ఆత్మీయులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆత్మీయులు
(1969 తెలుగు సినిమా)
TeluguFilm Athmiyulu.jpg
దర్శకత్వం వి. మధుసూదనరావు
రచన యద్దనపూడి సులోచనారాణి
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
వాణిశ్రీ,
చంద్రమోహన్,
చంద్రకళ,
విజయనిర్మల,
సూర్యకాంతం,
ధూళిపాళ,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
పద్మనాభం,
ప్రభాకరరెడ్డి,
భాను ప్రకాష్
సంగీతం ఎస్.రాజేశ్వరరావు
నేపథ్య గానం ఘంటసాల, పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
గీతరచన ఆరుద్ర, దాశరథి
నిర్మాణ సంస్థ అన్నపూర్ణ క్రియేషన్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

ఆత్మీయులు 1969లో వి. మధుసూదనరావు దర్శకత్వంలో విడుదలైన కుటుంబ కథాచిత్రం. ఇందులో అక్కినేని నాగేశ్వర రావు, వాణిశ్రీ ముఖ్యపాత్రలు పోషించారు.

చిత్రకథ[మార్చు]

జగన్నాధం (గుమ్మడి) దగ్గర పాలేరుగా పనిచేస్తున్న వీరన్న (ధూళిపాల) కు ఒక కొడుకు సూర్యం (నాగేశ్వరరావు), ఒక కూతురు సీత (చంద్రకళ). జగన్నాధం ప్రాణాల్ని రక్షించే ప్రయత్నంలో వీరన్న చనిపోతాడు. పిల్లలిద్దరూ అనాథలౌతారు. జగన్నాధం పల్లె విడిచి పట్నం వెళ్ళిపోతాడు. పిల్లల ఆలనాపాలన కోసం డబ్బు పంపించినా అది వారికి చేరదు. కష్టపడి చదివి సూర్యం యూనివర్సిటీలోనే ఫస్ట్ గా వస్తాడు. సీత ఇంటి పనులను చక్కగా తీర్చుదిద్దుతుంది. నిజాన్ని తెలిసిన జగన్నాధం ఇద్దర్నీ తన ఇంటికి తీసుకొని వస్తాడు. జగన్నాధానికి ఒక కొడుకు చంద్రం (చంద్రమోహన్). రాజారావు కూతురు జయ (వాణిశ్రీ) సూర్యానికి దగ్గర కావడానికి ప్రయత్నిస్తుంది. సీత పనితనానికి ముచ్చటపడిన జగన్నాధం తన కొడుకు చంద్రాన్ని సీతతో వివాహం జరిపిస్తాడు.

పాత్రలు-పాత్రధారులు[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

  • కథ: యద్దనపూడి సులోచనారాణి
  • సంగీతం: ఎస్ రాజేశ్వరరావు
  • నృత్యం: తంగప్ప, పసుమర్తి కృష్ణమూర్తి
  • ఛాయాగ్రహణం: పి సెల్వరాజ్
  • కళ: జివి సుబ్బారావు
  • కూర్పు: ఎంఎస్ మణి
  • పోరాటాలు: రాఘవులు అండ్ పార్టీ
  • దర్శకత్వం: వి మధుసూధనరావు
  • నిర్మాత, కథ సినిమా అనుసరణ: దుక్కిపాటి మధుసూధనరావు

పాటలు[మార్చు]

  • ఓ చామంతి ఏమిటే ఈ వింత ఈ చినవానికి కలిగెనేల గిలిగింత లేని పులకింత - పి.సుశీల, ఘంటసాల
  • కళ్ళలో పెళ్ళి పందిరి కనబడసాగే పల్లకీలోన ఊరేగే ముహూర్తం మదిలో కదలాడే - పి.సుశీల, ఘంటసాల - రచన:శ్రీశ్రీ[1]
  • మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నొ చెలరేగే - రచన: దాశరథి కృష్ణమాచార్య - సంగీతం: సాలూరు రాజేశ్వరరావు - గానం: పి.సుశీల
  • అమ్మబాబు నమ్మరాదు ఈ రాలుగాయి - పి.సుశీల, ఘంటసాల
  • అన్నయ్య కలలే పండెను చెల్లాయి - పి.సుశీల, ఘంటసాల
  • ఈ రోజుల్లో పడుచువారు గడుసువారు వీలైతే - పి.సుశీల, ఘంటసాల బృందం
  • ఏం పిల్లో తత్తరబిత్తరగున్నావు ఎందుకో గాభరగీభర తిన్నావు - పిఠాపురం నాగేశ్వరరావు
  • చిలిపి నవ్వుల నిను చూడగానే వలపు పొంగేను నాలోనే - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
  • స్వాగతం ఓహో చిలిపి నవ్వుల శ్రీవారు సోగకనులు సైగ చేస్తే ఆగలేని - రచన: ఆరుద్ర[2] - గానం: పి.సుశీల

మూలాలు[మార్చు]

  1. సరోజా శ్రీశ్రీ (సంకలనం) (2001). ఉక్కుపిడికిలి - అగ్ని జ్వాల శ్రీశ్రీ సినిమా పాటలు (1 ed.). విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్. Retrieved 17 June 2020.
  2. కురిసే చిరుజల్లులో, ఆరుద్ర సినీ గీతాలు, 5వ సంపుటం, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 2003.
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.
  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)