కోవెలమూడి సూర్యప్రకాశరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కోవెలమూడి సూర్యప్రకాశరావు
Kovelamudu suryaprakasarao.jpg
కోవెలమూడి సూర్యప్రకాశరావు
జననం27 ఆగష్టు1914
మరణం1996
వృత్తితెలుగు సినిమా దర్శక నిర్మాత
పిల్లలుకె.రాఘవేంద్రరావు, కె.ఎస్.ప్రకాష్

కోవెలమూడి సూర్యప్రకాశరావు (1914 - 1996) తెలుగు సినిమా దర్శక నిర్మాతలలో ఒకడు. రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత. ఈయనకుమారుడు కె. రాఘవేంద్రరావు కూడా దర్శక నిర్మాత అయ్యాడు.

తొలి జీవితం[మార్చు]

సూర్యప్రకాశరావు 1914వ సంవత్సరం కృష్ణా జిల్లాకు చెందిన కోలవెన్నులో జన్మించాడు. ప్రాథమిక విద్యాభ్యాసము ముగించుకొని ప్రకాశరావు కొన్నాళ్ళు భీమా ఏజెంటుగాను, ఒక బంగారు నగల దుకాణములోను ఉద్యోగం చేశాడు. భారతీయ ప్రజా నాటక సంఘము యొక్క తెలుగు విభాగమైన ప్రజానాట్యమండలితో ప్రకాశరావు పనిచేసేవాడు.

సినీరంగ ప్రవేశం[మార్చు]

ప్రకాశరావు సినీజీవితాన్ని నటునిగా 1941లో గూడవల్లి రామబ్రహ్మం తీసిన అపవాదు సినిమాతోనూ, 1940లో నిర్మించినా 1942లో విడుదలైన పత్ని సినిమాతోనూ ప్రారంభించాడు. పత్ని సినిమాలో ఈయన కోవలన్ పాత్ర పోషించాడు. ఈయన 1942లో ఆర్.ఎస్.ప్రకాశ్ తీసిన బభ్రువాహన సినిమాలో కూడా నటించాడు. 1948లో ద్రోహి సినిమాతో సినీ నిర్మాణములో అడుగుపెట్టాడు. ఇందులో నాయకుని పాత్రకూడా ప్రకాశరావే పోషించాడు.నాయకిగా జి.వరలక్ష్మీ గారు నటించారు. స్వతంత్ర పిక్చర్స్ పతాకముపై విడుదలై విజవంతమైన ఈ సినిమాకు ఎల్వీ ప్రసాద్ దర్శకత్వం వహించాడు. ఆ తరువాత 1949లో పతాకము పేరు ప్రకాశ్ ప్రొడక్షన్స్‌గా మార్చి మొదటిరాత్రి, దీక్ష వంటి సినిమాలకు నిర్మించి దర్శకత్వం తానే వహించాడు. దాని తర్వాత ప్రకాశ్ ప్రొడక్షన్స్‌ను ఒక స్టూడియోగా అభివృద్ధి పరచి ప్రకాశ్ స్టూడియోస్‌గా నామకరణం చేశాడు.

1950లో ఈయన తీసిన సినిమాలు చాలామటుకు మెలోడ్రామాలు. ఆ తరువాత కాలములో ప్రేమనగర్ వంటి సైకలాజికల్ ఫాంటసీలను తీశాడు. ఈయన దర్శకత్వం వహించిన ప్రేమనగర్ సినిమా పెద్ద విజయం సాధించింది.

ఈయన పుట్టన కణగళ్ తీసిన నగర హావు (1972) అనే కన్నడ ప్రేమకథా చిత్రాన్ని తెలుగులో కోడెనాగుగా పునర్నిర్మించాడు. 1970వ దశకంలో కన్నడ సినిమాలు కూడా తీశాడు.

కుటుంబం[మార్చు]

ఈయన కొడుకు కె.రాఘవేంద్రరావు అత్యంత విజయవంతమైన కమర్షియల్ చిత్రాలను నిర్మించి తెలుగు చలనచిత్రరంగములో బాగా పేరుతెచ్చుకున్నాడు. ఇంకో కుమారుడు, కె.ఎస్.ప్రకాశ్ తెలుగు చిత్రరంగములో పేరొందిన ఛాయాగ్రాహకుడు.ఈయన అన్న కుమారుడు కె. బాపయ్య కూడా ప్రసిద్ధి పొందిన సినిమా దర్శకులు. ప్రముఖ సినీ నటి జి, వరలక్ష్మి గారు వీరి రెండవ భార్య

పురస్కారాలు[మార్చు]

1995 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈయనకు రఘుపతి వెంకయ్య అవార్డు ఇచ్చి సత్కరించింది.

మరణం[మార్చు]

ప్రకాశరావు గారు 1996 సంవత్సరంలో మరణించాడు.

చిత్ర సమాహారం[మార్చు]

నటించిన సినిమాలు[మార్చు]

 1. అపవాదు (1941)
 2. పత్ని (1942)
 3. బభ్రువాహన (1942)
 4. ద్రోహి (1948) --> కథానాయకుడిగా
 5. ప్రేమనగర్ (1971) --> చిన్న పాత్రలో

నిర్మించిన సినిమాలు[మార్చు]

 1. ద్రోహి (1948)
 2. మొదటిరాత్రి (1950)
 3. దీక్ష (1951)
 4. కన్నతల్లి (1953)
 5. బాలానందం (1954)
 6. అంతేకావాలి (1955)
 7. మేలుకొలుపు (1956)
 8. రేణుకాదేవి మహత్యం (1960)

దర్శకత్వం వహించిన సినిమాలు[మార్చు]

 1. మొదటిరాత్రి (1950)
 2. దీక్ష (1951)
 3. కన్నతల్లి (1953)
 4. బాలానందం (1954)
 5. అంతేకావాలి (1955)
 6. మేలుకొలుపు (1956)
 7. రేణుకాదేవిమాహాత్మ్యం (1960)
 8. స్త్రీజన్మ (1967)
 9. బందిపోటు దొంగలు (1968)
 10. భార్య (1968)
 11. విచిత్రకుటుంబం (1969)
 12. తాసిల్దారు గారి అమ్మాయి (1971)
 13. ప్రేమనగర్ (1971)
 14. ఇదాలోకం (1973)
 15. కోడెనాగు (1974)
 16. చీకటి వెలుగులు (1975)
 17. కొత్తనీరు (1982)

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

Lua error in package.lua at line 80: module 'Module:Navbox/configuration' not found.

Lua error in package.lua at line 80: module 'Module:Navbox/configuration' not found.