Jump to content

మందాడి ప్రభాకర రెడ్డి

వికీపీడియా నుండి
(ప్రభాకర రెడ్డి నుండి దారిమార్పు చెందింది)
డాక్టర్. ప్రభాకర రెడ్డి
జననం
మందాడి ప్రభాకర రెడ్డి

(1935-10-08)1935 అక్టోబరు 8
మరణం1997 నవంబరు 26(1997-11-26) (వయసు 62)
విద్యవైద్యవిద్య
వృత్తినటుడు, రచయిత, వైద్యుడు
క్రియాశీల సంవత్సరాలు1960-1988
పిల్లలుగంగ, శైలజ, లక్ష్మి, విశాలాక్షి[1]
తల్లిదండ్రులు
  • లక్ష్మారెడ్డి (తండ్రి)
  • కౌసల్య (తల్లి)

ఎం. ప్రభాకర రెడ్డి గా ప్రసిద్ధులైన డాక్టర్ మందాడి ప్రభాకర రెడ్డి (అక్టోబర్ 8, 1935 - నవంబర్ 26, 1997) తెలుగు సినిమా నటుడు, కథా రచయిత. స్వతహాగా వైద్యుడు అయినా నటన పై గల అనురక్తితో చాలా తెలుగు చిత్రాలలో నటించాడు. కొన్ని హిందీ, తమిళ చిత్రాలలో కూడా నటించాడు. ఎక్కువగా ప్రతినాయక పాత్రలలో నటించాడు. 37 ఏళ్ల కెరీర్‌లో 500కు పైగా సినిమాల్లో నట్టించిన నటుడు, దర్శకుడు, నిర్మాత కూడా. కార్తీక దీపం వంటి అనేక సినిమాలకు కథలను అందించాడు.[2]

ఎన్టీఆర్, ఏఎన్నార్ సహా చిరంజీవి వరకు కూడా చాలా మంది సినిమాల్లో విలన్‌గానే కాకుండా అనేక పాత్రల్లో నటించాడు ప్రభాకర రెడ్డి. ఈయన కేవలం నటుడు మాత్రమే కాదు అంతకంటే అద్భుతమైన వైద్యుడు కూడా. ఓ వైపు వైద్యవృత్తితో పాటు నటనలోనూ సత్తా చూపించారు ఈయన. తెలుగు సినీ పరిశ్రమ ఒకప్పుడు మద్రాస్‌లోనే ఉండేది. 90ల మొదట్లో దాన్ని హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. దానికోసం ఎన్టీఆర్, ఏఎన్నార్ సహా చాలా మంది ఎంతో కృషి చేసారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో స్టూడియోలు నిర్మించడం.. సినిమా హాల్స్ కట్టడం లాంటివి చేసారు. అలాంటి సమయంలో ప్రభాకర రెడ్డి మాత్రం పేద సినీ కళాకారుల కోసం తన 10 ఎకరాల పొలం ఇచ్చేసారు. అది కూడా ఉచితంగా.. అలా కట్టుకున్న కాలనీనే ఇప్పుడు చెప్పుకుంటున్న చిత్రపురి కాలనీ. అందుకే దానికి ప్రభాకర రెడ్డి చిత్రపురి కాలనీ అంటారు. ఇక్కడ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నాడు ఆయన 10 ఎకరాలను దానం చేసాడు. అందుకనే హైదరాబాదు లోని మణికొండలో ఈయన స్మారకార్ధం డా. ప్రభాకరరెడ్డి చలనచిత్ర కార్మిక చిత్రపురికి ఈయన పేరుపెట్టారు.

జీవిత సంగ్రహం

[మార్చు]

ప్రభాకరరెడ్డి, సూర్యాపేట జిల్లా, తుంగతుర్తిలో లక్ష్మారెడ్డి, కౌసల్య దంపతులకు 1935, అక్టోబర్ 8 న జన్మించాడు. తుంగతుర్తిలో ప్రాథమిక విద్యాభ్యాసం తర్వాత హైదరాబాదులోని సిటీ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివాడు. 1955 నుండి1960 వరకు ఉస్మానియా వైద్య కళాశాలలో వైద్యవిద్యను అభ్యసించాడు. 1960లో గుత్తా రామినీడు దర్శకత్వం వహించిన చివరకు మిగిలేది సినిమాతో చిత్రరంగ ప్రవేశం చేశాడు. ఆ సినిమాలో ఒక మానసిక వైద్యుని పాత్ర పోషించాడు. ఈయన సినీ ప్రస్థానంలో మొత్తం 472 సినిమాల్లో నటించాడు. మంచి విజయాలను సాధించిన పండంటి కాపురం, పచ్చని సంసారం, ధర్మాత్ముడు, గృహప్రవేశం, గాంధీ పుట్టిన దేశం, కార్తీకదీపం, నాకు స్వతంత్రం వచ్చింది వంటి సినిమాలతో పాటు మొత్తం 21 తెలుగు సినిమాలకు కథలను అందించాడు.

1996లో కామ్రేడ్ అనే సినిమాకు కథను అందించి దర్శకత్వం వహించాడు. ఆ సినిమాలో కె.జి.సత్యమూర్తి, మాస్టర్జీ పాటలున్నాయి.

ప్రభాకరరెడ్డి 1997, నవంబరు 26[3] తేదీన తన 62వ యేట హైదరాబాదులో మరణించాడు.

