద్రమట్టానికి 24 మీ. ఎత్తులో ఉంది.కంకిపాడు, పెనమలూరు నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 23 కి.మీ.దూరంలో ఉంది.

గ్రామ చరిత్ర[మార్చు]

ఏ కోణంలో చూసినా, ఈ గ్రామం పాడిపంటలకు పుట్టినిల్లుగా కీర్తి పొందినది. కాలువలద్వారా సాగునీటి సరఫరా లేని రోజులలో ఇక్కడ ఏతాములద్వారా పొలాలకు నీరు పెట్టేవారు. దీనితో పంటలు సమృద్ధిగా పండేవి. ధాన్యాగారంగానూ పేరుపొందినది. ఈ గ్రామ రైతులకు పశుపోషణపై గూడా ఆసక్తి మెండు. ప్రతి ఏటా ఇక్కడ క్రమం తప్పకుండా పశుప్రదర్శన, ఎడ్లపందాలు జరిగేవి. ఈ పోటీలను తిలకించటానికి ఇక్కడికి మాజీ ప్రధాని శ్రీ అతుల్ బిహారీ వాజపాయ్ గారు రావటాన్ని, గ్రామస్థులు మరువలేరు. సినీరంగంలో గూడా ఈ గ్రామానికి రాష్ట్రస్థాయిలో పేరున్నది. ప్రముఖ దర్శకులు శ్రీ కోవెలమూడి రాఘవేంద్రరావు, కె.బాపయ్య ఈ గ్రామానికి చెందినవారే. అప్పట్లో సూపర్ డూపర్ హిట్టయిన సోగ్గాడు, పాడిపంటలు, ప్రెసిడెంటుగారి పెళ్ళాం తదితర చిత్రాల షూటింగ్ ఎక్కువ భాగం ఇక్కడే జరిగింది. ఇక్కడ ఉన్న పాతభవనాలు రాజభవనాలను తలపిస్తుంటాయి. ఈ గ్రామ రైతు శ్రీ అడుసుమల్లి జగన్మోహనరావుకి చెందిన "రాముడు-భీముడు" అను గిత్తల జత రాష్ట్ర వ్యాప్తంగా అనేక పోటీలలో పాల్గొని పదుల సంఖ్యలో పతకాలు సాధించినవి.

సమీప గ్రామాలు[మార్చు]

ఈ గ్రామానికి సమీపంలో ప్రొద్దుటూరు, గొల్లగూడెం, కంకిపాడు, చలివేంద్రపాలెం, నెప్పల్లి గ్రామాలు ఉన్నాయి.

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల[మార్చు]

(1) ఈ పాఠశాల స్వర్ణోత్సవాలకు సిద్ధంగా ఉంది. [5]

{2} ఈ పాఠశాలలో పనిచేయుచున్న 13మంది ఉపాధ్యాయులూ, బోధనతోపాటు వృత్తిధర్మాన్ని చాటుచూ, నిరుపేదలకు అండగా నిలుచుచూ సేవాభావాన్ని చాటుచున్నారు. నాణ్యమైన విద్యను అందించుచూ ఉపాధ్యాయులంతా తమకు తోచినరీతిలో గ్రామీణ విద్యార్థుల అభ్యుదయానికి పాటుపడుచున్నారు. చదువులో రాణించేలాగా విద్యార్థులకు పలు ప్రోత్సాహక బహుమతులందించుచున్నారు. బడి పిలుస్తోంది వంటి కార్యక్రమాలను పక్కాగా అమలుచేయుచూ అందరి మన్ననలనూ పొందుచున్నారు. [9]

మండల పరిషత్తు ప్రాధమిక పాఠశాల[మార్చు]

శ్రీ కృష్ణదేవరాయలు గ్రంధాలయం[మార్చు]

గ్రంథాలయన్ని 1938లో ప్రారంభించారు.

