Jump to content

స్నేహం కోసం

వికీపీడియా నుండి
స్నేహం కోసం
దర్శకత్వంకె. ఎస్. రవికుమార్
రచనఎ. ఎం. జ్యోతికృష్ణ (కథ), కె. ఎస్. రవికుమార్ (చిత్రానువాదం), పరుచూరి సోదరులు (మాటలు)
నిర్మాతఎ. ఎం. రత్నం
తారాగణంచిరంజీవి,
మీనా ,
విజయకుమార్
ఛాయాగ్రహణంకె. దత్తు
కూర్పుకోలా భాస్కర్
సంగీతంఎస్. ఎ. రాజ్ కుమార్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
1999
భాషతెలుగు

స్నేహం కోసం 1999 లో కె. ఎస్. రవికుమార్ దర్శకత్వంలో విడుదలైన సినిమా. చిరంజీవి, మీనా ఇందులో ప్రధాన పాత్రధారులు. శ్రీ సూర్య మూవీస్ బ్యానరు పై ఎ. ఎం. రత్నం ఈ చిత్రాన్ని నిర్మించాడు. చిరంజీవి ఇందులో తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశాడు. తండ్రి చిరంజీవికి ఆప్తమిత్రుడిగా ప్రముఖ నటుడు విజయకుమార్ నటించాడు.

తమిళంలో కె. ఎస్. రవికుమార్ దర్శకత్వంలోనే వచ్చిన నట్పుక్కాగ అనే చిత్రం ఈ సినిమాకు మాతృక. తమిళంలో శరత్ కుమార్, సిమ్రాన్ జంటగా నటించారు.

అనకాపల్లి గ్రామంలో జమీందారు పెద్దయ్య (విజయ కుమార్) దగ్గర నమ్మినబంటు చిన్నయ్య (చిరంజీవి). పెద్దయ్య పెద్ద కూతురు గౌరి (సితార)ని తన బావమరిది పెద్దబ్బాయి (ప్రకాష్ రాజ్)కి ఇచ్చి పెళ్ళి చేసి ఉంటాడు. కానీ ఆ కుటుంబం అంటే పెద్దయ్యకి పడదు. చిన్న కూతురు ప్రభావతి (మీనా) విదేశాల్లో చదువుకుని వస్తుంది. తండ్రి దగ్గర మాత్రం అక్క గౌరిని ద్వేషించినట్లు నటించినా తనను చిన్నప్పటి నుంచి ఎత్తుకుని పెంచిన ఆమె మీద అభిమానం చూపిస్తుంటుంది.

తారాగణం

[మార్చు]

విశేషాలు

[మార్చు]
  • తమిళ చిత్రం నట్పుక్కాగ ఈ చిత్రానికి మూలం. శరత్ కుమార్ కథా నాయకుడు.

పాటలు

[మార్చు]

ఈ సినిమాలో వేటూరి సుందర్రామ్మూర్తి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి, భువన చంద్ర, ఎ. ఎం. రత్నం, చంద్రబోస్ పాటలు రాశారు. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, మనో, ఉదిత్ నారాయణ్, జయచంద్రన్, రాజేష్, కృష్ణంరాజు, కవిత కృష్ణమూర్తి, సుజాత, సౌమ్య పాటలు పాడారు,

  1. అయ్యగారూ భలే మంచి వారు (గానం: బాలు) రచన: ఏ. ఎం రత్నం .
  2. ఒళ్లంత సెగలు
  3. కైకలూరి కన్నె పిల్లా... (గానం: ఉదిత్ నారాయణ్, వనితా కృష్ణమూర్తి) రచన: వేటూరి సుందర రామమూర్తి.
  4. మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువ , రాజేష్, రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి.
  5. ఊహాలలో ఊపిరిలో ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, సుజాత మోహన్ , రచన:భువనచంద్ర .
  6. గుండెల్లో గుబులు , సౌమ్య , రచన: ఎ.ఏం రత్నం

మూలాలు

[మార్చు]