సెక్రటరీ
స్వరూపం
సెక్రెటరీ చిత్రం 1976 లో సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై, నిర్మాత డీ.రామానాయుడు నిర్మించిన తెలుగు ఫ్యామిలీ డ్రామా చిత్రం.ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ,చంద్రమోహన్, గుమ్మడి, కాంచన, తదితరులు నటించారు. సంగీతం కె వి మహదేవన్ సమకూర్చగ , యద్దనపూడి సులోచనారాణి నవల ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
| సెక్రటరీ (1976 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | కె.ఎస్.ప్రకాశరావు |
|---|---|
| నిర్మాణం | డి.రామానాయుడు |
| కథ | యద్దనపూడి సులోచనా రాణి |
| తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ, జయసుధ, చంద్రమోహన్, కాంచన, సత్యనారాయణ, కృష్ణకుమారి, రంగనాథ్ శాంతకుమారి, గిరిజ |
| సంగీతం | కె.వి.మహదేవన్ |
| నేపథ్య గానం | వి.రామకృష్ణ, పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
| గీతరచన | ఆత్రేయ |
| సంభాషణలు | ఆచార్య ఆత్రేయ |
| నిర్మాణ సంస్థ | సురేష్ ప్రొడక్షన్స్ |
| భాష | తెలుగు |
తెలుగు సినిమా చరిత్రలో నవలలను ఆధారంగా చిత్రాలను నిర్మించి విజయం సాధించిన సంస్ధలు సురేష్,అన్నపూర్ణ సంస్ధలు. ఆ కోవలో సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన సెక్రటరీ సినిమా. యుధ్దనపూడి సులోచనారాణి రచించిన సెక్రటరీ నవల ఈ సినిమా కి ఆధారం.
తారాగణం
[మార్చు]- అక్కినేని నాగేశ్వరరావు_ రాజశేఖరం
- వాణీశ్రీ_జయంతి
- చంద్రమోహన్_ శివరాం
- గుమ్మడి వెంకటేశ్వరరావు_ డాక్టర్ సుబ్రహ్మణ్యం
- కైకాల సత్యనారాయణ_ కరుణాకరం
- అల్లు రామలింగయ్య_ రేఖ భర్త
- పుణ్యమూర్తుల రాజబాబు_ వాసు
- రంగనాథ్_ డాక్టర్ ప్రసాద్
- ధూళిపాళ_ వర్మ
- తిక్కవరపు సుబ్బరామిరెడ్డి_ ఎస్.పి.శివరాం రెడ్డి(అతిథి పాత్ర)
- దగ్గుబాటి రామానాయుడు_ డాక్టర్( అతిథి పాత్ర)
- జయసుధ_ ప్రమీల
- కాంచన_ రేఖారాణి
- కృష్ణకుమారి_ డాక్టర్ విజయలక్ష్మి
- హేమలత_ కామేశ్వరమ్మ
- శాంతకుమారి_ బామ్మ
- గిరిజ కరుణాకరం భార్య
- రమాప్రభ_ వాసంతి
- అన్నపూర్ణ_ సునంద
- రాధాకుమారి
- మమత
- కల్పనా రాయ్_ సర్వెంట్
- వై.విజయ
- మాస్టర్ రాము
- బేబీ రోహిణి.
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: కోవెలమూడి సూర్య ప్రకాశరావు
- కథ: యద్దనపూడి సులోచన రాణి
- చిత్రానువాదం: కె.ఎస్.ప్రకాశరావు
- సంగీతం: కె.వి.మహదేవన్
- సంభాషణలు: ఆచార్య ఆత్రేయ
- గీత రచయిత: ఆచార్య ఆత్రేయ
- నేపథ్య గాయకులు: పులపాక సుశీల, విస్సంరాజు రామకృష్ణ, శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం
- ఛాయా గ్రహణం: విన్సెంట్
- కూర్పు: కె.ఎ.మార్తాండ్
- నిర్మాత: దగ్గుబాటి రామానాయుడు
- నిర్మాణ సంస్థ: సురేష్ ప్రొడక్షన్స్
- విడుదల:28:04:1976.
పాటలు
[మార్చు]పాటల రచయిత ఆచార్య ఆత్రేయ.
- మనసులేని బ్రతుకొక నరకం, గానం. వి. రామకృష్ణ
- నా పక్కన చోటున్నది ఒక్కరికే , గానం. వి. రామకృష్ణ
- ఆకాశమంత పందిరి వేసి, గానం.వి.రామకృష్ణ, సుశీల
- చాటుమాటు సరసంలో, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
- మొరటోడు నా మొగుడు , గానం.వి.రామకృష్ణ, పి.సుశీల
- పెదవి విప్పలేను , గానం.వి.రామకృష్ణ , పి.సుశీల
- నేటిదా ఒకనాటిదా , గానం.వి.రామకృష్ణ , పులపాక సుశీల .