ఊరికిచ్చిన మాట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఊరికిచ్చిన మాట
(1981 తెలుగు సినిమా)
Ooriki Ichina Maata.JPG
దర్శకత్వం బాలయ్య
తారాగణం చిరంజీవి,
బేతా సుధాకర్,
మాధవి
సంగీతం ఎం.ఎస్. విశ్వనాధన్
నిర్మాణ సంస్థ అమృతా ఫిలింస్
భాష తెలుగు


ఊరికిచ్చిన మాట 1981 జూన్ 24న విడుదలైన తెలుగు సినిమా. అమృతా ఫిలింస్ పతాకంపై అలపర్తి సూర్యనారాయణ, మన్నవ వెంకట రావు లు నిర్మించిన ఈ సినిమాకు మన్నవ బాలయ్య దర్శకత్వం వహించాడు. చిరంజీవి, సుధాకర్, మాధవి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఎం.ఎస్.విశ్వనాథన్ సంగీతాన్నందించాడు.[1][2][3]

తారాగణం[మార్చు]

సంక్షిప్త చిత్రకథ[మార్చు]

చిరంజీవి, సుధాకర్ లు అన్నదమ్ములు. వారుండే పల్లెటూరికి వైద్య సదుపాయం లేదు. తమ్ముడు డాక్టరు చదువుకు చిరంజీవి తన వూరి జనం వద్ద సహాయం తీసుకుంటాడు. తన తమ్ముడు చదువు పూర్తైనాక వారికి వైద్యసేవలు చేస్తాడని మాటిస్తాడు. పట్నం మోజులో, పల్లెటూరికి తిరిగి రావడానికి తమ్ముడు మొదట నిరాకరించినప్పుడు, నిరాశకి లోనైనా, తమ్ముడిలో పరివర్తన తీసుకురావడం స్థూలంగా కథా విషయం.

సాంకేతిక వర్గం[మార్చు]

 • దర్శకత్వం: మన్నవ బాలయ్య
 • స్టూడియో: అమృత ఫిల్మ్స్
 • నిర్మాత: అలపర్తి సూర్యనారాయణ, మన్నవ వెంకట రావు
 • ఛాయాగ్రాహకుడు: ఎస్.ఎస్.లాల్
 • కూర్పు: ఎస్.పి.ఎస్. వీరప్ప
 • స్వరకర్త: ఎం.ఎస్. విశ్వనాథన్
 • గీత రచయిత: సి.నారాయణ రెడ్డి, జాలాది
 • విడుదల తేదీ: జూన్ 24, 1981
 • సమర్పించినవారు: బాలయ్య మన్నవ
 • కథ: బాలయ్య మన్నవ
 • చిత్రానువాదం: బాలయ్య మన్నవ
 • సంభాషణ: డి.వి. నరసరాజు
 • గాయకుడు: ఎస్.పి.బాలాసుబ్రహ్మణ్యం, పి.సుశీల, వాణీ జయరాం, పి.వి. చలపతి రావు
 • ఆర్ట్ డైరెక్టర్: కె.ఎల్. ధార్
 • డాన్స్ డైరెక్టర్: ఎన్.ఎ.తారా (డాన్స్ మాస్టర్)

మూలాలు[మార్చు]

 1. http://www.idlebrain.com/celeb/starhomes/chiranjeevi/filmography.html
 2. http://www.chiranjeeviblog.com/filmography/chiranjeevi-filmography.html
 3. staff. "Ooriki Ichina Maata (U)". Filmibeat. Retrieved 16 June 2015. CS1 maint: discouraged parameter (link)

బాహ్య లంకెలు[మార్చు]