Jump to content

కోడెనాగు

వికీపీడియా నుండి
కోడెనాగు
(1974 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.ఎస్. ప్రకాశరావు
నిర్మాణం ఎం.ఎస్. రెడ్డి
కథ టి.ఆర్. సుబ్బారావు
తారాగణం శోభన్ బాబు,
లక్ష్మి,
చంద్రకళ
సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు
ఛాయాగ్రహణం కె.ఎస్.ప్రసాద్
కూర్పు కె.ఎ. మార్తాండ్
నిర్మాణ సంస్థ కౌముది పిక్చర్స్
భాష తెలుగు

కోడె నాగు 1974 లో వచ్చిన సినిమా. కెఎస్ ప్రకాష్ రావు దర్శకత్వంలో ఎంఎస్ రెడ్డి నిర్మించాడు. ఈ చిత్రంలో శోభన్ బాబు, లక్ష్మి, చంద్రకళ, జగ్గయ్య నటించారు.

ఒక హిందూ పురుషుడు, ఒక క్రైస్తవ స్త్రీ ప్రేమించుకుంటారు. కుల, వర్గ అవరోధాల కారణంగా వారు పెళ్ళి చేసుకోవడాం కష్టమని తెలుసుకున్న తరువాత, ఆత్మహత్య చేసుకుంటారు.

నటీనటులు

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • కథ: తళుకిన రామస్వామయ్య సుబ్బారావు
  • మాటలు: ఆత్రేయ
  • పాటలు: ఆత్రేయ, మల్లెమాల
  • సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
  • నేపథ్య గాయకులు: ఘంటసాల, పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
  • ఛాయాగ్రహణం: కె.ఎస్.ప్రసాద్
  • కళ: మోహన
  • కూర్పు: కె.ఎ.మార్తాండ్
  • నృత్యాలు: చిన్ని-సంపత్
  • దర్శకత్వం: కె.ఎస్.ప్రకాశరావు
  • నిర్మాత: ఎం.ఎస్.రెడ్డి

పాటలు

[మార్చు]
క్ర.సం. పాట రచన గాయకులు
1 ఇదే చంద్రగిరి శౌర్యానికి గీచిన గిరి ఇదే చంద్రగిరి తెలుగు జాతి చరితలోన చెరిగిపోని కీర్తి సిరి మల్లెమాల ఘంటసాల
2 అందాల గడసరివాడు అడగకుండా మనసిచ్చాడు ఆడపిల్ల కంతకన్న అందమేముంది ఆనందమేముంది మల్లెమాల పి.సుశీల
3 నాగుపాము పగ పన్నెండేళ్ళు నాలో రగిలే పగ నూరేళ్ళూ ఆత్రేయ ఘంటసాల
4 నాలో కలిసిపో నా ఎదలో నిలిచిపో కాచుకున్న కౌగిలిలో కప్పురమై కరిగిపో కరిగిపో ఆత్రేయ ఘంటసాల
5 సంగమం, సంగమం, అనురాగ సంగమం జన్మ జన్మ ఋణానుబంధ సంగమం మల్లెమాల ఘంటసాల, సుశీల
6 కథ విందువా నా కథ విందువా విధికి బదులుగ నువ్వు నా నుదుట వ్రాసిన కథ విందువా ఆత్రేయ సుశీల

విశేషాలు

[మార్చు]

కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీతయైన కన్నడ రచయిత త.రా.సు (టి.ఆర్.సుబ్బారావు) వ్రాసిన నాగరహావు, ఎరడు హెణ్ణు ఒందు గండు, సర్పమత్సర అనే మూడు నవలల ఆధారంగా పుట్టణ్ణ కణగాల్ దర్శకత్వంలో విష్ణువర్ధన్, ఆరతి, శుభ నటించిన నాగరహావు అనే కన్నడ చలనచిత్రాన్ని ఈ సినిమాగా పునర్మించారు.

మూలాలు

[మార్చు]
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అను పాటల సంకలనం నుంచి.
"https://te.wikipedia.org/w/index.php?title=కోడెనాగు&oldid=4209341" నుండి వెలికితీశారు