విష్ణువర్ధన్(నటుడు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విష్ణువర్ధన్
జననంసంపత్ కుమార్
(1950-09-18)1950 సెప్టెంబరు 18
నివాస ప్రాంతంమైసూరు, కర్నాటక
వృత్తిచలనచిత్ర నటుడు
మతంహిందూ మతం
భార్య / భర్తభారతి
పిల్లలుచందన, కీర్తి

విష్ణువర్ధన్ (18 సెప్టెంబరు 1950 – 30 డిసెంబరు 2009), ప్రముఖ భారతీయ నటుడు. ముఖ్యంగా కన్నడ సినిమాల్లో ఎక్కువగా నటించారు.[1] ఆయన అసలు పేరు సంపత్ కుమార్.[1] కన్నడహిందీ,  తెలుగుతమిళంమలయాళ భాషల్లో  దాదాపు 220కు పైగా  సినిమాల్లో నటించారు ఆయన.[2] 1972లో వంశవృక్ష సినిమాలో సహాయ నటుని  పాత్రతో తెరంగేట్రం చేశారు  విష్ణు. అదే ఏడాది  నాగరహావు సినిమాలో కథానాయక పాత్రలో నటించారు. ఈ  సినిమాతో కన్నడ సినీ రంగానికి  యాంగ్రీ యంగ్ మాన్ గా గుర్తింపు  తెచ్చుకున్నారు.[3] తన కెరీర్ లో ఎన్నో రకాల సినిమాల్లో వైవిధ్యమైన  పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు విష్ణు.[4][5][6][7]

2008లో సి.ఎన్.ఎన్.-బి.ఎన్.ఎన్ చానెల్ నిర్వహించిన పోల్ లో కన్నడ సినీ రంగంలో అత్యంత ప్రముఖ వ్యక్తిగా విష్ణువర్ధన్ ను పేర్కొంది.[8] బెంగళూరులోని బన్ శంకరీ ఆలయం నుంచి కంగేరీ వరకు ఉన్న 14.5 కిలోమీటర్ల పొడవైన రోడ్డుకు విష్ణు వర్ధన్ పేరు పెట్టారు. ఆసియాలో సెలబ్రిటీ పేరున పెట్టిన అతిపెద్ద రోడ్డు ఇదే కావడం విశేషం.[9][10] ఆయన మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకున్నారు. ది హిందూకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ "అది బ్రూస్ లీ యుగం అని చెప్పుకోవాలి. మా తరంలో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని, బాగా ప్రదర్శించగల  ఏకైక నటుడు కమల్ హాసనే. అతనికి అతనే సాటి" అని పేర్కొన్నారు.[11]

తొలినాళ్ళ జీవితం[మార్చు]

విష్ణువర్ధన్ మైసూరులో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు  నారయణరావు, కామక్షమ్మ. విష్ణు పూర్వీకులు కర్ణాటక, మండ్యా  జిల్లాలోని హళ్ళెగెరె ప్రాంతానికి చెందినవారు. ఆయన తండ్రి నటుడు, సంగీత దర్శకుడు, స్క్రిప్ట్ రచయితగా పనిచేసేవారు. సంగీత వాద్యాలను సేకరించడం ఆయన అభిరుచి. విష్ణు సోదరి రమ మైసూరు ప్యాలెస్ లో  కథక్ నృత్య కళాకారిణి. ఆయనకు ఆరుగురు తోబుట్టువులు. మైసూరు గోపాలస్వామి పాఠశాలలో ముందు చదువుకున్నారు విష్ణు. ఆ తరువాత  బెంగళూరులోని కన్నడ మోడల్ హైస్కూలులో చదువుకున్నారు. బసవన్ గుడిలోని నేషనల్ కళాశాలలో డిగ్రీ చదివారు.[12][13] 

వ్యక్తిగత జీవితం[మార్చు]

నటి భారతిని ఫిబ్రవరి 17, 1975న బెంగళూరులో వివాహం  చేసుకున్నారు విష్ణు. ఇద్దరు ఆడపిల్లలు కీర్తి, చందన లను దత్తత తీసుకున్నారు ఈ దంపతులు.[14]

సినిమారంగం[మార్చు]

కర్ణాటక రాష్ట్ర పురస్కారాలు
సంవత్సరము పురస్కారము చిత్రం ఇతర వివరాలు
1972-73 ఉత్తమ నటుడు నాగర హావు
1977-78 ఉత్తమ నటుడు హొంబిసిలు
1984-85 ఉత్తమ నటుడు బంధన
1990-91 ఉత్తమ నటుడు లయన్ జగపతి రావ్
1997-98 ఉత్తమ నటుడు లాలి
1998-99 ఉత్తమ నటుడు వీరప్ప నాయక
2009-10 ఉత్తమ నటుడు ఆప్త రక్షక
2008 డాక్టర్ రాజ్ కుమార్ రాష్ట్ర పురస్కారము జీవితకాల సాఫల్యము

పురస్కారాలు[మార్చు]

దక్షిణాది ఫిలింఫేర్ పురస్కారాలు
సంవత్సరము పురస్కారము చిత్రం ఇతర వివరాలు
1984 ఉత్తమ నటుడు బంధన
1988 ఉత్తమ నటుడు సుప్రభాత
1990 ఉత్తమ నటుడు ముత్తిన హార
1994 ఉత్తమ నటుడు నిష్కర్ష
2000 ఉత్తమ నటుడు యజమాన
2004 ఉత్తమ నటుడు ఆప్తమిత్ర

మూలాలు[మార్చు]