చంద్రకళ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
చంద్రకళ

చంద్రకళ తెలుగు సినిమా నటి.

చంద్రకళ చక్కని ముఖవర్ఛస్సుతో సాత్వికమైన అభినయాన్ని ప్రదర్శించి తెలుగువాళ్ళ మనసులను రంజింపజేసిన చక్కని నటి. తొలిరోజులలో ఆడపడుచు వంటి చిత్రాలలో చెల్లెలు పాత్రలో ఆమె చూపిన నటన వలన ఆమె, చెల్లెలు పాత్రకే బాగా నప్పుతుందనే ఇమేజ్ పొంది, నాయిక పాత్రల కన్నా నాయకుడి చెల్లెలు పాత్రలే ఎక్కువగా అభినయించవలసి వచ్చింది. ఆత్మీయులు, దొరబాబు, బంగారు బాబు వంటి చిత్రాలలో నాగేశ్వరరావుకి చెల్లెలుగా నటించింది. తెలుగు, తమిళం,కన్నడం, మలయాళం భాషలలో కూడా ఆమె ఎన్నో చిత్రాలలో నటించింది.

చంద్రకళ కేవలం అందమైన నటిగా మాత్రమే కాక ఎంతో చక్కని కూచిపూడి నృత్యం ప్రదర్శించిన కళా కారిణిగా కూడా ఆంధ్రదేశంలో చాలా మందికి తెలుసు. కేన్సర్ వ్యాధితో బాధ పడుతూ మద్రాసులో మరణించింది చంద్రకళ.

చంద్రకళ నటించిన చిత్రాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=చంద్రకళ&oldid=2065922" నుండి వెలికితీశారు