Jump to content

మాడా వెంకటేశ్వరరావు

వికీపీడియా నుండి
మాడా వెంకటేశ్వరరావు

లంబాడోళ్ళ రాందాసు చిత్రంలో మాడా
జన్మ నామంమాడా వెంకటేశ్వరరావు
జననం (1950-10-10)1950 అక్టోబరు 10 [1]
మరణం 2015 అక్టోబరు 24(2015-10-24) (వయసు 65) [2]
హైదరాబాదు
ఇతర పేర్లు మాడా, అభినయకళానిధి
ప్రముఖ పాత్రలు చిల్లరకొట్టు చిట్టెమ్మ-పున్నయ్య
లంబాడోళ్ళ రాందాసు
మాయదారి మల్లిగాడు
ముత్యాలముగ్గు
సఖియా
శివయ్య

మాడా వెంకటేశ్వరరావు (1950 అక్టోబర్ 10 - 2015 అక్టోబర్ 24) తెలుగు నటుడు. ఇతను "మాడా" అనే తన ఇంటిపేరు తోనే ప్రసిద్ధుడు. ఇతడు నపుంసక పాత్రలకు పెట్టింది పేరు.

జీవిత విశేషాలు

[మార్చు]

1950, అక్టోబర్ 10 న వెంకటేశ్వరరావు తూర్పు గోదావరి జిల్లా, కడియంలో జన్మించారు. సినిమాల్లోకి రాకముందు విద్యుత్ సంస్థలో ఉద్యోగం చేసేవారు. ఆ సమయంలో పలు నాటకాల్లో నటించారు. ముత్యాలముగ్గు, చిల్లరకొట్టు చిట్టెమ్మ సినిమాలతో మాడకు మంచి గుర్తింపు లభించింది. లంబాడోళ్ల రాందాసు, మాయదారి మల్లిగాడు, ముత్యాలముగ్గు, సఖియా, శివయ్య వంటి చిత్రాలలో నటించారు. మాడాకు అభినయ కళానిధి అనే బిరుదు ఉంది. చూడు పిన్నమ్మ అనే పాత్రతో మాడాకు మంచి గుర్తింపు వచ్చింది.[3]

నేపథ్యము

[మార్చు]

చలన చిత్రాలలో నటించడానికి ముందు ఇతడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ విభాగంలో ఉప సాంకేతిక అధికారిగా పనిచేశాడు.[4]

నటించిన సినిమాలు

[మార్చు]

ఇతడు నటించిన తెలుగు సినిమాల పాక్షిక జాబితా:

  1. మాయదారి మల్లిగాడు (1973)
  2. ముత్యాలముగ్గు (1975)
  3. చిల్లరకొట్టు చిట్టెమ్మ (1978)
  4. లంబాడోళ్ళ రాందాసు (1978)
  5. మూగకు మాటొస్తే (1980)
  6. కోరుకున్న మొగుడు (1982)
  7. మెరుపు దాడి (1984)
  8. కృష్ణ గారడీ (1986)
  9. ఆస్తులు అంతస్తులు (1988)
  10. ఆయుధం (1990)
  11. శివయ్య (1998)
  12. సాహసవీరుడు - సాగరకన్య (1996)
  13. దేవి నాగమ్మ (2002)
  14. సఖియా (2004)

పేరుపడ్డ సంభాషణలు

[మార్చు]
  • ఏంటి బాయ్యా?

సన్మానం

[మార్చు]
  1. 2012 అక్టోబరు 7, ఆదివారం నాడు, మాడా వెంకటేశ్వరరవుకు అనంతపురంలో అనంతకళావాహిని సంస్థ దశమ వార్షికోత్సవం సందర్భంగా స్వర్ణకంకణ ధారణ జరిపి,అభినయ కళానిధి బిరుదును ప్రదానం చేశారు.[5]
  2. ఉగాది పురస్కారం (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, హైదరాబాదు, 11 ఏప్రిల్ 2013)[6]

మరణం

[మార్చు]

కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ 2015, అక్టోబర్ 24 శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు.

మూలాలు

[మార్చు]
  1. "హాస్యనటుడు కన్నుమూత". Archived from the original on 2015-10-16. Retrieved 2015-10-20.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-10-17. Retrieved 2015-10-14.
  3. "మాడా కన్నుమూత". Archived from the original on 2016-03-11. Retrieved 2015-10-20.
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-04-08. Retrieved 2010-10-06.
  5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-10-27. Retrieved 2012-10-08.
  6. సాక్షి, ఎడ్యుకేషన్ (9 April 2013). "41 మందికి ఉగాది పురస్కారాలు...15 మందికి హంస అవార్డులు". www.sakshieducation.com. Archived from the original on 17 ఏప్రిల్ 2020. Retrieved 17 April 2020.

బయటి లింకులు

[మార్చు]