ప్రొద్దుటూరు (కంకిపాడు)
ప్రొద్దుటూరు (కంకిపాడు) | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా |
మండలం | కంకిపాడు |
ప్రభుత్వము | |
- సర్పంచి | శ్రీ ఏడా కొండలరావు |
జనాభా (2011) | |
- మొత్తం | 2,441 |
- పురుషులు | 1,213 |
- స్త్రీలు | 1,228 |
- గృహాల సంఖ్య | 719 |
పిన్ కోడ్ | 521151 |
ఎస్.టి.డి కోడ్ | 08675 |
ప్రొద్దుటూరు, కృష్ణా జిల్లా, కంకిపాడు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 151., ఎస్.టి.డి.కోడ్ = 08675
గ్రామ చరిత్ర[మార్చు]
గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]
గ్రామ భౌగోళికం[మార్చు]
[1] సముద్రమట్టానికి 24 మీ.ఎత్తు
సమీప గ్రామాలు[మార్చు]
ఈ గ్రామానికి సమీపంలో కంకిపాడు, కోలవెన్ను, గొల్లగూడెం, చినపులిపాక, గొడవర్రు గ్రామాలు ఉన్నాయి.
సమీప మండలాలు[మార్చు]
పెనమలూరు, తోట్లవల్లూరు, వుయ్యూరు, గన్నవరం
గ్రామానికి రవాణా సౌకర్యం[మార్చు]
కంకిపాడు, పెనమలూరు,మానికొండ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: వియవాడ 22 కి.మీ
గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల. మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.
గ్రామంలోని మౌలిక సదుపాయాలు[మార్చు]
ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం[మార్చు]
గ్రామంలోని ఈ సంఘం, ప్రగతి అడుగులు వేస్తున్నది. సక్రమ నిర్వహణ, రైతులకు సేవలు, రుణాల మంజూరు, వసూళ్ళలో గత పదేళ్ళుగా జిల్లా స్థాయిలో ఉత్తమసంఘంగా గుర్తింపు పొందినది. ఎరువులు, విత్తనాలనూ, రైతులకు తగినంత పరిమాణంలో, ప్రభుత్వనిర్ధారిత ధరలకు అందుబాటులో ఉంచుతూ, సభ్యులకు చేదోడు వాదోడుగా ఉంటున్నది. 1939లో ప్రారంభించిన ఈ సంఘం, అంచెలంచెలుగా అన్ని వసతులు సమకూర్చటంలో సంఘప్రతినిధులూ, గ్రామస్తులూ సమష్టి సహకారం అందించారు. సంఘానికి స్వంత భవనం ఏర్పాటు చేసుకున్నారు. సంఘ పనితీరుకు మెచ్చిన కేంద్ర సహకార బ్యాంకు సంఘకార్యకలాపాలకు కంప్యూటరు వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ సంఘంలో సభ్యులుగా ఈ గ్రామం కాక ఇంకా దావులూరు, కొణతనపాడు, యార్లగడ్డవారిపాలెం ఉన్నాయి. సంఘంలో డిపాజిట్లు మొత్తం, ఎక్కడా లేనివిధంగా మూడు కోట్ల రూపాయలున్నవి.[2]
పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం (పాల కేంద్రం)[మార్చు]
గ్రామంలోని ఈ పాల కేంద్రం, జిల్లాలోనే ఉత్తమ కేంద్రాలలో ఒకటిగా పేరుపొందినది. గత 20 ఏళ్ళుగా లాభాల బాటలో పయనిస్తున్నది. ఏటా క్రమం తప్పకుండా డివిడెండు అందజేస్తున్నది. 1962లో ఏర్పడిన ఈ కేంద్రం, అప్పటినుండి, రైతులకు అన్నివిధాలుగా వెన్నుదన్నుగా నిలుస్తున్నది. అప్పట్లో, గ్రామం నడిబొడ్డున 4 సెంట్ల స్థలాన్ని కొని అందులో రు. 2.5 లక్షలతో భవనాన్ని నిర్మించారు. కంప్యూటర్ వ్య్వస్థను ఏర్పాటు చేశారు. రోజువారీ పాలసేకరణ, 500 లీటర్లకు చేరినది. [4]
గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]
గ్రామ పంచాయతీ[మార్చు]
- ఈ గ్రామ పంచాయతీ పరిధిలో కొణతనపాడు, యార్లగడ్డవారిగూడెం గూడా ఉన్నాయి.
