కె.వాసు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కె.వాసు
జననం
కొల్లి శ్రీనివాసరావు

జనవరి 7, 1951
మరణం2023 మే 26(2023-05-26) (వయసు 72)
జాతీయతభారతీయుడు
వృత్తిదర్శకుడు, నిర్మాత
జీవిత భాగస్వామిరత్నకుమారి
పిల్లలుఇద్దరమ్మాయిలు అన్నపూర్ణ, దీప్తి
తల్లిదండ్రులు
బంధువులుకొల్లి హేమాంబరధరరావు (బాబాయ్)
చలసాని శ్రీనివాసరావు (మేనమామ)

కె.వాసుగా పిలువబడే కొల్లి శ్రీనివాసరావు (1951 జనవరి 7 - 2023 మే 26) దర్శక నిర్మాత. ఇతని తండ్రి దర్శకుడు కె.ప్రత్యగాత్మ. మరొక దర్శకుడు కె.హేమాంబరధరరావు ఇతని బాబాయి.

ఎన్నో విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన అయ్యప్పస్వామి మహత్యం, శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం వంటి సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌హిట్స్‌ అందుకున్నాయి. పైగా ఈ సినిమాల్లోని భక్తిపాటలు ఎప్పటికీ అజరామరం.

జీవిత విశేషాలు[మార్చు]

ఇతడు 1951, జనవరి 7వ తేదీన హైదరాబాదులో కె.ప్రత్యగాత్మ, సత్యవతి దంపతులకు జన్మించాడు. ఇతని తల్లిదండ్రులిద్దరూ కమ్యూనిస్టు ఉద్యమ నేపథ్యం నుండి వచ్చినవారు. ఇతని మేనమామ చలసాని శ్రీనివాసరావు గొప్ప కమ్యూనిస్టువాది. అతడు పోలీసు ఎన్‌కౌంటర్‌లో మరణించిన సంవత్సరానికి ఇతడు జన్మించాడు. ఆయన జ్ఞాపకార్థం ఇతనికి శ్రీనివాసరావు అని నామకరణం చేశారు. ఇతని తాత కోటయ్య గుంటూరులో ఋషీకేశ్ ఆశ్రమాన్ని స్థాపించాడు. వాసు పదవ తరగతి వరకు మద్రాసులోని కేసరి హైస్కూలులో చదివాడు. తరువాత మెట్రిక్యులేషన్ కొరకు గుంటూరు, హైదరాబాదులలో చదివాడు. కానీ ఇతనికి చదువు అబ్బలేదు. ఇతని బాబాయి కె.హేమాంబరధరరావు ఇతనికి తన సినిమాలలో అప్రెంటీస్‌గా చేర్చుకున్నాడు. తరువాత ఛాయాగ్రాహకులు ఎం.జి.సింగ్, ఎం.సి.శేఖర్‌ల వద్ద రెండేళ్ళు కెమెరా అసిస్టెంట్‌గా, ఎడిటర్ బి.గోపాలరావు వద్ద కూర్పు అసిస్టెంట్‌గా ఒక సంవత్సరం పనిచేశాడు. తరువాత తన తండ్రి ప్రత్యగాత్మ వద్ద ఆదర్శకుటుంబం, మనసు మాంగల్యం, పల్లెటూరి బావ సినిమాలకు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. తరువాత ఆడపిల్లల తండ్రి సినిమాకు తొలిసారి 22యేళ్ల పిన్నవయసులో దర్శకత్వం వహించి స్వంతంగా నిర్మించాడు.

ఆయన 1982లో రత్నకుమారిని వివాహం చేసుకున్నాడు. వీరికి అన్నపూర్ణ, దీప్తి అనే ఇద్దరరు అమ్మాయిలు జన్మించారు.

సినిమారంగం[మార్చు]

ఇతడు పనిచేసిన సినిమాల వివరాలు:

