మద్దూరు (కంకిపాడు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మద్దూరు
—  రెవిన్యూ గ్రామం  —
మద్దూరు is located in Andhra Pradesh
మద్దూరు
మద్దూరు
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°24′08″N 80°43′41″E / 16.402142°N 80.728019°E / 16.402142; 80.728019
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం కంకిపాడు
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీ వల్లె సరసింహా రావు
జనాభా (2011)
 - మొత్తం 3,019
 - పురుషులు 1,521
 - స్త్రీలు 1,498
 - గృహాల సంఖ్య 912
పిన్ కోడ్ 521151
ఎస్.టి.డి కోడ్ 08676

మద్దూరు, కృష్ణా జిల్లా, కంకిపాడు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్: 521 151. ఎస్.టి.డి.కోడ్ = 08676.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

పూర్వము ఈ ఊరిలో మద్ది చెట్లు ఎక్కువగా ఉండడము వలన ఈ ఊరికి ఆ పేరు వచ్చినదని అంటారు.

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 24 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

ఈ గ్రామానికి సమీపంలో చినపులిపాక, గొడవర్రు, చోడవరం, కంకిపాడు, వణుకూరు, రొయ్యూరు, ప్రొద్దుటూరు గ్రామాలు ఉన్నాయి.

సమీప మండలాలు[మార్చు]

పెనమలూరు, తోట్లవల్లూరు, వుయ్యూరు, విజయవాడ

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

ఈ గ్రామంలో ఒక బస్ షెల్టరును 2015,మార్చి-14వ తేదీనాడు ప్రారంభించారు. దీనిని రావి లక్ష్మయ్య, మద్దినేని వెంకటేశ్వరరావుల ఙాపకార్ధం, వారి కుటుంబ సభ్యులైన మద్దినేని సాంబశివరావు ఆర్థిక సహాయంతో నిర్మించారు. [6] విజయవాడ రైల్వేస్టేషన్: 20 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

  1. జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
  2. మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో వల్లె సరసింహారావు సర్పంచిగా గెలుపొందారు. ఉపసర్పంచిగా యనమదల మదన్ మోహన్ ఎన్నికైనారు. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ మదనగోపాలస్వామివారి ఆలయం[మార్చు]

2014 ఫిబ్రవరి 3న ఆలయానికి ధ్వజస్తంభం ప్రతిష్ఠాపన జరిగింది. [3]

శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయం[మార్చు]

  1. మద్దూరు కరకట్టపై ఉన్న ఈ ఆలయాన్ని, 1992లో గ్రామస్థుల సహకారం, విరాళాలతో నిర్మించారు. [5]
  2. ఈ ఆలయాన్ని, 2015,మే నెల-19వ తేదీ బుధవారంనాడు, దేవాదాయశాఖ అధికారులు స్వాధీనపరచుకున్నారు. [6]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

గ్రామానికి చెందిన లింగాల సుబ్బారావు అనే విశ్రాంత ప్రభుత్వోద్యోగి ప్రోత్సాహంతో ఆయన కుమారుడు కృష్ణ దంపతులు లింగాల ఛారిటబుల్ ట్రస్టు ప్రారంభించారు. పలు సేవాకార్యక్రమాల్లో భాగంగా పేద విద్యార్థులకు సహకారం, గ్రామాభివృద్ధి వంటివాటికి కృషిచేస్తున్నారు. [4] ఈ గ్రామంలోని అర్హత కలిగిన కుటుంబాలవారందరికీ గ్యాస్ కనెక్షన్లు అందజేసి, ఈ గ్రామాన్ని పొగరహిత గ్రామంగా తీర్చిదిద్దినారు. [8]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 3,019 - పురుషుల సంఖ్య 1,521 - స్త్రీల సంఖ్య 1,498 - గృహాల సంఖ్య 912;

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3086.[2] ఇందులో పురుషుల సంఖ్య 1571, స్త్రీల సంఖ్య 1515, గ్రామంలో నివాస గృహాలు 799 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 927 హెక్టారులు.

మూలాలు[మార్చు]

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Kankipadu/Madduru". Retrieved 19 June 2016. External link in |title= (help)
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-03.

బయటి లింకులు[మార్చు]

[2] ఈనాడు విజయవాడ/పెనమలూరు; 2013,ఆగస్టు-1. [3] ఈనాడు విజయవాడ/పెనమలూరు; 2014,ఫిబ్రవరి-1; 1వపేజీ. [4] ఈనాడు విజయవాడ/పెనమలూరు; 2014, జూలై-19; 1వపేజీ. [5] ఈనాడు విజయవాడ/పెనమలూరు; 2014,డిసెంబరు-4; 2వపేజీ. [6] ఈనాడు విజయవాడ/పెనమలూరు; 2015,మార్చి-15; 1వపేజీ. [7] ఈనాడు అమరావతి; 2015,మే-21; 22వపేజీ. [8] ఈనాడు అమరావతి/పెనమలూరు; 2017,మే-21; 2వపేజీ.