మాధవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మాధవి
జననం
కనక విజయలక్ష్మి

(1962-09-14) 1962 సెప్టెంబరు 14 (వయసు 61)
హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్
ఇతర పేర్లుమాధ్వి
జీవిత భాగస్వామిరాల్ఫ్ శర్మ
పిల్లలుటిఫనీ
ప్రిసిల్లా
ఎవలిన్

మాధవి (ఆంగ్లం: Madhavi) దక్షిణ భారత సినీ నటీమణి. ఈమె 17 సంవత్సరాల నిడివిలో దక్షిణాదిలోని నాలుగు భాషలు తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళం భాషా చిత్రాలతో పాటు అనేక హిందీ భాషా చిత్రాలలో కూడా నటించింది.

దర్శకుడు కె.బాలచందర్ 1979లో అత్యద్భుత విజయం సాధించిన మరో చరిత్ర సినిమాతో చిత్రరంగానికి పరిచయం చేశాడు. 1981లో అదే సినిమా హిందీలో "ఏక్ ధూజే కేలియే"గా పునర్మించినప్పుడు తిరిగి అదే పాత్రను పోషించింది. హిందీలో కూడా ఈ చిత్రం అఖండ విజయం సాధించింది.

తొలిదశ[మార్చు]

మాధవి హైదరాబాదులో శశిరేఖ, గోవిందస్వామి దంపతులకు జన్మించింది. ఈమెకు ఒక చెల్లెలు, ఒక తమ్ముడు. చిన్నతనంలోనే ఉమా మహేశ్వరి వద్ద భరతనాట్యం, భట్ వద్ద జానపద నృత్యం నేర్చుకొని వేలాది నృత్య ప్రదర్శనలు ఇచ్చింది. ఈమె విద్యాభ్యాసం హైదరాబాదు అబిడ్స్ లోని స్టాన్లీ బాలికల పాఠశాలలో సాగింది.[1] ఎనిమిదో తరగతి చదువుతుండగా రవీంద్రభారతిలో నాట్య ప్రదర్శన ఇస్తున్న కనక విజయలక్ష్మిని దాసరి నారాయణరావు చూసి, తను తీయబోయే కొత్త సినిమాకో నూతన నటి కావాలని ఆమె తల్లిదండ్రుల అనుమతి తీసుకుని సినిమా రంగంలో ప్రవేశపెట్టాడు. అప్పటికే సినిమా రంగంలో విజయలక్ష్మి, లక్ష్మి పేర్లతో చాలామంది ఉండటంతో కనక విజయలక్ష్మిని ఆయన 'మాధవి' అని సినీనామకరణం చేశాడు.[2]

1996 ఈమె వ్యాపారవేత్త శర్మను పెళ్లాడి న్యూజెర్సీలో స్థిరపడి తన ముగ్గురు పిల్లలను పెంచుతూ భర్తకు వ్యాపారంలో తోడ్పడుతుంది. ఈమె భర్త భారత, జర్మన్ సంతతికి చెందినవాడు. సినిమాలనుండి నిష్క్రమించినా మంచి సినిమాలను చూసినప్పుడు ఇప్పటికీ నటించాలనే కోరిక కలుగుతుందని ఈమె అన్నది.[3]

మాధవి నటించిన తెలుగు చిత్రాలు[మార్చు]

మలయాళ సినిమాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Maadhavi". Maadhavi. Archived from the original on 2013-01-14. Retrieved 2012-06-09.
  2. ఐదో పడిలో అందాల భరిణ .... 'మాధవి' - కనకదుర్గ ఇంటర్వ్యూ[permanent dead link]
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-07-02. Retrieved 2007-05-25.

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=మాధవి&oldid=4183810" నుండి వెలికితీశారు