- ఈ గ్రామ పంచాయతీకి 2013జూలైలో జరిగిన ఎన్నికలలో శ్రీ ఏడా కొండలరావు సర్పంచిగా ఎన్నికైనారు.[3]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]
శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామివారి ఆలయం (శివాలయం)[మార్చు]
శ్రీ కోదండరామస్వామివారి ఆలయం[మార్చు]
ప్రొద్దుటూరులోని గౌడబజారులో నెలకొన్న ఈ ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవాలు 2014,జూన్-14, శనివారం ప్రారంభించారు. ఈ ఉత్సవాలలో భాగంగా 2014,జూన్-15, ఆదివారం నాడు, ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఉత్సవ సంప్రదాయాన్ని పురస్కరించుకొని, గ్రామానికి చెందిన ఆడబడుచులు గ్రామానికి చేరుకున్నారు. వీరిరాకతో వారివారి ఇళ్ళలో సందడినెలకొన్నది. గ్రామంలో పండుగ వాతావరణం కనబడింది. విగ్రహ ప్రతిష్ఠామహోత్సవాన్ని, సోమవారం ఉదయం 8 గంటలకు కన్నులపండువగా నిర్వహించారు. వివిధ గ్రామాల నుండి వచ్చిన భక్తులతో గ్రామంలో అధ్యాత్మిక సందడి నెలకొన్నది. కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాలోగొన్నారు. శ్రీరామనామ స్మరణతో గ్రామం మారుమ్రోగినది. ధ్వజస్తంభాన్ని మచిలీపట్నంకు చెందిన శ్రీ కొండిశెట్టి హరినాధరావు దంపతులు విరాళంగా అందజేసినారు. ఈ సందర్భంగా నాలుగు వేలమంది భక్తులకు అన్నదానం నిర్వహించారు. [5]&[6]
గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]
వరి, అపరాలు, కాయగూరలు
గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]
వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
గ్రామ ప్రముఖులు[మార్చు]
గ్రామ విశేషాలు[మార్చు]
గణాంకాలు[మార్చు]
- జనాభా (2011) - మొత్తం 2,441 - పురుషుల సంఖ్య 1,213 - స్త్రీల సంఖ్య 1,228 - గృహాల సంఖ్య 719
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2318.[4] ఇందులో పురుషుల సంఖ్య 1152, స్త్రీల సంఖ్య 1166, గ్రామంలో నివాస గృహాలు 665 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 398 హెక్టారులు.
మూలాలు[మార్చు]
- ↑ "http://www.onefivenine.com/india/villages/Krishna/Kankipadu/Prodduturu". Retrieved 19 June 2016. External link in
|title=
(help) - ↑ ఈనాడు విజయవాడ/పెనమలూరు, 23 అక్టోబరు 2013. 1వ పేజీ.
- ↑ ఈనాడు విజయవాడ/పెనమలూరు, 11 ఆగష్టు 2013. 2వ పేజీ.
- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-03.
బయటి లింకులు[మార్చు]
[4] ఈనాడు విజయవాడ/పెనమలూరు; 2014,ఫిబ్రవరి-20; 1వపేజీ. [5] ఈనాడు విజయవాడ/పెనమలూరు; 2014,జూన్-16; 2వపేజీ. [6] ఈనాడు విజయవాడ/పెనమలూరు; 2014,జూన్-17; 2వపేజీ.