మౌలిక సదుపాయాలు[మార్చు]

వైద్య సౌకర్యాలు[మార్చు]

ఈ గ్రామంలోని ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల, జిల్లాలోనే అతి పెద్ద విస్తీర్ణం కలిగినదిగా ప్రసిద్ధి పొందినది. 1952 లో దాతలు 90 సెంట్ల స్థలాన్ని ఈ ఆసుపత్రికి వితరణ చేసారు. మరికొందరు దాతలు ఆసుపత్రి భవన నిర్మాణానికి సాయం అందించారు. ప్రభుత్వం నుండి వైద్యులు, మందులు సరఫరా అవుచున్నవి. కానీ తగిన ప్రచారం లేక రోగుల సంఖ్య పెరుగుట లేదు. ఆసుపత్రిని అభివృద్ధి చేయవలసిన అవసరం ఎంతయినా ఉంది. [8]

ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం[మార్చు]

ఈ సంఘం 1957 లో ఏర్పడింది. గ్రామం నడిబొడ్డున 15 సెంట్ల స్థలాన్ని, గ్రామస్తుడైన కీ.శే.కంచర్ల కేశవరావు జ్ఞాపకార్ధం ఆయన కుమారులు విరాళంగా ఇచ్చారు. ఆ స్థలంలో రు. 3.5 లక్షలతో విశాలమైన భవనాన్ని నిర్మించారు. సక్రమ నిర్వహణ, సభ్యులసహకారంతో, ఈ సంఘం, 11 ఏళ్ళుగా లాభాలబాటలో నడుస్తున్నది. 100% ఋణాల వసూళ్ళు సాధించి జిల్లాలో ప్రథమ స్థానంలో ఉంది. ఆరు డ్వాక్రా సంఘాలకు ఇప్పటిదాకా రు. 10 లక్షల ఋణం ఇచ్చారు. 100% వసూళ్ళు నమోదయినవి. [4]

అంగనవాడీ కేంద్రం[మార్చు]

సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

ఊరచెరువు:- గ్రామములో 21 ఎకరాలలో విస్తరించియున్న ఈ చెరువు, మండలంలోనే అతి పెద్ద చెరువుగా పేరుపొందినది. దేవాదాయ శాఖ అధీనంలో ఉన్న ఈ చెరువును చేపల పెంపకానికై లీజుకు ఇచ్చేవారు. దీనివలన వచ్చే ఆదాయం గూడా అరకొరగా ఉండేది. ఈ చెరువును ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన "నీరు-చెట్టు" కార్యక్రమం క్రింద, 3 లక్షల రూపాయల అంచనా వ్యయంతో పూర్తిస్థాయిలో అభివృద్ధిచేయటానికి నిశ్చయించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చెరువుకట్టను 12 అడుగుల వెడల్పుతో విస్తరించి, కట్టకు ఇరువైపులా 2,000 మొక్కలు నాటటానికై ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతేగాక చెరువు కట్టపై నడకదారి (వాకింగ్ ట్రాక్) నిర్మించి, విద్యుద్దీపాలను ఏర్పాటుచేసి, సుందరీకరించెదరు. [10]

గ్రామ పంచాయతీ[మార్చు]

  1. ఈ గ్రామ తొలి సర్పంచిగా శ్రీ చోడవరపు మధుసూదనరావు బి.ఏ.,బి.ఎల్., 1936 నుండి 1956 వరకూ సేవలందించారు. ఈ 20 ఎకరాల ఆసామి, సర్పంచి పదవి ముగిసేనాటికి రెండున్నర ఎకరాల సన్నకారు రైతుగా మిగిలారు. తన స్వంత ఆస్తిని గ్రామాభివృద్ధికి వినియోగించారు. ఈ గ్రామానికి రహదారులూ, జిల్లా పరిసత్తు ఉన్నత పాఠశాల, ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి మొదలగు మౌలికసదుపాయాలు వీరి కృషి కారణంగానే సాధ్యమయ్యాయి. నీతికీ, నిజాయితీకీ వీరు మారు పేరుగా నిలిచారు. ఆయన నేటి తరానికి ఆదర్శం. [2]
  2. 2001 నుండి 2006 వరకూ ఈ గ్రామ పంచాయతీకి సర్పంచిగా శ్రీ అద్దేపల్లి జాన్ సన్ పనిచేశారు. వీరి హయాంలో వీరు గ్రామానికి మౌలిక వసతులు కల్పించటానికి విశేష కృషి చేశారు.
  3. 2006 నుండి ఈ గ్రామానికి సర్పంచిగా శ్రీ టెక్కెం సతీష్ కుమార్ పనిచేశారు. వీరి హయాంలో అభివృద్ధిలో ఉన్న గ్రామాన్ని ముందు వరసలో నిలిపారు. పంచాయతీ, రెవెన్యూ కార్యాలయ భవన నిర్మాణం, శుద్ధజల కేంద్రం ఏర్పాటయ్యాయి.
  4. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ తుమ్మల చంద్రశేఖరరావు సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ నక్కా శ్రీనివాసరావు ఎన్నికైనారు. [1]
  5. పైన వరసలో ( 2001,2006, 2013లలో సర్పంచులుగా ఎన్నికైనవారు) ముగ్గురూ ఈ గ్రామంలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకూ కలసి చదువుకున్నారు. [3]

