మెరుపు దాడి
మెరుపు దాడి | |
---|---|
దర్శకత్వం | పి.ఎన్.రామచంద్రరావు |
కథా రచయిత | అప్పలాచార్య (సంభాషణలు) గిరిబాబు (చిత్రానువాదం) |
కథ | గిరిబాబు |
నిర్మాత | గిరిబాబు |
తారాగణం | సుమన్, సుమలత , భానుచందర్, శ్యామల గౌరి |
సంగీతం | ఇళయరాజా |
భాష | తెలుగు |
మెరుపు దాడి భ్రమరాంబికా మూవీస్ పతాకంపై పి.యన్.రామచంద్రరావు దర్శకత్వంలో నటుడు గిరిబాబు 1984లో నిర్మించిన యాక్షన్/అడ్వెంచర్ హిట్ చిత్రం. చిత్తూరు జిల్లా తలకోన అడవుల్లో నిర్మించబడిన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందించారు. ఈ చిత్రంలో రాజాగా హీరో సుమన్, గండడుగా హీరో గిరిబాబు, భానుగా హీరో భానుచందర్, శివంగిగా సుమలత, మాలాదేవిగా జయమాలిని, ప్రొఫెసర్ వర్మగా రంగనాధ్, మృతసంజీవరాయుడుగా గొల్లపూడి మారుతీరావు, బహదూర్ గా ప్రభాకర రెడ్డి, అంజిగా సారథి ప్రధాన పాత్రధారులుగా నటించారు.
కథ[మార్చు]
చరిత్ర పుస్తకాలు, చిత్రపటాలను అధ్యయనం చేసి రత్నగిరి సామ్రాజ్యపు గుప్త నిధి ఆచూకీ తెలుసుకున్న వర్మ ఆ నిధిని సొంతం చేసుకుంటానికి భాను, రాజా అనే అనాథ యువకులను చేరదీస్తాడు, వీరిద్దనీ ఒక హోటల్లో మాలాదేవికి పరిచయం చేస్తాడు. రాజా, భాను యుద్ధవిద్యలు ప్రదర్శించలో దిట్టయైన గండడుకి, అతని సోదరియైన సివంగికి పరిచయమవుతారు. వర్మ తని నిధి వేటకు ఆయుర్వేద వైద్యుడైన మృతసంజీవరాయుడిని కూడా సాయంకోరతాడు.
నిధిరహస్యం తెలుసుకోవడానికి కొంతమంది దుండగులు గండడుని, అతని సోదరి సివంగిని ఎత్తుకుపోయి వారిని చిత్రహింసలకు గురిచేస్తారు. వర్మ, రాజా, భాను, మాలాదేవి, మృతసంజీవరాయుడు అక్కడికి చేరుకొని గండడుని, అతని సోదరి సివంగిని దుండగుల చెరనుండి రక్షిస్తారు. కృతజ్ఞతగా గండడు, అతని సోదరి సివంగి తమ గ్రామానికి వర్మ టీమ్ ని ఆహ్వానిస్తారు. ఆ తర్వాత ఎనిమిది మంది కలిసి నిధి వేటకు ప్రయాణమవుతారు.
ఈలోగా ప్రొఫెసర్ వర్మ ఇల్లుని బహదూర్ సోదా చేసి నిధి రహస్యం తెలుసుకుంటాడు. అడవిలో వర్మ టీమ్ ను అడవి మనుషులు బందిస్తారు. అడవి మనుషులు తమను కొండ దేవతకు బలివ్వబోతున్నారని వర్మ టీమ్ గ్రహిస్తుంది. అడవి మనుషుల్లో 'వాసకి' అనే అమ్మాయిని భాను ప్రేమిస్తాడు. భానుని విడిపించమని వాసకి తన తండ్రిని ప్రాధేయపడటంతో ఆమె తండ్రి భానుకి, మరో అడవిమనిషికి మధ్య శూల యుద్ధం నిర్వహిస్తాడు. ఆ శూల యుద్ధంలో గెలిచిన భాను వాసకిని పెళ్ళాడతాడు. భాను పై ప్రేమ చొప్పున వాసకి ఒక రాత్రి బంధించబడిన భానుని, వర్మ టీమ్ ని రహస్యంగా విడిపిస్తుంది. అడవిమనుషులు వారిని తరమడంతో భానుతో ఉన్న వాసకి బాణం గుచ్చుకోవడంతో మరణిస్తుంది.
అడవి ప్రయాణంలో రాజా, సివంగి ప్రేమలో పడతారు. సివంగి ఆత్మహత్యయత్న ఘటన తర్వాత రాజా- సివంగి పెళ్ళికి గండడు అంగీకరిస్తాడు. ప్రొఫెసర్ వర్మ వద్ద ఉన్న నిధి రహస్య చిత్ర పటాన్ని మృతసంజీవరాయుడు, మాలాదేవి దొంగిలించే ప్రయత్నంలో అంజిని చంపేస్తారు. ఆ తర్వాత మృతసంజీవరాయుడు బహదూర్ టీమ్ చే అపహరించబడతాడు, బహదూర్ లో చేతులు కలుపుతాడు. వర్మ టీమ్ నిధి దాచబడి ఉన్నగుహను చేరి అందులో నిధిని సాధిస్తారు. బయట వేచియున్న మృతసంజీవరాయుడు, బహదూర్ వారిని బంధిస్తారు. వర్మ స్నేహితులను (రాజా, భాను తల్లిదండ్రులను) చంపింది తనేనని బహదూర్ చెబుతాడు. రాజా, భాను హంతకుడైన బహదూర్ ని చంపి నిధి పెట్టెను దక్కించుకోవడంతో కథ సుఖాంతమవుతుంది.
తారాగణం[మార్చు]
- ప్రొఫెసర్ వర్మగా రంగనాథ్
- భానుగా భానుచందర్
- రాజాగా సుమన్
- మాలాదేవిగా జయమాలిని
- గండడుగా గిరిబాబు
- సివంగిగా సుమలత
- డాక్టర్ మృతసంజీవరాయుడుగా గొల్లపూడి మారుతీరావు
- బహదూర్ గా ప్రభాకర్ రెడ్డి
- సుత్తి వీరభద్రరావు
- మాడా వెంకటేశ్వరరావు
- సిల్క్ స్మిత
- చలపతి రావు
- సారథి
పాటలు[మార్చు]
- వెండి మబ్బు చీర కట్టుకో
- ఇటు ప్రళయం అటు విలయం
- కోడి కాదురా ఈ లేడి నందుకో
- కొడమ్మో నీ ఒళ్ళంతా
మూలాలు[మార్చు]
బయటి లింకులు[మార్చు]
- Articles with short description
- Pages with lower-case short description
- Short description is different from Wikidata
- Pages using infobox film with unknown empty parameters
- గొల్లపూడి మారుతీరావు చిత్రాలు
- రంగనాథ్ నటించిన చిత్రాలు
- భానుచందర్ నటించిన సినిమాలు
- సుమన్ నటించిన చిత్రాలు
- సుమలత నటించిన చిత్రాలు
- సుత్తి వీరభద్రరావు నటించిన సినిమాలు