బందిపోటు దొంగలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బందిపోటు దొంగలు,1969 లో కె ఎస్. ప్రకాశరావు,దర్శకత్వంలో విడుదలైన తెలుగు చిత్రం. ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, జమున, జగ్గయ్య గుమ్మడి, ఎస్ వి.రంగారావు, కాంచన, మొదలగు వారు నటించిన ఈ చిత్రానికి సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు సమకూర్చారు.

బందిపోటు దొంగలు
(1969 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.ఎస్.ప్రకాశరావు
నిర్మాణం జె. సుబ్బారావు
జి. రాజేంద్రప్రసాద్
కథ కె.ఎస్.ప్రకాశరావు
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
జమున,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
ఎస్.వి. రంగారావు,
జగ్గయ్య,
నాగభూషణం,
కాంచన,
రాజబాబు
సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు
గీతరచన ఆరుద్ర, శ్రీశ్రీ, దాశరథి, సి.నారాయణ రెడ్డి
సంభాషణలు ఎన్.ఆర్.నంది
నిర్మాణ సంస్థ మాధవీ పిక్చర్స్
భాష తెలుగు

చిత్రకథ

[మార్చు]

యజమాని (ముక్కామల) వల్ల భార్య లక్ష్మి (జయంతి)కి అన్యాయం జరగటం, బిడ్డ మరణించటంతో సాధు స్వభావంకల మల్లయ్య (ఎస్‌వి రంగారావు) బందిపోటు దొంగ మల్లయ్యదొరగా మారతాడు. తూటా దెబ్బలు తగిలి డాక్టర్ చంద్రశేఖర్ (గుమ్మడి) వద్ద చికిత్స పొందుతాడు. అతని భార్య (రుక్మిణి) నుంచి వారి బాబును ఎత్తుకెళ్లి తన స్థానంలో తన కొడుకు కన్నయ్యగా పెంచుతాడు. మరో అనుచరుడు పాపన్న (త్యాగరాజు) కొడుకు నాగూ (జగ్గయ్య), వెంకన్న (సీతారాం) కూతురు మల్లి (కాంచన) అక్కడ పెరిగి పెద్దవారవుతారు. అంజి (రాజ్‌బాబు) కన్నయ్య (ఏఎన్నాఆర్)తో దోస్తీగా మసులుతాడు. ఒకసారి నాగూ, డాక్టర్ చంద్రశేఖర్ మేనకోడలు ఇందిర (జమున)ను అడ్డగించగా కన్నయ్య వారిస్తాడు. దయా దాక్షిణ్యాలు మనకు చేటు తెస్తాయని మల్లుదొర గతం చెప్పటంతో, కన్నయ్య మరింత రెచ్చిపోయి దోపిడీలు సాగిస్తాడు. పోలీసు కాల్పుల్లో గాయపడి డాక్టర్ చంద్రశేఖర్ వద్ద చికిత్సకు వెళ్తాడు కన్నయ్య. భుజంమీద పుట్టుమచ్చ చూసి తన కుమారుడని గ్రహించి అతనికి మానవత్వం, మంచితనం, గాంధీజీ ఆశయాలు బోధిస్తాడు. ఓ మంచి వ్యక్తిగా మార్చి పోలీస్ శిక్షణకు పంపుతాడు. పోలీస్ ఇన్‌స్పెక్టరుగా తిరిగి వచ్చిన కృష్ణ మల్లుదొరతో భేటీ అయ్యి లొంగిపొమ్మని కోరతాడు. తిరస్కరించిన మల్లుదొర అతని ముఠాతో సాగించిన పోరాటంలో నాగూ, అతని అనుచరులు మరణిస్తారు. మల్లుదొర మారిన మనసుతో పోలీసులకు లొంగిపోవడంతో సంస్కరించబడతాడు. చివరకు ఇందిర, కృష్ణల వివాహంతో చిత్రం సుఖాంతమవుతుంది[1].

పాత్రలు-పాత్రధారులు

[మార్చు]

పాటలు

[మార్చు]
  1. ఉన్నాడు ఒక చక్కని చిన్నోడు ఏడనో కాదమ్మా ఈడనే ఉన్నాడు - పి.సుశీల, రచన : సి నారాయణ రెడ్డి. (నటులు - కాంచన)
  2. ఓ ఓ కన్నయ్య పుట్టిన రోజు - పి.సుశీల, ఘంటసాల, జె.వి.రాఘవులు బృందం - రచన: శ్రీశ్రీ
  3. కిలాడి దొంగా డియో డియో నీ లలాయి అల్లరికి డియో - ఘంటసాల - రచన: ఆరుద్ర
  4. కిలాడి దొంగా డియో డియో నీ లలాయి బూటకం డియో - పి.సుశీల - రచన: ఆరుద్ర
  5. గాంధీ పుట్టిన దేశమురా ఇది గౌతమ బుద్ధుని వాసమురా (సాకీ) - ఘంటసాల
  6. గండరగండా షోగ్గాడివంటా కండలు తిరిగిన పోరగాడివంట - రచన :ఆరుద్ర ఎల్.ఆర్. ఈశ్వరి, పి.సుశీల
  7. విరిసిన వెన్నెలవో పిలిచిన కోయిలవో తీయని కోరికవో చెలీ చెలీ నీవెవరో - ఘంటసాల - రచన: దాశరథి కృష్ణమాచార్య
  8. విన్నానులే ప్రియా కనుగొన్నానులే ప్రియా మిసిమి వయసు, గుసగుసలన్నీ కొసరి విన్నానులే - ఘంటసాల, పి.సుశీల - రచన: డా. సి.నారాయణరెడ్డి

మూలాలు

[మార్చు]
  1. సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి (2 March 2019). "ఫ్లాష్ బ్యాక్ @ 50 బందిపోటు దొంగలు". ఆంధ్రభూమి దినపత్రిక. Retrieved 25 March 2019.
  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అను పాటల సంకలనం నుంచి.