ప్రముఖులు[మార్చు]

కోవెలమూడి సూర్యప్రకాశరావు

దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ చెన్నకేశవస్వామివారి ఆలయం[మార్చు]

ఈ ఆలయాన్ని సా.శ.13వ శతాబ్దంలో కాకతి గణపతిదేవుని పరిపాలన కాలంలో నిర్మించారు. శాసనంపై గణపతి దేవుడి సేనాధిపతి పోతన, తన తల్లిదండ్రుల పేర, చెన్నకేశవస్వామికి దానం చేసిన వివరాలు పొందుపరచినట్లు 2016,నవంబరు-15న పురాతత్వ శాస్త్త్రఙులు పరిశీలించి, వెల్లడించారు. ఇంతటి విలువైన వారసత్వ సంపద, ఆలయం బయట ఏవిధమైన రక్షణ లేకుండా పడియున్నది. [12]

శ్రీ హనుమత్, లక్ష్మణ సమేత శ్రీ సీతారామస్వామివారి ఆలయం[మార్చు]

కోలవెన్ను గ్రామంలో కొత్తపేటలో నూతనంగా నిర్మించనున్న ఈ దేవాలయ శంకుస్థాపన మహోత్సవం, 2014,మార్చి-12న వైభవంగా జరిగింది. గ్రామానికి చెందిన శ్రీ గానుగపాటి రామకృష్ణయ్య, శ్రీ కోలవెన్ను వీరయ్య అను ఇద్దరు భక్తులు, ఈ ఆలయనిర్మాణానికి అవసరమైన స్థలాన్ని విరాళంగా అందజేశారు. ఈ ఆలయాన్ని ఆరు లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించుచున్నారు. [6]

ఈ ఆలయంలో, ప్రతిష్ఠా కార్యక్రమాలు, 2015,మార్చ్-2వ తేదీ సోమవారం నాడు, వైభవంగా నిర్వహించారు. ఈ ఆలయానికి శ్రీ గానుగపాటి రామకృష్ణయ్య మనుమడు శ్రీ గానుగపాటి వెంకటరామారావు, విగ్రహాలను వితరణ చేసారు. కీ.శే. తుమ్మల ఆంజనేయులు ఙాపకార్ధం ఆయన కుటుంబీకులు, మిత్రులు, కీ.శే. తుమ్మల రామమోహనరావు, శారద దంపతుల ఙాపకార్ధం వారి కుమారుడు శ్రీ తుమ్మల చంద్రశేఖరరావు, అధిక మొత్తంలో విరాళాలు అందజేసినారు. [8]

శ్రీ సువర్చలా సమేత శ్రీ భక్తప్రపర్తి ఆంజనేయస్వామివారి దేవాలయం[మార్చు]

ఈ ఆలయం, కోలవెన్ను శివారు మాదాసువారిపాలెంలో ఉంది. 12 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ఆలయ అభివృద్ధి పనులు తుదిదశకు చేరుకున్నవి. ప్రహరీ నిర్మాణ పనులు పూర్తి అయినవి. 2017,జూన్-1వతేదీ నుండి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు ప్రారంభించి, 3వతేదీ నాడు, విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించెదరు. [13]

శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి ఆలయం[మార్చు]

భూమి వినియోగం[మార్చు]

