ఆకునూరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆకునూరు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం ఉయ్యూరు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 3,207
 - పురుషులు 1,591
 - స్త్రీలు 1,616
 - గృహాల సంఖ్య 885
పిన్ కోడ్ 521345
ఎస్.టి.డి కోడ్ 08676

ఆకునూరు కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 245., యస్.టీ.డీ.కోడ్ = 08676.

శ్రీ కాకాని వెంకటరత్నం స్మారకార్ధం ఆకునూరు గ్రామంలో నెలకొల్పిన విగ్రహం

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 11 మీటర్ల ఎత్తు

గ్రామానికి రవాణా సౌకర్యం[మార్చు]

వుయ్యూరు, మానికొండ నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 28 కి.మీ

గ్రామంలోని విద్యా సౌకర్యాలు[మార్చు]

  1. ప్రభుత్వ జూనియర్ కళాశాల: ఈ కళాశాల వార్షికోత్సవం, 2016, జనవరి-29న నిర్వహించారు. [3]
  2. మండల పరిషత్తు (బి.సి) పాఠశాల:- ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఉప్పాల ఫణీంద్రకుమార్ జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికైనారు. 2015, సెప్టెంబరు-5వ తేదీనాడు, ఉపాధ్యా దినోత్సవం సందర్భంగా, కొత్తఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ చేతులమీదుగా వీరు ఈ పురస్కారం అందుకున్నారు. వీరు ఇంతకుమందు జిల్లా, రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందుకున్నారు. [2]

గ్రామంలోని మౌలిక సదుపాయాలు[మార్చు]

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

ఊర చెరువు:- మహత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా, గ్రామంలోని ఈ చెరువులో పూడీతీత పనులు జరుగుచున్నవి. చెరువును ఎండగట్టినారు. త్రవ్విన మట్టితో కట్టలను బలిష్టంచేస్తున్నారు. [4]

గ్రామ పంచాయతీ[మార్చు]

ఆకునూరు గ్రామ పంచాయితీ కార్యాలయ భవనం

ఆకునూరు గ్రామ పంచాయతీకి ఒక ప్రత్యేకత ఉంది. ఈ గ్రామంలో దివంగత కాకాని వెంకటరట్నం కుటుంబంలో ఇప్పటికే రెండు తరాలవారు గ్రామ పరిపాలన బాధ్యతలు నిర్వహించగా 2013 జూలైలో జరుగు ఎన్నికలలో మూడవ తరం ప్రతినిధిగా శ్రీ కాకాని విజయకుమార్ గ్రామ పంచాయతీ సర్పంచి పదవికి పోటీలో ఉన్నారు. ప్రత్యేకాంధ్ర ఉద్యమంలో ఉక్కు కాకానిగా పేరుగాంచిన శ్రీ కాకాని వెంకటరత్నం, 1934 నుండి 1937 వరకూ ఆకునూరు గ్రామ పంచాయతీ సర్పంచిగా వ్యవహరించారు. అనంతరం రాష్ట్ర మంత్రిగా, పీ.సీ.సీ అధ్యక్షులుగా పనిచేశారు. ఆ తరువాత ఆయన కుమారుడు శ్రీ కాకాని రామమోహనరావు 1964-1970 మధ్య ఈ గ్రామ సర్పంచిగా పనిచేశారు. తరువాత మండల వ్యవస్థ ప్రారంభం అయ్యాక, 1987 లో ఆయన ఉయ్యూరు మండలాధ్యక్షులుగా ఎన్నికైనారు. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ కాకాని రామమోహనరావు కుమారుడు శ్రీ కాకాని విజయకుమార్ సర్పంచిగా ఎన్నికైనారు. [1]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ రామలింగేశ్వరస్వామివారి ఆలయం[మార్చు]

నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో విగ్రహప్రతిష్ఠా కార్యక్రమం, 2017, జూన్-14వతేదీ బుధవారం నుండి 16వతేదీ శుక్రవారం వరకు వైభవంగా నిర్వహించెదరు. [5]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కూరగాయలు, తమలపాకులు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం

గ్రామ ప్రముఖులు[మార్చు]

కాకాని వెంకటరత్నం

గ్రామ విశేషాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 3,207 - పురుషుల సంఖ్య 1,591 - స్త్రీల సంఖ్య 1,616 - గృహాల సంఖ్య 885
జనాభా (2001) -మొత్తం 3243 -పురుషులు 1637 -స్త్రీలు 1606 -గృహాలు 826 -హెక్టార్లు 363

మూలాలు[మార్చు]

  1. "ఆకునూరు". Retrieved 23 June 2016. Cite web requires |website= (help)

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు విజయవాడ; 2013, జూలై-25; 6వపేజీ. [2] ఈనాడు అమరావతి; 2015, సెప్టెంబరు-12; 31వపేజీ. [3] ఈనాడు అమరావతి; 2016, జనవరి-30; 33వపేజీ. [4] ఈనాడు అమరావతి/పెనమలూరు; 2016, మే-15; 1వపేజీ. [5] ఈనాడు అమరావతి/పెనమలూరు; 2017, జూన్-15; 1వపేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=ఆకునూరు&oldid=2892345" నుండి వెలికితీశారు