Jump to content

నర్రా వెంకటేశ్వర రావు

వికీపీడియా నుండి
(నర్రా వెంకటేశ్వరరావు నుండి దారిమార్పు చెందింది)
నర్రా వెంకటేశ్వర రావు
జననం1947
మరణం2009 డిసెంబరు 27(2009-12-27) (వయసు: 62)
హైదరాబాద్
మరణ కారణంగుండెపోటు
జాతీయతభారతీయుడు
వృత్తినటుడు
క్రియాశీలక సంవత్సరాలు1974-2009
భాగస్వామిసుశీల
పిల్లలుమురళి, వసంతలక్ష్మి

నర్రా వెంకటేశ్వర రావు తెలుగు నటుడు.[1] ఎక్కువగా సహాయ, ప్రతినాయక, హాస్య పాత్రలలో నటించాడు. ముప్ఫై సంవత్సరాలకి పైగా నటనానుభవం కలిగిన ఆయన సుమారు 500 సినిమాలకు పైగా నటించాడు. ఆయన స్వస్థలం ప్రకాశం జిల్లా, అగ్రహారం గ్రామం.[2]

జీవిత విశేషాలు

[మార్చు]

నర్రా వెంకటేశ్వర రావు 1947లో ప్రకాశం జిల్లాలోని అగ్రహారం అనే గ్రామంలో జన్మించాడు. చిన్నప్పటి నుంచే నాటకాలలో నటించిన అనుభం ఆయనకుంది. ఆయన భార్య పేరు సుశీల. వారికి ఒక కొడుకు మురళి, ఒక కూతురు వసంతలక్ష్మి.

కెరీర్

[మార్చు]

ఆయన 1974లో చదువు సంస్కారం అనే సినిమా తో సినీరంగ ప్రవేశం చేశాడు. ఆయన చివరి సినిమా దాసరి నారాయణ రావు దర్శకత్వంలో వచ్చిన మేస్త్రి.

మరణం

[మార్చు]

ఆయన డిసెంబరు 27, 2009న 62 సంవత్సరాల వయసులో గుండెపోటుతో మరణించాడు.

నటించిన సినిమాల పాక్షిక జాబితా

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Telugu Movie Actor Narra Venkateswara Rao". nettv4u.com. Retrieved 13 September 2016.
  2. "క్యాన్సర్‌ చివరి స్టేజ్‌.. చావు తథ్యమని ఏడ్చిన నటుడు | Actor Narra Venkateswara Rao Daughter About His Father Final Days, Recalls His Emotional Battle With Cancer | Sakshi". www.sakshi.com. Retrieved 2026-03-17.
  3. తెలుగు ఫిల్మ్ నగర్, సినిమా (9 October 2019). "మ్యూజిక‌ల్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ 'పెళ్లి చేసుకుందాం'కు 22 ఏళ్ళు". www.thetelugufilmnagar.com. Prabhu. Archived from the original on 14 June 2020. Retrieved 15 June 2020.