మీనా
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
మీనా | |
జన్మ నామం | మీనా |
జననం | సెప్టెంబర్ 16, 1975 |
భార్య/భర్త | విద్యాసాగర్ (2009–2022) మరణం (28/6/2022) |
పిల్లలు | 1, నైనికా విద్యాసాగర్ (కూతురు) |
మీనా (సెప్టెంబర్ 16,1975), దక్షిణ భారత సినిమా నటి. అప్పటి మద్రాసు నగరంలో పుట్టి పెరిగిన మీనా తెలుగు, తమిళ, మలయాళం సినిమా రంగములలో పేరుతెచ్చుకొన్నది. 1975, సెప్టెంబర్ 16న మద్రాసులో జన్మించిన మీనా తండ్రి దురైరాజ్ తమిళనాడులో స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందిన వారు. ఈయన తమిళనాడు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. ఈమె తల్లి రాజమల్లిక కూడా అలనాటి తమిళ సినిమా నటి.
మీనా తెలుగు, తమిళ చిత్రాలలో బాలనటిగా సినీరంగ ప్రవేశము చేసింది. బాలనటిగా రజినీకాంత్, కమలహాసన్ తదితర నటులతో నటించి ఆ తరువాత కథానాయికగా యెదిగింది. ఈమె నటించిన తమిళ సినిమాల్లో ముత్తు, యజమాన్, వీరా, అవ్వై షణ్ముగి మంచి విజయాలు సాధించాయి. ఈమె రజనీకాంత్ తో నటించిన సినిమాలు జపాన్లో కూడా విడుదలై మంచి ఆదరణ పొందడము చేత ఈమెకు జపాన్లో కూడా మంచి అభిమానవర్గము ఉంది. మీనా దాదాపు అన్ని దక్షిణ భారత భాషా సినిమాల్లో నటించింది. ఈమె తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రరంగములలోని అగ్ర నాయకులందరితో కలిసి పనిచేసింది. తెలుగులో వెంకటేష్, మీనా జంటగా సుందర కాండ, చంటి, సూర్య వంశం, అబ్బాయిగారు వంటి విజయవంతమైన సినిమాలు వచ్చాయి. ఇలా తెలుగు, తమిళ చిత్రరంగాలలో 1991 నుండి 2000 వరకూ, సుమారు ఒక దశాబ్దం పాటు అగ్రతారగా నిలచింది.
వ్యక్తిగత జీవితం
[మార్చు]2009లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విద్యాసాగర్‌తో మీనా వివాహం అయింది. ఈ దంపతులకు నైనికా అనే కుమార్తె ఉంది. తేరీ (తెలుగులో పోలీస్) సినిమాలో నైనిక చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది. పోస్ట్ కొవిడ్ సమస్యలతో బాధపడుతూ 2022 జూన్ 28న రాత్రి చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో మీనా భర్త తుది శ్వాస విడిచారు.[1]
మీనా నటించిన తెలుగు సినిమాలు
[మార్చు]
|
మీనా నటించిన తమిళ సినిమాలు
[మార్చు]
|
|
|
మీనా నటించిన మళయాళ సినిమాలు
[మార్చు]
|
మీనా నటించిన కన్నడ సినిమాలు
[మార్చు]- పుట్నంజ
మీనా నటించిన హిందీ చిత్రాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "నటి మీనా భర్త హఠాన్మరణం". web.archive.org. 2022-06-28. Archived from the original on 2022-06-28. Retrieved 2022-06-28.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)