తెన్నేరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తెన్నేరు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం కంకిపాడు
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీమతి కూచిపూడి మేరియమ్మ
జనాభా (201)
 - మొత్తం 3,646
 - పురుషులు 1,777
 - స్త్రీలు 1,869
 - గృహాల సంఖ్య 997
పిన్ కోడ్ 521260
ఎస్.టి.డి కోడ్ 08676

తెన్నేరు అనేది కృష్ణా జిల్లా లోని కంకిపాడు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 260., ఎస్.టి.డి.కోడ్ = 08676.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

ఈ గ్రామం విజయవాడ పట్టణానికి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. [1] సముద్రమట్టానికి 24 మీ.ఎత్తు.

సమీప గ్రామాలు[మార్చు]

విజయవాడ, తెనాలి, మంగళగిరి, హనుమాన్ జంక్షన్

సమీప మండలాలు[మార్చు]

పెనమలూరు, కంకిపాడు, మంగళగిరి, హనుమాన్ జంక్షన్

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

ఈ ఊరు విజయవాడ - మచిలీపట్నం రైలు మార్గంలో ఉంటుంది. తెన్నేరులో రైల్వేస్టేషన్ కలదు

రైలు వసతి[మార్చు]

బస్సు[మార్చు]

విజయవాడ నుంచి తెన్నేరుకు రావడానికి 220, 203T సిటీ బస్సు సౌకర్యం కూడా ఉంది.

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

ఈ ఊరిలో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు పాఠశాల ఉంది. ఈ ఊరినుంచి మిక్కిలినేని హరీష్, పేరేపి రాజేశ్వరి, సిరివల్లి అనే ముగ్గురు విద్యార్థులు మండలంలోనే అత్యుత్తమ మార్కులు సాధించి నూజివీడు ట్రిపుల్ ఐటిలో చదువుతున్నారు. చరితశ్రీ కాన్వెంటు, తెన్నేరు

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం[మార్చు]

తెన్నేరులో 1993లో పాల ఉత్పత్తిదారుల సంఘం ఏర్పడినది. 2 దశాబ్దాలుగా సేవలందించుచున్న ఈ కేంద్రం, లాభాల బాటలో పయనించుచున్నది. తద్వారా వచ్చే ఆదాయంతో ఈ కేంద్రానికి 1995లోనే స్వంతభవనం నిర్మించుకున్నారు. ఈ భవన నిర్మాణానికి, గ్రామం నడిబొడ్డున ఉన్న మూడు సెంట్ల భూమిని, శ్రీ అట్లూరి కోటేశ్వరరావు అను రైతు విరాళంగా అందజేసినారు. దీనికిగాను, అప్పటి విజయవాడ లోక్ సభ సభ్యులు శ్రీ వడ్డే శోభానాద్రీశ్వరరావు తన ఎం.పి నిధులద్వారా రు.50,000-00 అందించారు. ప్రస్తుతం ఈ కేంద్రములో పాలసేకరణ పారదర్శకత కొరకు, కచ్చితమైన కొలత, వెన్నశాతం నిర్ధారణకు గాను, కంప్యూటరు వ్యవస్థను సమకూర్చుకున్నారు. విద్యుత్తు సరఫరాలో అంతరాయం లేకుండా, ప్రత్యేకంగా, స్వంతముగా, ఒక సౌరవిద్యుత్తు వ్యవస్థను ఏర్పాటుచేసుకున్నారు. ఈ పథకం జిల్లాలోనే ప్రథమం. ఇక్కడ ప్రతి ఆరునెలలకొకసారి ధరవ్యత్యాసం (బోనస్) పంపిణీ జరుగుతున్నది. గత సంవత్సరం, నాలుగు లక్షల రూపాయల మేర బోనస్ పంపిణీ చేసారు. ఈ కేంద్రం ద్వారా, 2013-14 సంవత్సరంలో 11.11 లక్షల లీటర్ల పాలు సేకరించారు. ఇకడ పశుపోషకులకు గూడా పలు సేవలు, సదుపాయాలు అందజేయుచున్నారు. [5]

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

  1. కోమటిగుంట గ్రామం, తెన్నేరు గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.
  2. ఈ గ్రామ పంచాయతీకి 2013 జూలైలో జరిగిన ఎన్నికలలో శ్రీమతి కూచిపూడి మేరియమ్మ సర్పంచిగా గెలుపొందారు. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి ఆలయం[మార్చు]

ఈ గ్రామంలో ప్రతి సంవత్సరం ఫాల్గుణమాసంలో, శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తిరునాళ్ళు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఉత్సవాలలో భాగంగా, ఒక రోజు అమ్మవారి కళ్యాణం నిర్వహించెదరు. ఈ కళ్యాణం తిలకించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చెదరు. తరువాత ఉత్సవ మూర్తులను సాయంత్రం గ్రామ వీధులలో ఊరేగించెదరు. మరుసటి రోజు ఆలయంలో కుంకుమపూజలు నిర్వహించెదరు. ఈ వార్షిక తిరునాళ్ళు ఫాల్గుణ శుద్ధ పౌర్ణమితో ముగియును. ఈ సంబరాలు 1925వ సంవత్సరం నుంచి నిరంతరాయంగా జరుగుతున్నాయి. గ్రామంలో పాడిపంటలు బాగా ఉండాలనే ఉద్దేశంతో గ్రామ రైతు శ్రీ మాగులూరు బ్రహ్మయ్య, తన పంట పొలాలలో ఈ ఆలయం నిర్మించారు. ఈ ఆలయంలో జంతు, పక్షి బలి నిషేధం. [4]

శ్రీ బాలకొండలమ్మ అమ్మవారి ఆలయం[మార్చు]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

ఇక్కడ నివసించే ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం.

ప్రముఖులు[మార్చు]

  • తెన్నేటి సూరి
  • దేవినేని సీతారామయ్య:- ఛార్టర్డ్ అకౌంటింగ్ రంగ ప్రముఖులు.

గ్రామ విశేషాలు[మార్చు]

ఈ గ్రామంలో ఒక శతాధిక వోటు వీరుడు ఉన్నారు. శ్రీ దేవినేని గోపాలకృష్ణ చౌదరి, 1952 నుండి క్రమం తప్పకుండా, ఎన్నికలలో తన వోటు హక్కుని వినియోగించుకొనుచున్నారు. [3]

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3500.[2] ఇందులో పురుషుల సంఖ్య 1773, స్త్రీల సంఖ్య 1727, గ్రామంలో నివాస గృహాలు 922 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 737 హెక్టారులు.

మూలాలు[మార్చు]

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Kankipadu/Tenneru". Retrieved 19 June 2016. External link in |title= (help)
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-03.

బయటి లింకులు[మార్చు]

[2] ఈనాడు విజయవాడ/పెనమలూరు; 2013, ఆగస్టు-5; 1వపేజీ. [3] ఈనాడు కృష్ణా/పెనమలూరు; 2014, ఫిబ్రవరి-28; 2వపేజీ. [4] ఈనాడు విజయవాడ/పెనమలూరు; 2014, మార్చి-13; 1వపేజీ. [5] ఈనాడు విజయవాడ/పెనమలూరు; 2014, సెప్టెంబరు-22; 1వపేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=తెన్నేరు&oldid=2995987" నుండి వెలికితీశారు