మహామంత్రి తిమ్మరుసు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మహామంత్రి తిమ్మరుసు
(1962 తెలుగు సినిమా)
దర్శకత్వం కమలాకర కామేశ్వరరావు
కథ పింగళి నాగేంద్రరావు
తారాగణం నందమూరి తారక రామారావు,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
ఎస్.వరలక్ష్మి ,
ముదిగొండ లింగమూర్తి,
రేలంగి వెంకట్రామయ్య ,
ముక్కామల,
దేవిక,
ఎల్. విజయలక్ష్మి,
రాజశ్రీ,
రాధాకుమారి,
మిక్కిలినేని,
ప్రభాకరరెడ్డి,
ధూళిపాళ,
శోభన్ బాబు,
ఎ.వి. సుబ్బారావు
సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు
నేపథ్య గానం ఘంటసాల,
పి. లీల,
పి. సుశీల,
ఎస్. వరలక్ష్మి
నృత్యాలు వెంపటి సత్యం,
బి. కందస్వామి
గీతరచన పింగళి నాగేంద్రరావు
సంభాషణలు పింగళి నాగేంద్రరావు
కళ మాధవపెద్ది గోఖలే
నిర్మాణ సంస్థ గౌతమీ ప్రొడక్షన్స్
భాష తెలుగు

మహామంత్రి తిమ్మరుసు 1962లో విడుదలైన తెలుగు చరిత్రాత్మక చిత్రం. దీనిలో తిమ్మరుసుగా గుమ్మడి వెంకటేశ్వరరావు, కృష్ణదేవరాయలుగా ఎన్.టి.రామారావు పోటీపడి అద్భుతంగా నటించారు.[1] ఈ కథను మూడుగంటల పాటు ఆసక్తికరంగా చెప్పడం ఒక ఎత్తు అయితే, కథ పరంగా తిమ్మరుసు(గుమ్మడి)కి, కథనం పరంగా రాయలు (ఎన్టీఆర్)కి సమ ప్రాథాన్యం ఇస్తూ సాగే జోడు గుఱ్ఱాల సవారీ మరొక ఎత్తు ఈ చిత్రం.[2] తిమ్మరుసు కన్నులు కాల్చివేసిన తరువాత రాయల పాత్రలో ఎన్.టి.రామారావు హుందాగా నటించారు, రాయలు శిక్ష విధించాలని తెలిసాక తిమ్మరుసు పాత్రలో ఉన్న గుమ్మడి తన అసమాన ప్రదర్శన ప్రదర్శించారు.[3]

1963: మహామంత్రి తిమ్మరుసు కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లోప్రదర్శితమైనది.

సంక్షిప్త చిత్రకథ

[మార్చు]

కృష్ణదేవరాయలు అదృశ్యంపై ప్రజలు చింతాక్రాంతులు కావడం మారువేషంలో రాయలు గమనించాడు. తిమ్మరుసు రాయల్ని రక్షించి పట్టాభిషిక్తుని చేస్తాడు. సంగీత విద్వాంసునిగా నటించి నాట్యకత్తె చిన్నమ ను ఆకర్షిస్తాడు. తిమ్మరుసు అనుమతి లేకుండా ఆమెను వివాహమాడతాడు. తిమ్మరుసు రాజనీతి కారణంగా పొరుగుదేశపు రాకుమారిని పెళ్ళాడతాడు. ఇరువురి రాణులతో ఉన్నపుడు తమను దాసీపుత్రులని హేళన చేశిన గజపతుల ప్రస్తావన వచ్చి ఆవేశపరుడై తిమ్మరుసును సంప్రదించకుండా గజపతుల పైకి దండయాత్రకు కటకానికి బయలు దేరతాడు. మధ్యలో కొండవీడు, కొండపల్లి ని జయిస్తాడు. గజపతి కుమారుడు రాయలను ముట్టడించగా సేనతో వచ్చి తిమ్మరుసు రక్షిస్తాడు. గజపతి రాకుమార్తె మారువేషంలో రాయలను గమనిస్తుంది. వేగుల ద్వారా రాకుమార్తె తనను ప్రేమిస్తుందని తెలుసుకున్న రాయలు మారువేషంలో కటకానికి వెళతాడు. రాకుమార్తెను కలిసి ఆమె మనోగతాన్ని తెలుసుకుంటాడు. తన ఆచూకీ గమనించిన గజపతి సోదరుని నుండి యుక్తిగా తప్పించుకుంటాడు. రాయల్ని అష్టదిగ్బంధం చేయటానికి పదహారు మంది పాత్రుల సహకారం కోరతాడు గజపతి. ఆ వ్యూహం ఫలిస్తే గజపతి ది పైచేయి ఔతుందని తెలిసి తిమ్మరుసు ప్రతివ్యూహంతో గజపతికి పాత్రులపట్ల అనుమానం కలిగించి వారిని గజపతి చేతిలో మట్టుపెట్టిస్తాడు. తప్పనిసరై గజపతి రాయల్ని అల్లుడుగా అంగీకరిస్తాడు. రాయల్ని హత్యచేయమని కుమార్తెను ప్రేరేపిస్తాడు. ఆత్మహత్య చేసుకోబోతున్న అన్నపూర్ణను తిమ్మరుసు కాపాడుతాడు. రాయలతో రాజధానికి వచ్చిన రాణి దగ్గరకు ఆమె చిన్నాన్న కుటిల మనసుతో చేరతాడు. రాయలకు తిమ్మరుసు కు మధ్య అగాధం సృష్టించే అనేక ప్రయత్నాలు చేస్తాడు. కొన్ని సార్లు సఫలీకృతుడౌతాడు. రాయలకు అన్నపూర్ణకు పుట్టిన కుమారుడు తిమ్మరుసుకు మాలిమి ఔతాడు. అతడి పట్టాభిషేకానికి ముహూర్తం కుదరనందున రాయల ప్రతిపాదనను తిమ్మరుసు అన్యమనస్కంగా అంగీకరిస్తాడు. రాయలు నగరంలో లేని సమయం లో రాకుమారుడు విషప్రయోగం వల్ల మరణిస్తాడు. ఆ నేరం తిమ్మరుసు మీద మోపబడుతుంది. రాయలు తిమ్మరుసు ను విచారించి కనుగుడ్లు కాల్పించే శిక్ష విధిస్తాడు. తిమ్మరుసు కనుచూపు పోయాక రాయలకు నిజం తెలుస్తుంది.

