యద్దనపూడి సులోచనారాణి
యద్దనపూడి సులోచనారాణి | |
|---|---|
| జననం | 1940 కాజ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ |
| మరణం | మే 18, 2018[1] కుపర్టినో, కాలిఫోర్నియా, అమెరికా |
| వృత్తి | నవలా రచయిత్రి |
| జాతీయత | భారతీయురాలు |
| కాల వ్యవధి | 1970–2018 |
| సాహిత్య ప్రక్రియ | శృంగారం, నాటకం, నవల |
యద్దనపూడి సులోచనారాణి తెలుగు రచయిత్రి. ఆలుమగల మధ్య ప్రేమలు, కుటుంబ కథనాలు రాయడంలో తనకు వేరెవరూ సాటిరారని నిరూపించిన ఆమె రచనలు అనేకం. ఈమె కథలు పలు సినిమాలుగా మలచబడ్డాయి. సులోచనారాణి 1940లో కృష్ణా జిల్లా మొవ్వ మండలములోని కాజ గ్రామములో జన్మించింది.
ఈమె రచనలు కేవలం సినిమాలుగానే కాక అనేక టీ.వీ. ధారావాహికలుగా రూపొందించబడ్డాయి.
జీవిత విశేషాలు
[మార్చు]ఈమె 1940లో కృష్ణా జిల్లా మొవ్వ మండలంలోని కాజా గ్రామంలో జన్మించారు. ఈమె సుమారు 75 నవలల వరకూ రచించారు.
సినిమాలుగా తీయబడ్డ నవలలు
[మార్చు]- మీనా (నవల)
- జీవన తరంగాలు
- సెక్రటరీ
- రాధాకృష్ణ
- అగ్నిపూలు
- చండీప్రియ
- ప్రేమలేఖలు
- బంగారు కలలు
- విచిత్రబంధం
- జై జవాన్
- ఆత్మ గౌరవం
- Gunturu Karaam
టీ.వీ. ధారావాహికలు, సీరియళ్ళు
[మార్చు]ఈ తరం కథ
[మార్చు]
|
|
మరణం
[మార్చు]అమెరికా కాలిఫోర్నియాలోని కుపర్టినోలో 2018, మే 18న గుండెపోటుతో మృతిచెందారు.[3]
యద్దనపూడి గురించి మృణాళిని అభిప్రాయం
[మార్చు]యద్దనపూడి సులోచనారాణి అంటే అందరికీ రెక్కలు చాచుకున్న కార్లు, ఆరడుగుల 'రాజశేఖర్'లూ, ముక్కుమీద కోపం ఉన్న 'రోజా'లు గుర్తుకొస్తారేమో... కానీ నాకు మాత్రం మెత్తని మాట, మందస్మితం, హుందాతనం, నిరాడంబరత్వం మూర్తీభవించిన ఆమె మూర్తిమత్వమే గుర్తుకొస్తుంది.
ఆమె పరిచయం కాకముందు, నా 12 ఏళ్ల వయస్సునుంచీ నన్ను ముంచెత్తినవి కూడా ఆ అద్భుతమైన ప్రేమ కథలే. ఆమె రచనలు వట్టి ప్రేమ కథలు కావు. ఆడపిల్లని కొత్తరకంగా, మనం కూడ అలా ఉండగలిగితే బాగుండు అనే రకంగా చూపించినవి. ఆమె మీద ఆరోపణ కూడ అదే. ఒక్కోసారి అనిపిస్తుంది. ఆమె ఆడపిల్లల్ని, అప్పటి తక్కిన రచయిత్రుల్లా 'బాధితులు' గా (విక్టిమ్స్) చూపించివుంటే ఆమెకు విమర్శకుల మన్ననలు కూడ లభించేవేమో? కానీ ఆమె ఏరోజూ ఆడపిల్లల్ని బాధితులుగా చూడలేదు. చూపలేదు.
చీమూ, నెత్తురూ ఉండి, సమస్యలను ఎదురెళ్లి మరీ ఢీకొన్న మొండిఘటాలుగానే చూపించింది. ఒకవేళ తమకు సమస్యలు లేకపోతే కొని తెచ్చుకునే పెంకితనం ఉన్న ఆడపిల్లలు వాళ్లు. ఆమె ఎవరికీ అనుభవంలోకి రాని, రాలేని 'కలల పురుషుడిని, స్వప్నలోకాన్ని' చూపించిందన్న ఆరోపణ మహామహుల నుంచి కూడ వస్తూంటుంది. నిజమే.. కానీ ఆడపిల్లలకు కలలు కనే హక్కును కూడ నిరాకరించే సమాజంలో కనీసం కథల్లోనైనా కలలు కనడం ఆనందం కాదూ?[4]
డా.చుండూరి మృణాళిని, తెలుగు యూనివర్శిటీలో రిటైర్డ్ ప్రొఫెసర్
బయటి లంకెలు
[మార్చు]- http://www.sakshi.com/main/Weeklydetails.aspx?Newsid=32409&Categoryid=10&subcatid=101 Archived 2020-11-27 at the Wayback Machine
- https://www.youtube.com/watch?v=iVVqUuQ1Qxk
యద్దనపూడి నవలా మాలిక
[మార్చు]-
జీవన తరంగాలు నవల
-
మౌన తరంగాలు నవల. రచయిత్రిని కూడ ఈ నవల ముఖచిత్రం మీద చూడవచ్చు
-
ఆహుతి నవల
-
ఒంటరి నక్షత్రం నవల
-
ప్రియసఖి నవల
మూలాలు
[మార్చు]- ↑ సుప్రసిద్ద రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి (78) మే 18న కన్నుమూశారు.[permanent dead link]
- ↑ Ruthuragalu Telugu Daily Serial - Episode 1. Loud Speaker. Retrieved 23 November 2024 – via YouTube.
- ↑ సాక్షి (21 May 2018). "యద్దనపూడి సులోచనారాణి కన్నుమూత". Archived from the original on 2018-05-22. Retrieved 21 May 2018.
- ↑ "యద్దనపూడి సులోచనా రాణి: 'హీరో'ల సృష్టికర్త". BBC News తెలుగు. Retrieved 2026-02-16.
- All articles with dead external links
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- 1940 జననాలు
- తెలుగు నవలా రచయితలు
- తెలుగు రచయిత్రులు
- కృష్ణా జిల్లా రచయిత్రులు
- తెలుగువారు
- 2018 మరణాలు
- కళారత్న పురస్కార గ్రహీతలు