పురస్కారాలు

[మార్చు]

నటించిన చిత్రాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పేరు నటించిన పాత్ర
1960 చివరకు మిగిలేది మానసిక వైద్యుడు
1961 పాండవ వనవాసం
1962 భీష్మ శంతనుడు
1962 మహామంత్రి తిమ్మరుసు వీరభద్ర గజపతి
1963 నర్తనశాల కర్ణుడు
1963 పునర్జన్మ
1963 శ్రీ కృష్ణార్జున యుద్ధం శివుడు
1964 బొబ్బిలి యుద్ధం
1966 నవరాత్రి పోలీస్ ఇన్ స్పెక్టర్
1966 పల్నాటి యుద్ధం కన్నమ నాయుడు
1967 శ్రీ కృష్ణావతారం బలరాముడు
1967 ఉమ్మడి కుటుంబం
1968 బ్రహ్మచారి
1968 వింత కాపురం రంగరాజు
1968 రణభేరి
1969 ఆత్మీయులు
1969 నాటకాల రాయుడు రామారావు, బుజ్జిబాబు అన్నయ్య
1969 భలే తమ్ముడు ఇన్ స్పెక్టర్ శేఖర్
1970 అక్కా చెల్లెలు సీనియర్ లాయర్
1970 పెళ్లి కూతురు
1970 హిమ్మత్
1970 లక్ష్మీ కటాక్షం రాజు
1971 మట్టిలో మాణిక్యం
1971 మోసగాళ్ళకు మోసగాడు
1971 బస్తీ బుల్ బుల్
1971 పెత్తందార్లు
1971 చలాకీ రాణి కిలాడీ రాజా దొంగలముఠా నాయకుడు
1972 బాల భారతం
1972 పండంటి కాపురం
1972 పాపం పసివాడు
1972 పిల్లా పిడుగా రీకు
1972 మావూరి మొనగాళ్ళు
1973 మాయదారి మల్లిగాడు
1973 సంసారం సాగరం
1974 అల్లూరి సీతారామరాజు మల్లుదొర
1974 అందరూ దొంగలే
1974 దీక్ష
1974 దేవదాసు
1975 ఎదురులేని మనిషి
1975 జేబుదొంగ
1976 ఉత్తమురాలు
1976 భక్త కన్నప్ప
1976 రామరాజ్యంలో రక్తపాతం
1977 కల్పన డాక్టర్
1977 ఖైదీ కాళిదాసు జగదీష్ చంద్ర ప్రసాద్
1977 దాన వీర శూర కర్ణ ధర్మరాజు
1977 యమగోల రమణమూర్తి/రామశాస్త్రి
1978 ఇంద్రధనుస్సు
1978 కటకటాల రుద్రయ్య
1978 అనుగ్రహం భైరవుని సేవకుడు
1978 తల్లే చల్లని దైవం
1978 సొమ్మొకడిది సోకొకడిది బ్లాక్ టైగర్
1979 గోరింటాకు
1979 కార్తీక దీపం కథా రచయిత, నటుడు : ధనుంజయ రావు
1979 రంగూన్ రౌడీ
1980 ఏడంతస్తుల మేడ
1980 నకిలీ మనిషి సి.ఐ.డి. ప్రభాకర్
1980 సర్దార్ పాపారాయుడు
1980 యువతరం కదిలింది
1981 కిరాయి రౌడీలు
1981 పార్వతీ పరమేశ్వరులు
1981 ప్రేమాభిషేకం
1981 తోడు దొంగలు
1981 హరిశ్చెంద్రుడు
1982 బొబ్బిలి పులి
1982 నా దేశం కైలాసం
1983 రుద్రకాళి
1984 అల్లుల్లు వస్తున్నారు
1984 అనుబంధం
1984 బాబులుగాడి దెబ్బ
1984 మెరుపు దాడి బహదూర్
1984 సత్య హరిశ్చంద్ర
1985 అగ్ని పర్వతం రుద్రయ్య
1985 బుల్లెట్
1985 చట్టంతో పోరాటం భారతి తండ్రి
1985 ఓ తండ్రి తీర్పు
1985 శ్రీ దత్త దర్శనం అత్రి
1987 విశ్వనాథ నాయకుడు
1987 వక్త్ కా షాహేన్షా
1988 అంతిమతీర్పు
1988 ఊరేగింపు
1988 చిన్నోడు పెద్దోడు
1989 శ్రీరామచంద్రుడు బంగారయ్య
1990 అన్న-తమ్ముడు
1990 చిన్న కోడలు
1991 అల్లుడు దిద్దిన కాపురం

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (25 July 2021). "'నాన్న మూడుసార్లు 'మా' అధ్యక్షుడిగా చేశాడు, వాళ్లకి పెన్షన్‌ ఇచ్చేవారు'". Archived from the original on 26 November 2022. Retrieved 26 November 2022.
  2. Chauhan, Ramesh (31 December 2016). "డాక్టర్ యాక్టర్... తెలంగాణ తేజం". Mana Telangana. Archived from the original on 26 November 2022. Retrieved 26 November 2022.
  3. "బహుముఖ ప్రతిభావంతుడు - హెచ్.రమేష్ బాబు - నవతెలంగాణ - సోపతి - 29-11-2015". Archived from the original on 2016-09-13. Retrieved 2020-06-18.