సంవత్సరం సినిమా పేరు నిర్మాత నటీనటులు ఇతర వివరాలు
1974 ఆడపిల్లల తండ్రి కె.వాసు నాగభూషణం, కృష్ణంరాజు, భారతి దర్శకత్వం, నిర్మాణం, రచన మూడురంగాలలో తొలి సినిమా తీసిన అతిపిన్నవయస్కుడిగా రికార్డు
1978 ప్రాణం ఖరీదు క్రాంతికుమార్ చిరంజీవి, జయసుధ, చంద్రమోహన్, మాధవి, నూతన్ ప్రసాద్, రావు గోపాలరావు చిరంజీవి, కోట శ్రీనివాసరావుల తొలి సినిమా
1979 ఏది పాపం? ఏది పుణ్యం? కె.మహేంద్ర చంద్రమోహన్, మాధవి
1979 ఒక చల్లని రాత్రి డి.రామానాయుడు చంద్రమోహన్, మాధవి
1979 ముద్దూముచ్చట గిరిబాబు మురళీమోహన్, గీత,శ్రీధర్,శారద
1979 కోతల రాయుడు తమ్మారెడ్డి భరద్వాజ చిరంజీవి, మాధవి, గిరిబాబు, హేమసుందర్
1980 ఆరని మంటలు కె.మహేంద్ర చిరంజివి, కవిత, సుభాషిణి
1980 సరదా రాముడు రియాజ్ భాషా నందమూరి తారకరామారావు, జయసుధ, కాంతారావు
1980 గోపాలరావు గారి అమ్మాయి కె.సి.శేఖర్‌బాబు రావు గోపాలరావు, జయసుధ, చంద్రమోహన్
1981 దేవుడు మామయ్య దేవినేని వెంకట్రామయ్య, బద్రీనాథ్ శోభన్ బాబు, వాణిశ్రీ, జగ్గయ్య
1981 పక్కింటి అమ్మాయి కె.సి.శేఖర్‌బాబు, ఎ.సారథి చంద్రమోహన్, జయసుధ, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,చక్రవర్తి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం పూర్తి నిడివి గల పాత్రను పోషించిన తొలి సినిమా.
1982 కలహాల కాపురం వడ్డే రమేష్ చంద్రమోహన్, సరిత, రావు గోపాలరావు
1984 అల్లుళ్ళొస్తున్నారు కిలారి బాబూరావు చిరంజీవి, చంద్రమోహన్, గీత, సులక్షణ, ప్రభాకర్ రెడ్డి
1984 కొత్త దంపతులు నరేష్, పూర్ణిమ, శుభలేఖ సుధాకర్
1984 బాబులుగాడి దెబ్బ వడ్డే రమేష్ కృష్ణంరాజు, శ్రీదేవి, రాధిక
1985 అమెరికా అల్లుడు రమేష్ సుమన్, భానుప్రియ, కాంతారావు అమెరికాలో చిత్రీకరించబడిన తొలి తెలుగు సినిమా
1985 శ్రీ షిర్డీ సాయిబాబా మహాత్మ్యం గోగినేని ప్రసాద్ విజయ చందర్, చంద్రమోహన్, అంజలీదేవి
1989 అయ్యప్పస్వామి మహాత్మ్యం అంజనీకుమార్, కుమార్జీ శరత్ బాబు, షణ్ముఖ శ్రీనివాస్, పండరీబాయి
1990 చిన్న కోడలు జి.ఆదిశేషగిరిరావు, జి.హనుమంతరావు సురేష్, వాణీ విశ్వనాథ్
1991 ఆడపిల్ల చెరుకూరి సత్యనారాయణ శరత్ బాబు, వాణీ విశ్వనాథ్, హరీష్
1991 పల్లెటూరి పెళ్ళాం జి.ఆదిశేషగిరిరావు, జి.హనుమంతరావు వాణీ విశ్వనాథ్
1991 ప్రేమ చిత్రం పెళ్ళివిచిత్రం నరేష్, ఏక్తా
1991 పిచ్చి పుల్లయ్య
1992 జోకర్ మామ సూపర్ అల్లుడు కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం
1992 పుట్టినిల్లా మెట్టినిల్లా భానుచందర్, మధుబాల
2004 ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి అల్లు అరవింద్ శ్రీకాంత్, ప్రభుదేవా,ఆర్తి చాబ్రియా, ఊర్వశి
2008 గజి బిజి కె.వాసు వేణుమాధవ్,ఫర్జానా,కృష్ణ భగవాన్, బ్రహ్మానందం,జీవా, ఎం.ఎస్.నారాయణ

మరణం[మార్చు]

అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్న 72 ఏళ్ల కె.వాసు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2023 మే 26న తుదిశ్వాస విడిచాడు.[1]

మూలాలు[మార్చు]

  1. "K Vasu: ప్రముఖ దర్శకుడు కె.వాసు కన్నుమూత | famous director k vasu passed away". web.archive.org. 2023-05-26. Archived from the original on 2023-05-26. Retrieved 2023-05-26.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
"https://te.wikipedia.org/w/index.php?title=కె.వాసు&oldid=3916380" నుండి వెలికితీశారు