నెప్పల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నెప్పల్లి
—  రెవిన్యూ గ్రామం  —
నెప్పల్లి is located in Andhra Pradesh
నెప్పల్లి
నెప్పల్లి
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°24′38″N 80°48′20″E / 16.410542°N 80.805602°E / 16.410542; 80.805602
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం కంకిపాడు
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీ కొణతం గిరిధర్
జనాభా (2011)
 - మొత్తం 1,949
 - పురుషులు 948
 - స్త్రీలు 1,001
 - గృహాల సంఖ్య 602
పిన్ కోడ్ 521245
ఎస్.టి.డి కోడ్ 08676

నెప్పల్లి, కృష్ణా జిల్లా, కంకిపాడు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 245., ఎస్.టీ.డీ. కోడ్ = 08676.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 24 మీ.ఎత్తు

నెప్పల్లి ఉయ్యూరుకు ఆరు కి.మీ దూరంలో ఉంది.

సమీప గ్రామాలు[మార్చు]

ఈ గ్రామానికి సమీపంలో కుందేరు, ఆకునూరు, దావులూరు, పెదఓగిరాల, కోలవెన్ను గ్రామాలు ఉన్నాయి.

సమీప మండలాలు[మార్చు]

పెనమలూరు, తోట్లవల్లూరు, వుయ్యూరు, ఉంగుటూరు

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

విజయవాడ - బందరు రాష్ట్ర రహదారి ముఖ్య రవాణా మార్గము.

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల. మండల పరిషత్తు ఆదర్శ ప్రాథమిక పాఠశాల:- ఈ పాఠశాలలో 2016-17 విద్యా సంవత్సరంలో ఐదవ తరగతి చదివిన పోతురాజు శ్రావ్య అను విద్యార్థిని, 2017-18 సంవత్సరంలో నవోదయ పాఠశాలలో ఆరవ చదువుటకు ఎంపికైనది. ఈమె తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. [5]

గ్రామంలోని మౌలిక సదుపాయాలు[మార్చు]

పోస్ట్ ఆఫీసు.

గ్రామానికి త్రాగు/సాగునీటి సౌకర్యం[మార్చు]

కృష్ణా నది పై విజయవాడ వద్ద గల ప్రకాశం బ్యారేజి నుండి మొదలై కుడి కాలువ ఈ ఊరి రైతులకు అన్నపూర్ణగా వారి అభివృద్ధికి తోడ్పడుతున్నది.

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ కొణతం గిరిధర్ సర్పంచిగా టాస్ ద్వారా ఎన్నికైనారు. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శివాలయం[మార్చు]

ఇక్కడి "శివాలయం"లో అమ్మవారి దసరా ఉత్సవములు, సుమారు 65 సంవత్సరముల నుండి, ఈ ఊరిలో, అత్యంత వైభవముగా జరుగుతున్నవి. ఈ ఉత్సవములు వీక్షించుటకు చుట్టు ప్రక్క గ్రామాల ప్రజలు వచ్చెదరు. ఇందులో ముఖ్య ఆకర్షణలు హరికథ, బుర్రకథ, కోలాటము వంటి సాంస్కృతిక కార్యక్రమాలు.

శ్రీ లక్ష్మీతిరుపతమ్మ తల్లి ఆలయం[మార్చు]

ఈ ఆలయంలో అమ్మవారి వార్షికోత్సవం 2017, ఫిబ్రవరి-2వతేదీ గురువారంనాడు వైభవంగా నిర్వహించారు. ఉదయం నుండి భక్తులు తమ తమ మొక్కులు చెల్లించుకుని, ప్రత్యేకపూజలు నిర్వహింవ్చారు. అనంతరం ఉత్సవమూర్తులకు గ్రామోత్సవం నిర్వహించారు. తమ గ్రామంలో పంటలు బాగా పండాలనీ, గ్రామం సుభిక్షంగా ఉండాలనీ అమ్మవారిని కోరుకున్నారు. [4]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

ఈ ఊరి ప్రజల ముఖ్య ఎగుమతి వరి, చెరకు.

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

ఇక్కడ వ్యవసాయం ముఖ్య జీవనాధారం.

గ్రామ ప్రముఖులు[మార్చు]

ఈ ఊరు ఎందరో ప్రముఖులకు పుట్టినిల్లు.

గ్రామ విశేషాలు[మార్చు]

ఈ గ్రామంలో "స్వచ్ఛభారత్' కార్యక్రమం బాగా అమలుచేస్తున్నారు. ఒక సంవత్సరం లోపల గ్రామస్థులు 100% మరుదొడ్ల కార్యక్రమంలో సఫలీకృతులు కావడానికి విశేషకృషి చేస్తున్నారు. [3]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 1,949 - పురుషుల సంఖ్య 948 - స్త్రీల సంఖ్య 1,001 - గృహాల సంఖ్య 602

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1801.[2] ఇందులో పురుషుల సంఖ్య 881, స్త్రీల సంఖ్య 920, గ్రామంలో నివాస గృహాలు 478 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 333 హెక్టారులు.

మూలాలు[మార్చు]

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Kankipadu/Neppalli". Retrieved 19 June 2016. External link in |title= (help)
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-03.

బయటి లింకులు[మార్చు]

[2] ఈనాడు విజయవాడ; 2013, జూలై-28; 19వపేజీ. [3] ఈనాడు అమరావతి; 2015, మే-11; 21వపేజీ. [4] ఈనాడు అమరావతి/పెనమలూరు; 2017, మార్చి-3; 1వపేజీ. [5] ఈనాడు అమరావతి/పెనమలూరు; 2017, జూన్-30; 1వపేజీ.