కర్తవ్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కర్తవ్యం
దర్శకత్వంఎ. మోహన గాంధీ
రచనపరుచూరి సోదరులు (మాటలు), మోహన గాంధీ (చిత్రానువాదం)
నిర్మాతఎ. ఎం. రత్నం
తారాగణంవిజయశాంతి
ఛాయాగ్రహణండి. ప్రసాద్ బాబు
కూర్పుగౌతంరాజు
సంగీతంరాజ్ కోటి
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
1990
భాషతెలుగు

కర్తవ్యం 1990 లో ఎ. మోహన గాంధీ దర్శకత్వంలో సూర్య మూవీస్ పతాకంపై ఎ. ఎం. రత్నం నిర్మించిన చిత్రం. ఇందులో విజయశాంతి, వినోద్ కుమార్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఓ నిజాయితీ గల పోలీసు అధికారిణి అంగబలం, అర్థబలం కలిగిన అవినీతి పరులను, రౌడీలను ఎలా ఎదుర్కొన్నదీ ఈ చిత్ర కథాంశం.

ఎ. మోహన గాంధీ దర్శకత్వంలో విజయశాంతి ప్రధాన పాత్రలో వచ్చిన కర్తవ్యం సినిమా, యమున, శారద నటించిన ఆడది సినిమా ఒకేరోజు విడుదలయ్యాయి.[1]

కథ[మార్చు]

హోం మంత్రి బాబూరావు లంచం తీసుకున్నాడని తెలిసి అతని మీద చర్యలు తీసుకోమని దత్తు అనే వ్యక్తి నిరాహార దీక్ష చేస్తుంటాడు. అతన్ని ఎలాగైనా చంపెయ్యమని ముద్దుకృష్ణయ్య అనే అవినీతి వ్యాపారస్తుడి సహాయం కోరతాడు బాబూరావు. అతని కాశీపతి అనే పోలీసు ఇన్‌స్పెక్టర్, లాయరు సహాయంతో నిరాహార దీక్ష చేస్తున్నవారిని బస్సుతో తొక్కించి చంపేయిస్తాడు. బస్సు బ్రేకులు పని చేయకపోవడం వల్లనే ప్రమాదం జరిగిందని కేసు మూసేస్తారు. పట్టణానికి అమ్మమ్మతో కలిసి కొత్త పోలీసు ఆఫీసరుగా వస్తుంది వైజయంతి. వైజయంతి తల్లి చిన్నతనంలోనే చనిపోతే తండ్రి రెండో పెళ్ళి చేసుకుని ఉంటాడు. అలా వైజయంతికి ఒక సవతి తమ్ముడు మురళి, చెల్లెలు కూడా ఉంటారు. శ్రీహరి రావు ఆమెను పట్టించుకోకపోవడానికి కారణం ఆయన భార్య గయ్యాళితనమే. సూరిబాబు సామాజిక స్పృహ కలిగిన యువకుడు. వైజయంతి వస్తూనే తమ పోలీసు శాఖలోనే జరుగుతున్న అక్రమ వసూళ్ళను అడ్డుకుంటుంది. సి. ఐ కాశీపతి ముద్దుకృష్ణయ్యకు తొత్తుగా పనిచేస్తున్నాడని తెలుసుకుంటుంది. కాశీపతి మూసేసిన బస్సు ప్రమాదం కేసును తిరగదోడుతుంది. డ్రైవరును అరెస్టు చేస్తుంది. ఆమె నిజాయితీని ఇష్టపడతాడు సూరిబాబు. ఆమెను ముద్దుకృష్ణయ్యను గురించి హెచ్చరిస్తాడు. కానీ ముద్దుకృష్ణయ్య దౌర్జన్యంతో ఆ కేసును కొట్టివేయిస్తాడు.

ముద్దుకృష్ణయ్య కొడుకు మెడికల్ కళాశాల ప్రశ్నాపత్రాలు లీక్ చేయాలని పథకం వేస్తాడు. ఆ బాధ్యతను మురళి అతని బృందానికి అప్పగిస్తాడు. వాళ్ళు కళాశాల ప్రిన్సిపల్ని బంధించి ప్రశ్నాపత్రాన్ని తస్కరిస్తారు.

నటీనటులు[మార్చు]

పాటలు[మార్చు]

  • ఏందిరలగ చూస్తావు (గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం)
  • అట్టాంటిట్టాంటి దానివని (గానం: ఎస్. జానకి)

మూలాలు[మార్చు]

  1. ఎపి7పీయం, తెలుగు వార్తలు (29 May 2019). "శివకృష్ణకి చెప్పినా వినిపించుకోలేదు: పరుచూరి గోపాలకృష్ణ." www.ap7am.com. Archived from the original on 11 August 2020. Retrieved 11 August 2020.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
"https://te.wikipedia.org/w/index.php?title=కర్తవ్యం&oldid=4008284" నుండి వెలికితీశారు