కోలవెన్నులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 201 హెక్టార్లు
  • బంజరు భూమి: 1 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 1027 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 2 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 1026 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

కోలవెన్నులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 841 హెక్టార్లు
  • బావులు/బోరు బావులు: 185 హెక్టార్లు

ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ విశేషాలు[మార్చు]

కోలవెన్ను గ్రామంలో, 2014, జూలై-29 ఆదివారం నాడు, శ్రీ కోదండరామాలయ ప్రాంగణంలో, ఒకే కుటుంబానికి చెందిన 128 మంది, నాలుగు తరాలకు చెందిన వారంతా, ఒకేచోట కలుసుకున్నారు. వీరిలో ఏడాది వయసు నుండి 90 సంవత్సరాల వయసుగల వృద్ధుల వరకూ ఉన్నారు. వివిధ ప్రాంతాలలో, వివిధ రాష్ట్రాలలో. వివిధ దేశాలలో స్థిరపడిన వీరంతా తరలివచ్చి, ఒకేచోట చేరి, తమవారితో కలిసి ముచ్చట్లు చెప్పుకున్నారు, ఆడినారు, పాడినారు. గ్రామానికి చెందిన శ్రీ మేడూరి శ్రీనివాసాచార్యులు, హనుమాయమ్మ కుటుంబానికి చెందిన వీరంతా ఈ సమ్మేళనంలో పాల్గొన్నారు. దీనిలో భాగంగా ఆలయంలో ప్రత్యేకపూజలు చేసారు. "మాతృవందనం" పేరుతో తల్లులను సత్కరించారు. చిన్నారులకు ఆశీస్సులను అందజేసినారు. ఛలోక్తులతో విందారగించారు. ఒకరి అభిప్రాయాలను మరొకరు పంచుకున్నారు. పిల్లల చదువులను, ఉద్యోగాల గురించి ప్రస్తావించుకున్నారు. [7]

డాక్టర్ కంచర్ల రమేష్ స్వగ్రామం కోలవెన్ను గ్రామం. వీరు ఉన్నత విద్యనభ్యసించి, వృత్తిరీత్యా అమెరికాలోని చికాగో నగరంలో స్థిరపడినారు. వీరు తన తాత, తండ్రి ఆశయాల మేరకు, స్వగ్రామంపై మక్కువతో, లక్షల రూపాయల వ్యయంతో, గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుచూ, గ్రామాభివృద్ధికి తోడ్పడుచున్నారు. [11]

ఇవి కూడా చూడండి[మార్చు]

కోలవెన్ను (ఇంటిపేరు)

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4979. ఇందులో పురుషుల సంఖ్య 2458, స్త్రీల సంఖ్య 2521, గ్రామంలో నివాసగృహాలు 1291 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1230 హెక్టారులు.

మూలాలు[మార్చు]

  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

బయటి లింకులు[మార్చు]

[2] ఈనాడు విజయవాడ/పెనమలూరు; 2013,జులై-12; 1వపేజీ. [3] ఈనాడు విజయవాడ/పెనమలూరు; 2013,ఆగస్టు-5; 1వ పేజీ., & 2013,ఆగస్టు-11; 2వపేజీ. [4] ఈనాడు విజయవాడ/పెనమలూరు; 2013,నవంబరు-23; 2వపేజీ. [5] ఈనాడు కృష్ణా; 2014,మార్చ్-1; 1వపేజీ. [6] ఈనాడు విజయవాడ/పెనమలూరు; 2014,మార్చ్-13; 1వపేజీ. [7] ఈనాడు విజయవాడ; 2014,జులై-21; 16వపేజీ. [8] ఈనాడు విజయవాడ/పెనమలూరు; 2014,జులై-30; 2వపేజీ. [9] ఈనాడు అమరావతి; 2015,మే-19; 1వపేజీ. [10] ఈనాడు అమరావతి; 2015,ఆగస్టు-11; 33వపేజీ. [11] ఈనాడు అమరావతి/పెనమలూరు; 2016,మార్చ్-6; 2వపేజీ. [12] ఈనాడు అమరావతి; 2016,నవంబరు-16; 15వపేజీ. [13] ఈనాడు అమరావతి/పెనమలూరు;2017,మే-30; 2వపేజీ.