Jump to content

తోడుదొంగలు (1981 సినిమా)

వికీపీడియా నుండి
తోడుదొంగలు
(1981 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.వాసు
తారాగణం కృష్ణ,
చిరంజీవి,
గీత
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ టి.వి. ఇంటర్నేషనల్
భాష తెలుగు

తోడు దొంగలు 1981 లో కె.వాసు దర్శకత్వం వహించిన తెలుగు చిత్రం.[1] ఈ చిత్రంలో కృష్ణ, చిరంజీవి, మధుమాలిని, గీత, రావు గోపాలరావు ముఖ్యమైన పాత్రల్లో నటించారు.

కృష్ణ (కృష్ణ), కిషోర్ (చిరంజీవి) లు స్నేహితులు. వారు ప్రజలను మోసాలు చేసి జీవిస్తూంటారు. కిషోర్ ఒక బార్‌లో గొడవ చెయ్యడం, ఈ సమస్యను పరిష్కరించడానికి కృష్ణ బార్ యజమానితో బేరసారాలాడడంతో సినిమా మొదలవుతుంది. తరువాత, వారు ఒక నకిలీ ప్రమాదాన్ని సృష్టించడం ద్వారా డబ్బు సంపాదించాలని ప్లాన్ చేస్తారు. కాని కిషోర్ ఆ కారును నడుపుతున్న జయ (గీత) వైపు ఆకర్షితుడవుతాడు. అతను తమ అసలు ఉద్దేశ్యాన్ని మరచిపోతాడు. కృష్ణ రేఖ (మధుమాలిని) ను కలుసుకుని ఆమెతో ప్రేమలో పడతాడు. రేఖ, రావు (రావు గోపాలరావు), రెడ్డి (ప్రభాకర్ రెడ్డి) ల వద్ద పనిచేస్తూటుంది. వారు ఒక నిధి గురించి రహస్యాలు తెలుసుకోవడానికి ఆమె తండ్రిని పట్టుకున్నారు. దాంతో ఆమె తప్పక వాఅరి వద్ద పనిచేస్తూంటుంది. కృష్ణ, కిషోర్‌లు వారి వేషాలను మారుస్తూ ఒక వ్యక్తిని పదేపదే మోసం చేస్తారు. కాని చివరికి వారు తాగిన మైకంలో పట్టుబడి జైలుకు పోతారు. జైలులో, భూపతి (సత్యనారాయణ) కుడిభుజాన్ని అని చెప్పుకునే మరో ఖైదీ వారిని బెదిరిస్తాడు. ఇద్దరు హీరోలు భూపతిపై తిరుగుబాటు చేస్తారు. భూపతి వారిపై దాడి చేస్తాడు. కాని వారి చేతుల్లో స్టార్ ఆకారపు పచ్చబొట్లు చూసి, వారు తన సొంత బిడ్డలే అని తెలుసుకుంటాడు. అతడు తన కథను వారికి చెబుతాడు.

భూపతికి అతని స్నేహితుడు కాంతారావు సహాయం చేస్తాడు. కాని కాంతారావును రావు, రెడ్డి మోసం చేసి చంపేసి, ఆ నేరాన్ని భూపతిపై మోపుతారు. తండ్రీ కొడుకులు వారికి ఒక పాఠం నేర్పించి రేఖ తండ్రి సీతారామయ్యను విడుదల చేయాలని నిర్ణయించుకుంటారు.

రేఖను ఉపయోగించి కృష్ణ రావు ముఠాలో చేరతాడు. కిషోర్ రెడ్డి కుమార్తె జయ సహాయంతో రెడ్డి ముఠాలో చేరతాడు. రావి, రెడ్డి ఒకరినొకరు ద్వేషించేలా కుట్రలు చేస్తారు. కాని రావు రెడ్డి ఏకమౌతారు. మానసిక వికలాంగుడైన రావు కొడుకును కిడ్నాప్ చేసి సీతారామయ్యను విడుదల చేయించే ప్రయత్నంలో హీరోలు పట్టుబడతారు. వారు తప్పించుకుని, జయ సహాయంతో రావు కొడుకును ఉపయోగించుకుని సీతారామయ్య ఆచూకీ తెలుసుకుంటారు. ఒక పాట ఒక ఫైటు తరువాత, వారు సీతారామయ్యను విడుదల చేసి ఇంటికి తిరిగి తీసుకువస్తారు. కాని కిషోర్ రావు, రెడ్డి మనుషులకు పట్టుబడతాడు. కృష్ణ కూడా వారి పన్నాగంలో చిక్కుకొని వారి గుహలోకి వెళ్తాడు. అక్కడ క్లైమాక్స్ పోరాటంలో భూపతి వారికి సహాయపడుతాడు. చివరికి రావు, రెడ్డిలను పోలీసులు అరెస్టు చేస్తారు. భూపతి కుటుంబం తిరిగి ఏకమవుతుంది.

తారాగణం

[మార్చు]

నిర్మాణంలో, విడుదలలో పాలుపంచుకున్న సంస్థలు

[మార్చు]
  • ప్రొడక్షన్ కంపెనీ: టీవీ ఇంటర్నేషనల్
  • పంపిణీదారులు: లక్ష్మి ఫిల్మ్స్ (ఆంధ్ర & నైజాం), లక్ష్మీ ధరణి కంబైన్స్ (సెడెడ్), శ్రీ సత్యసాయి ఫిల్మ్స్ (నెల్లూరు), రాధిక ఫిల్మ్స్ (గుంటూరు), ఉషా పిక్చర్స్ (గోదావరి జిల్లాలు), స్వస్తిక్ కంబైన్స్ (కర్ణాటక)
  • రికార్డింగ్ & రీ-రికార్డింగ్: విజయ గార్డెన్స్
  • స్టూడియోస్: విజయ వాహిని స్టూడియోస్, వీనస్ & ఎవిఎం స్టూడియోస్
  • అవుట్ డోర్ యూనిట్: శారదా ఎంటర్ప్రైజెస్
  • ఫిల్మ్ ప్రాసెసింగ్: జెమిని కలర్ ల్యాబ్

పాటల జాబితా

[మార్చు]

1.అల్లరి మల్లెల ఆవిరిలో అందాలందిన, రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం,శైలజ, ఎం.రమేష్, పి సుశీల

2.ట్వింకిల్ ట్వింకిల్ తారా నా జిమ్ జిమ్ తార, రచన: వేటూరి, గానం ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల

3.డూప్ డూప్ డూప్ పాత్ పాత్ చెయ్యాలి, రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,మాధవపెద్ది రమేష్

4.భూమి గుండ్రంగా. ఉంది ప్రేమ పదిలంగా ఉంది, రచన: మైలవరపు గోపి, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

5.ముందు చూస్తే నుయ్యి వెనకాల చూస్తే గొయ్యి, రచన: వేటూరి, గానం.పి . సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

6.వయసు ముసిరెను మనసు మెరిసేను, రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, శిష్ట్లా జానకి

7.శ్రీహరికోట రాకెట్ తీపి మిఠాయి ప్యాకెట్, రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల.

మూలాలు

[మార్చు]
  1. ఎస్.వి, శ్రీనివాస్ (2009). Megastar: Chiranjeevi and Telugu Cinema After N.T. Rama Rao. న్యూ ఢిల్లీ: ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్. pp. 243. ISBN 0195693086.

2.ఘంటసాల, గళామృతము,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.