పాత్రలు-పాత్రధారులు

[మార్చు]
ధరించిన పాత్ర నటి / నటుడు
మహామంత్రి తిమ్మరుసు గుమ్మడి వెంకటేశ్వరరావు
కృష్ణదేవరాయలు నందమూరి తారక రామారావు
తిరుమల దేవి ఎస్. వరలక్ష్మి
అన్నపూర్ణా దేవి దేవిక
చిన్నా దేవి ఎల్. విజయలక్ష్మి
ప్రతాపరుద్ర జగపతి ముక్కామల కృష్ణమూర్తి
వీరభద్ర గజపతి ప్రభాకర రెడ్డి
గోవింద రాయలు శోభన్ బాబు
అల్లసాని పెద్దన ధూళిపాళ సీతారామశాస్త్రి
రేలంగి వెంకట్రామయ్య
హంవీరుడు ముదిగొండ లింగమూర్తి
రామలింగ నాయకుడు మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి
యెరుకలసాని రాజశ్రీ
కృష్ణవేణి రాధాకుమారి

పాటలు

[మార్చు]
పాట రచయిత సంగీతం గాయకులు నటీనటులు
ఆంధ్ర దేవా వెంకటేశ్వరా విరూపాక్ష స్వామీ చరిత్ర ఎరుగని మహాపాతకం మాదేశానికి పట్టినదా పింగళి నాగేంద్రరావు పెండ్యాల నాగేశ్వరరావు రాజశ్రీ
జయ అనరే జయ అనరే తెలుగు వెలుగులను నలుదెసలను నించే పింగళి నాగేంద్రరావు పెండ్యాల నాగేశ్వరరావు
జయవాణీ చరణ కమల సన్నిధి మన సాధన పింగళి నాగేంద్రరావు పెండ్యాల నాగేశ్వరరావు ఘంటసాల,లీల ఎన్టీయార్, విజయలక్ష్మి
తధాస్తు స్వాముల కొలవండి అస్తీ నాస్తుల తెలియండి పింగళి నాగేంద్రరావు పెండ్యాల నాగేశ్వరరావు ఘంటసాల ఎన్టీయార్, రేలంగి, రాజశ్రీ
తిరుమల తిరుపతి వేంకటేశ్వరా కూరిమి వరముల కురియుమయా పింగళి నాగేంద్రరావు పెండ్యాల నాగేశ్వరరావు పి.సుశీల, ఎస్.వరలక్ష్మి
మోహన రాగమహా మూర్తిమంతమాయే పింగళి నాగేంద్రరావు పెండ్యాల నాగేశ్వరరావు ఘంటసాల, పి.సుశీల ఎన్టీయార్, దేవిక
లీలా కృష్ణా నీ లీలలు నే లీలగనైనా తెలియదుగా పింగళి నాగేంద్రరావు పెండ్యాల నాగేశ్వరరావు ఎస్. వరలక్ష్మి ఎన్టీయార్, వరలక్ష్మి

పద్యం: తెలుగు దేల యన్న దేశంబు తెలుగు, ఘంటసాల . శ్రీకృష్ణ దేవరాయలు ఆముక్త మాల్యద నుండి

శ్రీ విద్యాపుర వజ్ర (పద్యం) ఘంటసాల, మాధవపెద్ది

మూలాలు

[మార్చు]
  1. ఆంధ్రభూమి. "నాకు నచ్చిన సినిమా (మహామంత్రి తిమ్మరుసు)". Retrieved 15 July 2017.
  2. నవతరంగం. "మహామంత్రి తిమ్మరుసు: చిత్రసీమయందు నీవె లెస్స". navatarangam.com. Archived from the original on 15 జూన్ 2017. Retrieved 15 July 2017.
  3. మహామంత్రి తిమ్మరుసు సమీక్ష. 29 July 1962. p. 9. Retrieved 18 July 2017.[permanent dead link]

బయటి లింకులు

[మార్చు]
  • Mahamantri Timmarasu at IMDb.
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.